ఎస్… సల్మాన్‌ఖాన్‌ను ఖతం చేయడానికి బిష్ణోయ్ గ్యాంగ్ ప్రయత్నం చేసింది… ప్లాన్ ఏ వర్కవుట్ కాకపోతే ప్లాన్ బీ అమలు చేయాలని అనుకుంది… సల్మాన్‌ను తన పన్వెల్ ఫామ్హౌజుకు వెళ్తుండగా చంపేయాలనేది ప్లాన్… 3 నెలలుగా రెక్కీ నిర్వహించింది… తను వచ్చే దారిలో ఏ గుంత లోతు ఎంత..? ఎక్కడ కారు స్లో అవుతుందో కూడా లెక్కలు వేసి పెట్టుకున్నారు… కారు స్లో అయినప్పుడే టార్గెట్ కొట్టేయాలని అనుకున్నారు… ఫామ్‌హౌజ్ సెక్యూరిటీ గార్డులను ఫ్యాన్స్ పేరిట మచ్చిక చేసుకున్నారు… కానీ ఆ గ్యాంగ్ తప్పు చేసింది ఎక్కడ అంటే..?
సల్మాన్, ఆయన తండ్రిని ఉద్దేశించి… ‘మీక్కూడా సిద్ధూ మూసేవాలాకు పట్టిన గతే పడుతుంది’’ అని రాసిన ఓ లేఖను ఉద్దేశపూర్వకంగానే వాళ్లకు దొరికేలా చేశారు… దాంతో సల్మాన్ అలర్ట్ అయిపోయాడు… ఈలోపు నిందితులు పోలీసులకు పట్టుబడ్డారు… ఇక్కడ రెండు విషయాలు చెప్పుకోవాలి… ఈ గ్యాంగ్ ఆపరేషన్స్ ఏమిటి..? చదువుతుంటేనే విస్తుపోయే వెల్ ఆర్గనైజ్డ్ క్రిమినల్ గ్యాంగ్ అది… సల్మాన్‌ను ఎందుకు టార్గెట్ చేశారు..? ఇవీ కీలకప్రశ్నలు…
సిద్ధూమూసేవాలా హత్య తెలుసు కదా… పంజాబ్‌లో పాపులర్ సింగర్… హతమార్చింది ఈ గ్యాంగే… ఆ విచారణకు పంజాబ్ పోలీసులు ఈ గ్యాంగుకు చెందిన వాళ్లను ప్రశ్నిస్తుంటే గ్యాంగ్ కార్యకలాపాలు ఇంకా వెలుగులోకి వస్తున్నాయి… ఈ మొత్తం గ్యాంగుకు ప్రధాన సూత్రధారి లారెన్స్ బిష్ణోయ్… ఇండియా, కెనడా, దుబాయ్, ఆస్ట్రియా, మెక్సికోలలో తన గ్యాంగు ఆపరేషన్స్ నడుస్తున్నయ్… ఇండియాలో కూడా ఏడు రాష్ట్రాల్లో (Punjab, Haryana, Rajasthan, Chandigarh, Delhi, Maharashtra, Himachal Pradesh) ఈ గ్యాంగుకు పట్టుంది…
Ads
31 ఏళ్ల వయస్సున్న లారెన్స్ బిష్ణోయ్ మీద ఇప్పటికే 65 కేసులున్నయ్… ఓసారి పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకున్నాడు… లెక్కకు రాని కేసులు ఎన్నో… ఈ గ్యాంగుకు దాదాపు 1000 మంది సభ్యులు ఉన్నారు… కొందరు షార్ప్ షూటర్లు, కొందరు సప్లయర్స్, కొందరు ట్రాన్స్పోర్టర్లు, కొందరు ప్లానర్స్… ఇలా ఎవరి పని వాళ్లదే… వర్చువల్ నంబర్లతో ఆడియో కాన్ఫరెన్సుల ద్వారా ఎవరి పని వాళ్లకు అప్పగిస్తారు… అవీ మొబైల్ నంబర్లు కావు… ఇంటర్నెట్ కాల్స్… అంతా డిజిటల్ ఆపరేషన్సే…
లారెన్స్ మాస్టర్ మైండ్ కాగా, కెనడాలో ఉండే గోల్డీ బ్రార్ ఆపరేషన్స్‌లో దిట్ట… సిద్ధూ మూసేవాలా హత్యకు ప్రధాన జవాబుదారీ తనే… లారెన్స్ కజిన్ సచిన్ బిష్ణోయ్ రిక్రూట్మెంట్, టార్గెట్ ప్లానింగ్ చూసుకుంటాడు… ఆస్ట్రియాలో ఉండే అన్మోల్, కెనడాలోని విక్రమ్ బ్రార్ కంపెనీ ఫైనాన్స్ వ్యవహారాలు చూస్తుంటారు… లారెన్స్ కూడా షూటర్లతో నేరుగా ఎప్పుడూ మాట్లాడడు… టార్గెట్ ఫిక్సయ్యాక సంపత్ నెహ్రాకు కమాండ్స్ ఇస్తాడు… ఏదైనా ఆపరేషన్ జరుగుతుంటే, ఎవరు ఏ పని చేస్తున్నారో మరొకరికి తెలియదు… పొరపాటున ఎవరైనా పట్టుబడినా మిగతా సభ్యులు సేఫ్‌గా ఉండటం కోసం, రహస్యం బయటపడకుండా ఉండటం కోసం ఈ ఏర్పాటు…
ఏదో కేసులో పట్టుబడి, తీహార్ జైలులో ఉంటున్నాడు లారెన్స్ ఇప్పుడు… మన తీహార్ జైలు గురించి తెలుసు కదా… నేరస్థులకు అది సొంత ఆఫీసు… సేఫ్టీ, సెక్యూరిటీ… సరేగానీ, బిష్ణోయ్ గ్యాంగుకు సల్మాన్ ఎందుకు టార్గెట్ అయ్యాడు..? 2018లోనే ఓసారి ‘‘నిన్ను ఖతం చేస్తం బిడ్డా’’ అని వార్నింగ్ ఇచ్చింది ఈ గ్యాంగు… ఈ ఆపరేషన్ పూర్తిగా డిఫరెంటు… ఆర్థిక, వ్యాపార కారణాలు కావు… సల్మాన్ అప్పట్లో కృష్ణజింకల్ని వేటాడాడు… మన వ్యవస్థ తనను ఏమీ చేయలేకపోయింది కదా… ఈ బిష్ణోయ్ జాతి కృష్ణజింకల్ని పవిత్రంగా చూసుకుంటుంది… సల్మాన్ టార్గెట్ కావడానికి ప్రధాన కారణం అదే…
సల్మాన్ ఖాన్‌ను ఖతం చేసే ఆపరేషన్ గురించి, బిష్ణోయ్ గ్యాంగ్ వెల్లడించిన వివరాలు చదువుతుంటే… మరోవైపు ఇదే సల్మాన్ ఖాన్‌తో మన చిరంజీవి థార్ మార్, థక్కర్ మార్ అంటూ స్టెప్పులు వేస్తున్న ఫోటో, వీడియో, వార్తలు కనిపించాయి… ప్రకృతిని, వన్యప్రాణుల్ని పూజించే ఒక జాతి మొత్తం ద్వేషించే, కోపించే సల్మాన్‌ను వెంబడేసుకుని, చిరంజీవి వేస్తున్న స్టెప్పులు ఎవరిని అలరించడానికి..? అసలు సల్మాన్‌ను ఓ అదనపు ఆకర్షణగా భావిస్తున్న చిరంజీవి తన ఇమేజీని తనే చిన్నబుచ్చుకుంటున్నాడా..?!
Share this Article