కాయదు లోహర్… ఈ పేరు పలకడానికి అల్లు అర్జున్ నానా అవస్థలూ పడ్డాడు… ఇక పలకలేక ఆ పేరున్న హీరోయిన్‌కే సారీ చెప్పాడు… శ్రీవిష్ణు నటించిన సినిమా అల్లూరి… దాని ప్రిరిలీజ్‌కు వచ్చిన బన్నీ ప్రసంగం ఎటెటో వెళ్లిపోయింది… తనకు ఫ్యాన్స్ ఉండరట, తనది ఆర్మీ అట… సరే, హీరోయిన్ పేరు పలకలేకపోవడం కాస్త నవ్వు పుట్టించేలా ఉన్నా ఈ హీరోయిన్ గురించి మాత్రం ఓసారి ప్రస్తావించుకోవాలి…
ఐనా రోజుకు వందమంది అమ్మాయిలు వస్తుంటారు, నాలుగురోజులకే తెరమరుగైపోతారు… ఇండస్ట్రీలో కామన్… ఎన్ని పేర్లు గుర్తుంటాయి అంటారా..? అదీ ఓ కోణంలో నిజమే… కానీ రోజుకు వంద మంది వస్తారు సరే, కానీ ఎక్కడి నుంచి..? ఎక్కువగా నార్త్ స్టేట్స్ నుంచి..! కలర్, కనుముక్కు తీరు, ఫిజిక్, బోల్డ్నెస్ ఎట్సెట్రా చాలా లెక్కలు చూసి… ‘‘అన్నీ’’ మాట్లాడుకుని మనవాళ్లు తెరపైకి ప్రవేశపెడుతుంటారు… మన తెలుగు ఇండస్ట్రీ అంతే కదా…
మనవాళ్లకు తమిళ, మలయాళ అమ్మాయిలంటే కాస్త ప్రేమ ఎక్కువ… అఫ్కోర్స్, వాళ్లు అలాగే కష్టపడతారు, మెరిట్ ఉంటుంది… టీవీ సీరియల్స్‌లో మాత్రం కన్నడ అమ్మాయిలదే హవా… తెలుగు అమ్మాయిలను మాత్రం మనవాళ్లు టీవీలో, సినిమాల్లో దేకరు… ఈ కాయదు లోహర్ విషయానికి వస్తే ఆమె స్వస్థలం అస్సాంలోని తేజ్‌పూర్… గౌహతికి కూడా ఈశాన్యం దిక్కున మన బోర్డర్ వైపు ఉంటుంది… బ్రహ్మపుత్ర తీరంలోని సిటీ అది…
Ads
అసలు సౌత్, నార్త్ ఇండస్ట్రీలు ఎప్పుడూ బెంగాల్ దాటి, ఈశాన్యం వైపు అస్సలు చూడవు… చాలామంది అస్సాం, దాని సిస్టర్ స్టేట్స్ను ఇండియాలో భాగంగానే గుర్తించరు… ఎక్కువగా స్పోర్ట్స్‌లో మనకు కనిపిస్తారు గానీ ఆ అమ్మాయిల్ని ఎంటర్టెయిన్మెంట్ తెర మీద అస్సలు ఎంకరేజ్ చేయరు… బర్మా, చైనా లుక్కు ఉంటే మన ప్రేక్షకులు ఇష్టపడరనేనా..? (ఆ ప్రాంత అబ్బాయిలూ పెద్దగా ఇండియన్ సినిమా తెర మీద కనిపించరు…) ఐనా ఎక్కడో న్యూజిలాండ్ నుంచి కూడా పాటలు పాడే అమ్మాయిని తీసుకొచ్చి, పిచ్చి డ్రెస్సులు వేయించి, తైతక్కలాడించే మనకు అస్సాం అయితేనేం..? సిక్కిం అయితేనేం..?
హాలీవుడ్ నటిని తీసుకొచ్చి కూడా ఓ పిల్లబిత్తిరి వేషం వేయించిన జక్కన్నలు మనవాళ్లు… ఇదుగో… ఈ స్థితిలో ఓ అస్సాం యువతి మన తెరపై తళుక్కుమంటున్నదంటే ఆశ్చర్యం అనిపించింది… కాయదు లోహర్, పెరిగింది పూణెలో… అలా ముంబై మోడలింగులోకి యాక్సెస్ దొరికింది… మొదట కన్నడం, తరువాత మలయాళం సినీ ఇండస్ట్రీల్లోకి కూడా ప్రవేశం… తమిళ దర్శకుల కన్ను కూడా పడింది… ఇదే గౌతమ్ మేనన్ ఇదే శింబు పక్కన ‘ది లైఫ్ ఆఫ్ ముత్తు’ సినిమాకు ఈమెనే ఎంపిక చేశాడు…
ఆమెకు బికినీలు వేశాడు… బీచుల్లో పరుగులు తీయించాడు… ఫోటో షూట్లు, సీన్ షూట్లు కొన్ని అయ్యాక ఏమైందో మరి… ఆమె మాయం… తన ప్లేసులో సిద్ధి ఇద్నానీని పట్టుకొచ్చారు… పేరుకు ఇండియన్ సినిమా… అసలు ప్రాంతీయ వైవిధ్యం ఏముందని..? ఈ విమర్శల నేపథ్యంలో కాయదు లోహార్ ఓ తెలుగు సినిమాలో నటిస్తుందనేదే ఇంట్రస్టింగు… అంతే…!!
Share this Article