రెండు నెలలు కూడా కాలేదు… లలిత్ మోడీ, సుస్మితా సేన్ జంట ప్రేమబంధం పుటుక్కున తెగిపోయింది… ఇప్పుడైతే డేటింగ్, త్వరలో పెళ్లి అంటూ మోడీ ట్వీటినప్పుడే ‘ముచ్చట’ ఓ స్టోరీ వేసింది… ఆమె గతమేమిటో, ఆమె తత్వమేమిటో, తాజాగా మోడీ ఎలా బకరా కాబోతున్నాడో చెప్పింది… నో, నో, ఓ మహిళ కోరుకున్న జీవితాన్ని ఇది అవమానించడమే అని చాలామంది శోకాలు పెట్టారు… కానీ ఏం జరిగింది..? చాలా వేగంగా బకరా అయిపోయాడు…
ఆమెతో కలిసి తీయించుకున్న మాల్దీవుల ఫోటో, పేరు లలిత్ మోడీ తన ఇన్స్టాగ్రాం ఖాతా బయో నుంచి మాయం అయిపోయాయి… మరోవైపు ఆమె పెంచుకుంటున్న రీనీసేన్ 23వ బర్త్‌డే ఫోటోల్ని, వీడియోల్ని షేర్ చేసుకుంటే, లలిత్ మోడీ ఊసే లేదు… ఇద్దరు మాజీ ప్రియుల గ్రీటింగ్స్ ఉన్నాయి… మోడీకి ముందున్న బచ్చాప్రియుడు రోహ్మన్తోనైతే మరీ దగ్గరగా ఫోటో… ఎస్, మనం ముందే చెప్పుకున్నట్టు… ఆమె స్వేచ్ఛా ప్రణయిని… ఆమె జీవితంలోకి కొందరు అలా వస్తుంటారు, ఇలా నిష్క్రమిస్తారు… ఆమెకు దేశ, జాతి, కుల, మత, వయోభేదాలేమీ ఉండవు… ఆమెకు ఎవరితోనూ అతకదు, ఏ బంధానికీ కట్టుబడి బతకదు… ప్రణయబంధాల వరకూ వోకే, పరిణయబంధాలు ఆమెను కట్టిపడేయలేవు…
రెండు నెలల క్రితం ‘ముచ్చట’ పబ్లిష్ చేసిన స్టోరీ ఓసారి చదవండి… అది ఆమె గతం…
Ads
నిజానికి 56 ఏళ్ల లలిత్ మోడీ, 46 ఏళ్ల సుస్మిత సేన్ డేటింగ్ అనే వార్త పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు… తనకన్నా 15 ఏళ్లు చిన్నవాడైన రోహ్మన్తోనే కొన్నేళ్లు కలిసి బతికింది… మోడీ ఎంత..? అత్యంత వివాదాస్పద క్రికెట్ వ్యాపారి, లండన్ పారిపోయి బతుకుతున్న లలిత్ మోడీ మాత్రం ‘‘ఇప్పుడు డేటింగే… ఇంకా పెళ్లి చేసుకోలేదు… అదీ ఓరోజు జరుగుతుంది’’ అని ట్వీటుకోవడమే నవ్వు పుట్టించింది… మిస్టర్ మోడీ, ఆమె సుస్మిత… మరీ టాలీవుడ్ మోటుభాషలో చెప్పుకోవాలంటే నువ్వు ఓ తాజా బకరా…
నిజమే… సుస్మితసేన్కు నచ్చితే చాలు, సెలబ్రిటీలతో డేటింగ్ వోకే, నచ్చినన్నిరోజులు మాత్రమే… సహజీవనం కూడా వోకే… కొన్నాళ్లు మాత్రమే… బట్ నో పెళ్లి, నో సంసారం, నో కట్టుబాటు… బయటకు తెలియని బంధాలెన్నో గానీ, ఇండియాటుడే కొన్ని లెక్కకట్టి రాసుకుంటూ పోయింది ఓ స్టోరీలో… దాంట్లో కొన్ని నిజాలు కాకపోవచ్చు, పుకార్లు మాత్రమే కావచ్చు… కానీ ఆమె తత్వం మాత్రం అదే… నవ్వుతూ ఆమె కూడా అంగీకరిస్తుంది… దటీజ్ సుస్మిత…
Just for clarity. Not married – just dating each other. That too it will happen one day. 🙏🏾🙏🏾🙏🏾🙏🏾 pic.twitter.com/Rx6ze6lrhE
— Lalit Kumar Modi (@LalitKModi) July 14, 2022
నిజానికి లలిత్ మోడీతో సుస్మిత డేటింగ్, లవ్వు యవ్వారం రీబిగినింగ్ మాత్రమే… నాట్ బిగినింగ్… గతంలోనే వాళ్ల నడుమ అనుబంధం ఉంది… బోలెడు ఫోటోలు, వార్తలు అప్పట్లో పత్రికల్లో కనిపించేవి… సరే, ఇండియాటుడే కథకొద్దాం… దర్శకుడు విక్రమ్ భట్‌తో చాన్నాళ్లు ఆమె వ్యవహారం కొనసాగింది… అప్పటికే తనకు పెళ్లయింది… వీళ్లిద్దరి యవ్వారం విక్రమ్ భట్, ఆయన భార్య అదితి నడుమ పంచాయితీలకు కూడా దారితీసింది… కొన్నాళ్లకు కటీఫ్ అనేసింది…
కొన్నాళ్లు రణదీప్ హూడాతో వ్యవహారం నెరిపింది… అఫ్కోర్స్ అతనికి కూడా ఇలాంటివి ఇష్టమే… కొన్నాళ్లు కలిసి తిరగడం, తరువాత కటీఫ్ చెప్పేయడం అలవాటే… నిజానికి సినిమా ఫీల్డ్‌లో ఇలాంటి బంధాల్ని పెద్ద అనైతికం అని కూడా ఎవరూ అనుకోరు… అలా అనుకునేవాళ్లు చాన్నాళ్లు ఫీల్డ్‌లో ఉండరు… రణదీప్‌తో సుస్మిత సేన్ లవ్వు వార్తలు అప్పట్లో ప్రతి పత్రికలోనూ కనిపించేవి… సరే, అది కటీఫ్ అయిపోయింది… కార్నర్‌స్టోన్ అనే టాలెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ఓనర్ బంటీ సచ్దేవ్తో ప్రేమాయణం మీద వార్తలు కనిపించేవి కొన్నాళ్లు…
ఏక్ కిలాడీ ఏక్ హసీనీ అనే ఓ టీవీ రియాలిటీ షోకు సుస్మిత, పాక్ క్రికెటర్ వసీం అక్రమ్ సహ జడ్జిలుగా ఉండేవాళ్లు… ఇద్దరి నడుమ లవ్వు పుట్టిందని వార్తలొచ్చేవి… కానీ పెద్ద నమ్మబుల్ అనిపించలేదు… ఎందుకంటే, వసీం మెయింటెయిన్ చేయలేడంటారు… అయిదారు నెలలకే కటీఫ్ అని మళ్లీ రాశాయి పత్రికలు… కారణం, లలిత్ మోడీతో అప్పటికే సుస్మిత అటాచ్ అయిపోవడం… లలిత్ మోడీకి సుస్మితకు ఏదో దూరపు చుట్టరికం కూడా ఏదో ఉందని మీడియా ఉవాచ… కానీ అదీ నమ్మబుల్ కాదు… బెంగాలీ వైద్య కుటుంబానికి చెందిన సుస్మితకు పాటియాలా నుంచి ఢిల్లీకి వచ్చిన మోడీ కుటుంబానికీ లంకె కుదరదు…
ముంబై బేస్డ్ హోటళ్ల వ్యాపారి రితిక్ బాసిన్తో కొన్నాళ్లు సుస్మిత డేటింగ్ నడిచింది… అదీ కొన్నాళ్లే… దీనికి కొన్నాళ్ల ముందు ఫిల్మ్ మేకర్ ముదస్సర్ అజీజ్, ఆమె పోర్ట్‌ఫోలియోలో కనిపించాడు… అదీ ఆయన కుటుంబంలో గొడవలకు దారితీసింది… చివరకు ఇతర కథల్లాగే ఇదీ బ్రేకప్ ఖాతాలోకి చేరిపోయింది… అలా చేరకపోతేనే ఆశ్చర్యం… 36 ఏళ్లున్నప్పుడు 22 ఏళ్ల ఇంతియాజ్ ఖత్రితో సాన్నిహిత్యానికి దారితీసింది… అందరిలాగే ఖత్రి కూడా మేం మంచి ఫ్రెండ్స్ మాత్రమే అనేవాడు మీడియాతో… హాట్‌మెయిల్ ఫౌండర్ సబీర్ భాటియాతో కొన్నాళ్లు… తరువాత తనకన్నా 15 ఏళ్లు చిన్నవాడైన రోహ్మన్తో సహజీవనం చేసింది…
కొన్నిరోజుల క్రితం… తనతో కూడా బ్రేకప్ ప్రకటించినప్పుడు పెద్దగా ఆశ్చర్యమేమీ అనిపించలేదు…అసలు నాలుగైదేళ్లు ఆమె స్టడీగా ఒకరితో కలిసి బతకడమనేదే విశేషం… సరే, ఆమె జీవితం ఆమె ఇష్టం… ఎవరినీ మోసం చేయలేదు… ఎదుటివాళ్ల ఇష్టంతోనే జతకట్టేది… నచ్చకపోతే గుడ్‌బై… అంతే… ఇవన్నీ పక్కన పెడితే… ఆమె జీవితంలో మరో కోణం ఉంది… అదీ ఓసారి చెప్పుకోవాలి… ఎందుకంటే… ఆమె జీవితమంతా రకరకాల వైరుధ్యాలే… ప్రత్యేకించి అప్పటి విశ్వసుందరి ఐశ్వర్యారాయ్‌తో పోలిస్తే పూర్తి కంట్రాస్టు అనిపిస్తుంది…
ఇద్దరి నడుమ ఒకటీరెండేళ్ల తేడా, అంతే… ఒకే సంవత్సరంలో ఒకరు మిస్ వరల్డ్, మరొకరు మిస్ యూనివర్స్… కానీ ఆ అందాల కిరీటాన్ని ఐశ్వర్య సరిగ్గా వాడుకుంది… మంచి సినిమాలు పడ్డయ్, తరువాత ఏకంగా బచ్చన్ కుటుంబంలో చేరింది… ఆమె కథ వేరు… కానీ సుస్మిత కథ వేరు… కొన్నాళ్లు సినిమా అవకాశాలు బాగానే వచ్చినయ్… కానీ తరువాత సరిగ్గా ప్లాన్ చేసుకోలేదు… ఫలితంగా అడపాదడపా అవకాశాలకు, అతిథి పాత్రలకు పరిమితం అయిపోయింది… కొన్నాళ్లకు అవీ ఆగిపోయాయి… ఆరేడేళ్లపాటు ఆమె పేరే వినిపించలేదు ఎక్కడా… మళ్లీ 2020 నుంచే హాట్‌స్టార్ ఓటీటీ వెబ్ సీరీస్ ఆర్యతో యాక్టివ్ అయిపోయింది…
ఆమె హైదరాబాదీ… వాళ్లది ఒక బెంగాలీ వైద్య కుటుంబం… తండ్రి శుబీర్ సేన్ ఎయిర్‌ఫోర్స్‌లో వింగ్ కమాండర్… తల్లి శుభ్రాసేన్ జువెల్లరీ డిజైనర్… ఫెమినా మిస్ ఇండియాగా కిరీటం పొందాక సుస్మిత కన్ను మిస్ యూనివర్స్ మీద పడింది, అదీ గెలిచింది… ఆ టైటిల్ గెలిచిన తొలి ఇండియన్ ఆమె… తరువాత మోడలింగ్, సినిమాల కోసం ఆమె ముంబైకి పూర్తిగా షిఫ్టయిపోయింది…
నిజానికి ఆమె వ్యక్తిగత జీవితం, ఆమె కెరీర్ మాత్రమే కాదు, ఆమె ఆరోగ్యమూ భిన్నమే… Addison’s disease అనే ఓ అరుదైన వ్యాధి ఉంది ఆమెకు… జీవితమంతా స్టెరాయిడ్స్ వాడకం తప్పనిసరి… దీనికితోడు ఆమధ్య ఓ సర్జరీ జరిగింది… ఆ సర్జరీ ఏమిటో, దేనికో చెప్పలేదు కానీ… త్వరగా కోలుకుని, మళ్లీ వర్క్‌లో మునిగిపోవడానికి జిమ్‌లో కష్టపడుతున్నాను అంటూ తన సోషల్ ఖాతాల్లో కొన్ని ఫోటోలు కూడా షేర్ చేసుకుంది అప్పట్లో… ఇద్దరు పిల్లల్ని దత్తత తీసుకుని పెంచుకుంటోంది… ఇదీ ఆమె కథ…
మరి లలిత్ మోడీ పెళ్లి, భార్య కథేమిటి అంటారా… అదీ ఇంట్రస్టింగే… నైజీరియాకు చెందిన మినాల్ సిగ్రానీతో లవ్… ఆమె తనకన్నా తొమ్మిదేళ్లు పెద్ద… తల్లిదండ్రులు అంగీకరించకపోయినా, వాళ్లతో పోరాడి ఆమెను పెళ్లిచేసుకున్నాడు… ఢిల్లీ బంధుగణం అవాయిడ్ చేస్తుండటంతో ముంబైకి వచ్చి కాపురం పెట్టాడు… కానీ ఆమె సుదీర్ఘకాలం కేన్సర్‌తో పోరాడి 64 ఏళ్ల వయస్సులో మరణించింది… వాళ్లకు ఇద్దరు పిల్లలు… బిడ్డ ఆలియా మోడీ ఆమధ్యే వెనిస్లో పెళ్లిచేసుకుంది… (లలిత్ మోడీ మినాల్‌ను పెళ్లిచేసుకునే సమయానికే ఆమెకు కరిమా సాగ్రాణి అనే కూతురు ఉంది… పాత సంబంధం ద్వారా సంతానం ఆమె… ఆమెను కూడా మోడీయే పెంచాడు… ఈ కరిమ పెళ్లి కూడా మరో కథ…)
Share this Article