Bharadwaja Rangavajhala…. ఒకే కథ రెండు కోణాలు…. 1972-73 ప్రాంతాల్లో … మన ప్రత్యగాత్మ గారి సోదరుడు హేమాంబరధరరావు గారి ఇంటిదొంగలు సినిమా షూటింగ్ జరుగుతోంది. కృష్ణంరాజు గారు హీరో. జమున గారు హీరోయిన్.
ఇద్దరి మీద కొండమీద వెండివాన పాట… ఊటీలో షూటింగ్ నడుస్తోంది… తంగప్ప అనే నృత్యదర్శకుడి పర్యవేక్షణలో చిత్రీకరణ నడుస్తోంది… తంగప్ప దగ్గర అసిస్టెంట్ గా ఓ కుర్రాడు పనిచేస్తున్నాడు. అతను హీరో గారికి మూమెంట్స్ చూపిస్తున్నాడు.
హీరో కృష్ణంరాజుకు వాటిని అందుకోవడం చాలా కష్టంగా అనిపించింది. ఆ కుర్రాడు మెరుపులా చేసుకు వెళ్లిపోతున్నాడు. అసలే జనం మధ్య నడుస్తున్న షూటింగు. ఆ కుర్రాడు చేస్తున్నాడు … హీరో గారి వల్ల కావడం లేదు అని జనం అనుకుంటారేమో అని హీరో గారికి అనుమానం.
Ads
దీంతో … ఇలా లాభం లేదని ఆ కుర్రాణ్ణి పక్కకు తీసుకెళ్లి … నువ్వు డాన్సర్ వి బాబూ నేను కాదు … కాబట్టి నేను నేర్చుకుని చేసేలా ఉండాలి మూమెంట్స్ … నువ్వు స్టైల్ మారుస్తావా … లేక మీ గురువుతో మొరపెట్టుకోనా అని అడిగారు.
ఆ కుర్రాడు తలగోక్కుని సరే … అయితే అలాగే చేద్దాం… నో ప్రాబ్లమ్ అని కృష్ణంరాజు గారికి కన్వినియంట్ గా ఉండేలా డాన్స్ మూమెంట్స్ చూపించి ఓకే చేయించాడు. ఆ కుర్రాడి పేరు కమల్ హసన్. ఈ విషయాన్ని కృష్ణంరాజు గారూ కమల్ హసన్ గారూ ఇద్దరూ వేరు వేరు సందర్భాల్లో చెప్పుకున్నారు.
ఇది కృష్ణంరాజు గారి వర్షను. కృష్ణంరాజు గారు నాకు వార్నింగ్ ఇచ్చారు అని కమల్ హసన్ చెప్పారు. అంతే తేడా … మిగిలిన సీనంతా సేమ్ టూ సేమ్ …
Share this Article