బ్రహ్మాస్త్ర… ఈ సినిమాల శకునాలు బాగాలేవురా బాబూ అని ‘ముచ్చట’ చెబితే… రాజమౌళీ, నువ్వు చాలా రిస్కులో ఉన్నావు బ్రో అని చెబితే… కొంతమంది రాజమౌళి అభిమానులకు కోపమొచ్చింది… కానీ నిజాలు ఎప్పుడూ నిజాలే… మీకు తెలుసు కదా… ప్రతి సినిమా రిలీజుకు కాస్త ముందు దుబయ్‌లోని ఓవర్సీస్ సెన్సార్ బోర్డు సభ్యుడిగా చెప్పుకునే ఉమైర్ సంధూ ఆ సినిమాల గురించి ఫస్ట్ రివ్యూ అని ఏదో ట్వీట్ చేస్తుంటాడు…
తన ట్వీట్ కనిపించడమే ఆలస్యం, మన మీడియా, సోషల్ మీడియా, ట్యూబ్ మీడియా రెచ్చిపోయి… ఇదుగో ఫస్ట్ రివ్యూ అని హంగామా చేస్తుంటయ్… నిజానికి నాసిరకం సినిమాల్ని కూడా ఆహా ఓహో అని పొగుడుతాడు… అదొక అపశకునం పక్షి… తను బాగుంది అని రాశాడంటే చాలు, అది డమాల్ అంటుంది సాధారణంగా… ఐనా సరే, మనవాళ్లకు ఉ– ఆగదు…
ఈసారి తనను మేనేజ్ చేయలేదేమో బ్రహ్మాస్త్ర టీం… ఛట్, ఇదేం సినిమార భయ్ అన్నట్టుగా ట్వీట్లు పెడుతున్నాడు… జస్ట్, రెండున్నర రేటింగ్ అంటున్నాడు… ఐనాసరే, మనవాళ్లు ఫస్ట్ రివ్యూ అంటూ తన ట్వీట్ బేస్ చేసుకుని వార్తలు కుమ్మేస్తూనే ఉన్నారు… నిజానికి ఉమైర్ సంధూ పక్కా నాన్-సీరియస్ రివ్యూయర్… తన మామూలు ధోరణిని బట్టి ‘‘బ్రహ్మాస్త్ర ఇరగదీశారు’’ అని ట్వీటుతాడు అనుకున్నారు అందరూ… కానీ ఫుల్ రివర్స్… ఇదుగో తన ట్వీట్లు…
Ads
On the whole, #Brahmastra lacks soul. At the box-office, the publicity blitzkrieg might ensure good returns in its opening day weekend, but the cracks should start appearing sooner than expected, since the film fails to keep you hooked. Its fall is imminent! ⭐️⭐️1/2
— Umair Sandhu (@UmairSandu) September 6, 2022
#Brahmastra is a big film in all respects — big stars, big canvas, big expenditure on SFX, big ad spend, big expectations. Sadly, it's a big, big, big letdown as well !
Strictly AVERAGE! ⭐️⭐️1/2
— Umair Sandhu (@UmairSandu) September 5, 2022
స్టిక్ట్‌లీ యావరేజ్ అట… రెండున్నర రేటింగ్ అట… హై వీఎఫ్ఎక్స్ విజువల్స్‌తో కొన్ని సన్నివేశాలు ఆవిష్కరించాడు దర్శకుడు అంటూనే… సినిమాటోగ్రఫీ కన్నులవిందు అంటూనే… కొన్ని సన్నివేశాల్లో లైటింగ్ మరీ డార్క్, స్క్రీన్ ప్లే మాత్రం యావరేజీ, ఇంటర్వెల్ పోర్షన్‌లో సన్నివేశాలు బోరింగ్, సంగీతానికి కూడా రెండున్నర రేటింగే అంటూ ఏదేదో రాసుకుంటూ పోయాడు…
రణబీర్ కపూర్ అద్భుతంగా నటించాడట… తన పార్ట్ ఎంతో కన్విన్సింగ్‌గా చేశాడట… కానీ. కొన్ని సన్నివేశాల్లో కన్ఫ్యూజింగ్‌గా కనిపించాడట… విలనీ చేసిన మౌనీ రాయ్ (Mouni Roy) ఇంకా నాగిన్ మోడ్‌లోనే ఉందట… ఆమె అంతగా ఆకట్టుకోదట… ఆలియాభట్ క్యూట్ గా కనిపిస్తుంది కానీ మొత్తంగా చెప్పాలంటే మాత్రం ‘బ్రహ్మాస్త్ర’ చిత్రంలో ఆత్మ మిస్ అయిందని తేల్చేశాడు చివరకు… ప్రమోషన్స్ బాగా చేయడం వల్ల ఫస్ట్ వీకెండ్‌లో మంచి రిటర్న్స్ వస్తాయట… అయితే ఆశించిన స్థాయిలో వసూళ్ళు వస్తాయని చెప్పలేడట…
ఆహా ఓహో అని చెప్పలేక… యావరేజీ అంటూ పంక్చర్ చేశాడు తను… నిజానికి ఇలాంటి రివ్యూ ఉమైర్ సంధూ వంటి రివ్యూయర్ నుంచి ఎక్స్‌పెక్ట్ చేయడమే ఓ అబ్బురం… చివరకు ఆ అపశకున పక్షికే నచ్చలేదంటే, నిజంగా సినిమా నాణ్యత ఎలా ఉందో మరి… ఏమోలెండి… 3 రోజులు ఆగితే తెలుస్తుంది కదా…!!
Share this Article