ఈ బిగ్‌బాస్ షో ద్వారా స్టార్ మాటీవీ వాడికి వచ్చే రేటింగ్స్, యాడ్స్, పాపులారిటీ మాటేమిటో గానీ… అందులో పాల్గొనే వాళ్లకు వచ్చే పబ్లిసిటీ మైలేజీ, ఇతరత్రా డబ్బు ఫాయిదాల మాటేమిటో గానీ… ఒక్కసారిగా కొన్ని వేరే ప్రోగ్రామ్స్ డిస్టర్బ్ అవుతాయి… సపోజ్, యాంకర్‌గా చేసే దీపిక పిల్లి హఠాత్తుగా బిగ్‌బాస్ హౌజులోకి వెళ్లిపోతే పెద్ద ఫరక్ పడదు… ప్రస్తుతం ఆమె రెగ్యులర్‌గా చేస్తున్న షోలు ఏమీ లేవు… కానీ మంగళంపల్లి శ్రీసత్యను తీసుకొండి…
జీతెలుగులో త్రినయని సీరియల్ చేస్తోంది ఆమె… కీలకపాత్రే… ఆ పాత్ర కథాపరంగా కూడా ఇప్పుడు కీలకమే… కాస్త అమాయకత్వంతో కూడిన విలనీ షేడ్స్ ఉన్న పాత్ర… అన్ని సీరియళ్లలోలాగే ఇందులోనూ కథాకథనాలు చెత్తా… దాని గురించిన చర్చ కాదు, ఈమె ఓ విచిత్రమైన వాయిస్‌తో బాగానే చేసేది… మాట్లాడటానికి అవస్థపడుతున్నట్టుగా ఉంటుంది వాయిస్… హఠాత్తుగా శనివారం ఆమె మాయమైపోయింది… కొత్త మొహం ఏదో కనిపించింది…
Ads
అఫ్‌కోర్స్, సీరియళ్లలో నటీనటులను ఊడబీకడం, కొత్తవాళ్లను పెట్టేయడం సాధారణంగా జరుగుతూ ఉంటయ్… పేమెంట్స్ గట్రా సమస్యలు వస్తుంటయ్… దాంతో కొత్తవాళ్లను పెడుతుంటారు, ప్రేక్షకులు కూడా ఇట్టే అలవాటు పడతారు… హఠాత్తుగా ఈమెకు ఏమైందబ్బా, ఎందుకు పీకేశారు అని డౌటొచ్చింది… కానీ పీకేయడం కాదు, ఆమే బిగ్‌బాస్ హౌజులోకి వెళ్తోందట…
సహజంగానే సీరియల్ షూటింగు డిస్టర్బ్ అయినట్టే కదా… మరేం చేస్తారు..? మరో కొత్త నటిని తెచ్చిపెట్టేశారు అర్జెంటుగా… మనసిచ్చిచూడు సీరియల్‌లో ఈమెది ఓ దరిద్రపు పాత్ర… తను పిల్లాడినో, పిల్లనో కని హీరోహీరోయిన్లకు ఇవ్వాలి… తను అనామకురాలు… సరే, ఆ కథ లక్ష వంకర్లు తిరిగి ఈమె పాత్ర కూడా నడమంత్రంగా మాయమైపోతుంది… అసలు సీరియలే హఠాత్తుగా ఆపేశారు… ఈమెకు ఇప్పుడిక త్రినయని చాన్స్ కూడా పోయింది… బిగ్‌బాస్ వాడు ఇచ్చే డబ్బు మీద ఆశ…
నిజానికి ఓ విషయాన్ని నిర్మొహమాటంగా చెప్పుకోవాలి… బిగ్‌బాస్ హౌజులోకి వెళ్లి వచ్చినంత మాత్రాన ఆ పాపులారిటీ లాంగ్ రన్‌లో కంటెస్టెంట్లకు ఏమీ ఉపయోగపడదు… చిన్నాచితకా టీవీ షోలలో పాల్గొని, వాళ్లు ఇచ్చినంత తీసుకునేవరకు వోకే… లేదా అదే మాటీవీ క్రియేటివ్ టీంతో మంచి రిలేషన్స్ గనుక ఉంటే ఆ సీరియళ్లు, టీవీ షోలలో ఎలాగోలా అడ్జెస్ట్ కావచ్చు… చాలామంది చేసేది అదే… మగవాళ్లయితే ఆ అవకాశాలూ తక్కువే… మబ్బుల్లో నీళ్లు చూసి ముంత ఒలకబోసుకున్నట్టేనా బిగ్‌బాస్ పయనం కోసం చేతిలో ఉన్న అవకాశాల్ని జారవిడుచుకోవడం అంటే…!!
Share this Article