ఇక వాళ్ల విడాకుల గురించి వదిలేయండి ప్లీజ్ అని సాక్షాత్తూ నాగార్జునే విలేకరులకు విజ్ఞప్తి చేస్తున్నాడు… ఐనా ఈమధ్య చైతూ-సమంత బ్రేకప్పు మీద కొన్ని కొత్త కొత్త స్టోరీలు కనిపిస్తున్నయ్… యూట్యూబు నుంచి ఆదాయం విపరీతంగా వస్తుండేసరికి, కొత్త కొత్త ఛానెళ్లు పుట్టుకొస్తున్నాయి… థంబ్ నెయిల్స్‌తో ఎవడు తమ స్టోరీని ఓపెన్ చేయించగలడో వాడే తోపు ఇప్పుడు… అందుకే కంటెంట్ ఎలా ఉందనేది ఎవడికీ అక్కర్లేదు, హెడ్డింగ్‌తో జనాన్ని అట్రాక్ట్ చేశామా లేదానేదే ముఖ్యం… ఆ స్టోరీ కూడా జనం చదవాలంటే కంటెంటు కూడా ఫుల్లు మసాలాతో ఉంటే చాలు… ఇంతకీ వాళ్లేం రాస్తున్నారంటే…
‘‘చైతూ, సమంత విడిపోవడానికి కారణం తెలిసిపోయింది… ఇన్నాళ్లూ అందరూ ఏవేవో కారణాల్ని ఊహించారు… కానీ అసలు కారణం తెలుసా..? నాగార్జున మేనకోడలు సుప్రియ… చైతూ, సమంత బంధం తెగిపోయిందే ఆమె వల్ల’’ అని రాసిపారేశారు… ఎందుకట అంటే..? ‘‘సుప్రియ, అడివి శేషు ప్రేమించుకుంటున్నారు… పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు… కానీ సమంతకూ సుప్రియకూ పడదు… ఈ పెళ్లి జరగదు, కుదరదు అని సమంత అడ్డుపడింది… అది చైతూతో దూరానికి కారణమైంది… చివరకు పెళ్లి పెటాకులైంది’’… ఇదేనట కారణం… సిల్లీగా అనిపిస్తోందా..? ఇంకేదైనా గట్టి పదం వాడాలి…
పాపం, మధ్యలో సుప్రియను ఎందుకు లాగుతున్నారో తెలియదు… దగ్గుబాటి, అక్కినేని కుటుంబాలకు చెందిన వారసత్వం… తను ఎప్పుడూ ఏ వివాదాల్లోకి రాదు… యాక్టర్ చరణ్‌రెడ్డిని పెళ్లిచేసుకుంది, కొన్నాళ్లకే పడలేదు, విడిపోయారు, అప్పట్నుంచీ సింగిల్… అడివి శేషుతో ఆమె బంధం చిక్కబడిందనీ, ఇద్దరూ పెళ్లి చేసుకుంటారని నాలుగేళ్లుగా వినిపిస్తున్నదే… పెద్దగా వాళ్లు ఖండించిందీ లేదు… అలాగని ఆమోదించిందీ లేదు… కాకపోతే రైటింగ్, యాక్టింగ్ మీద దృష్టి పెడుతున్నాను, కొన్నాళ్లు వదిలేయండి బాస్ అంటూ శేషు ట్విట్టర్ ముఖంగా నెట్ రూమరిస్టులను కోరుకున్నాడు…
Ads
తనకూ ఏదో చేదు అనుభవం ఉంది… ఒంటరి… సుప్రియతో ఎక్కడ పరిచయం కలిసి, ప్రణయం దాకా వెళ్లిందో తెలియదు… ఇద్దరూ ఒక్కటైతే నిజానికి ఎవరికీ అభ్యంతరాలు ఉండవు… ఉండకూడదు… ఆమె ఓ మంచి లైఫ్ పార్టనర్ దొరికితే ఎవరైనా ఎందుకు వద్దనాలి..? పైగా సమంత ఎందుకు కాదంటుంది..? కాదనడానికి ఆమె ఎవరు..? ఆమె అక్కినేని కుటుంబానికి పెద్ద కాదు, ఆమె మాట చెల్లుబాటు కావటానికి..! నాగార్జున గనుక సై అంటే సరిపాయె… పైగా సమంత వద్దంటే ఆ కారణంతో చైతూ ఆమెకు దూరం ఎందుకు అవుతాడు..? అన్నీ విచిత్రమైన వాదనలు, వార్తలు…
అసలు నాగార్జున ఫ్యామిలీ ఎందుకు వద్దంటుంది..? ఇదే చైతూ-సమంతలది లవ్ మ్యారేజీయే కదా… (అప్పటికి)… హీరో సిద్ధార్థ్‌తో ఆమె అఫయిర్ బ్రేకై, ఇప్పుడు చైతూతో కూడా పెటాకులై, ఆమెది ఓ పెద్ద కథ… ఒక తరం ముందు దగ్గుబాటి లక్ష్మి, నాగార్జునలదీ భగ్నవివాహమే… తరువాతే కదా అమలను పెళ్లి చేసుకుంది… అఖిల్ ఎంగేజ్మెంట్ శ్రియ భూపాల్‌రెడ్డితో జరిగీ, ఎక్కడో తేడా వచ్చి పెళ్లికి ముందే బ్రేక్… అదే కుటుంబంలో సుమంత్దీ అంతే… నటి కీర్తిరెడ్డితో పెళ్లి కొన్నాళ్లే నిలబడింది…
ఐనా రెండు ఒంటరి పక్షులు ఒక్కటవుతానంటే ఆ కుటుంబం ఎందుకు వద్దంటుంది..? పైగా చైతూ, సమంత పెటాకులు ఒడిశిన ముచ్చట కదా… తాజాగా సుప్రియను లాగడం దేనికి..?! సుప్రియ ఉసురు తగిలే సమంత పెళ్లి భగ్నం అయ్యిందనే సూత్రీకరణలు దేనికి..? ఇవన్నీ సరేగానీ… ఏళ్లు గడుస్తున్నాయి గానీ… సుప్రియ, శేషు పెళ్లి మాట ఎత్తడం లేదెందుకు..? అది కదా అసలు ప్రశ్న..!!
Share this Article