శరత్ కుమార్ చింత….. దొంగలున్నారు జాగ్రత్త.. ఈ సినిమా రేపు థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. రెండు రోజుల ముందే ఈ మూవీని రామానాయుడు స్టూడియోలో చూశాను. ఈ మూవీ హీరో మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి చిన్న కొడుకు సింహా కోడూరి అలాగే ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి పెద్ద కొడుకు కాల భైరవ
ఈ మూవీకి డైరెక్టర్ సతీష్ త్రిపుర రామానాయుడు ఫిల్మ్ స్కూల్ 2008 బ్యాచ్ స్టూడెంట్.. సురేష్ ప్రొడక్షన్ లో కొన్ని మూవీస్ కి అసోసియేట్ గా కూడా పని చేశారు. తన నుంచి వస్తున్న మొదట సినిమా ఇది అంతే కాదు, తెలుగులో వస్తున్న తొలి సర్వైవల్ థ్రిల్లర్ కూడా ఇదే…
చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ బ్రతికే రాజు అనుకోకుండా ఒక ఖరీదైన కారులో దొంగతనం చేయడానికి వచ్చి తనకి తెలిసిన ట్రిక్ తో కారు డోర్ ఓపెన్ చేస్తాడు. తనకు కావాల్సిన వస్తువులు తీసుకొని వెళ్లిపోదామనుకుంటే కారు డోర్ లాక్ అయిపోతుంది. అందులోనే ఇరుక్కుపోతాడు. లోపల జామర్ ఉండడం వల్ల సెల్ ఫోన్ పని చేయదు…
Ads
ఆ కారు సౌండ్ ప్రూఫ్ కావడం వల్ల ఎంత అరిచినా బయట ఎవరికీ వినిపించదు. దాన్నుంచి బయటపడటానికి చేసే ప్రయత్నాలు ఏవీ సక్సెస్ కావు.. అప్పుడే కారులో బాంబ్ ఉందని తెలుస్తుంది.. ఆ కారులో అతను ఎలా సర్వైవ్ అయ్యాడు? ఈ నేపథ్యంలో ఈ సినిమా నడుస్తుంది. 90% సినిమా కారులోనే నడుస్తుంది. గంటన్నర Duration తో సినిమా ఉంది.
ఇలాంటి సర్వైవల్ థ్రిల్లర్ సినిమాలు హాలీవుడ్ లో ఎక్కువగా వస్తూ ఉంటాయి. 2019లో మరియానో కోన్ అనే డైరెక్టర్ తీసిన ”4×4” స్పానిష్ క్రైమ్ థ్రిల్లర్ కూడా సేమ్ ఇలానే ఉంటుంది. ట్రైలర్ చూడగానే అందరికి ఆ మూవీనే గుర్తొచ్చింది. ఆ మూవీని ఫ్రీగా తెలుగులో కాపీ కొట్టారని ట్రైలర్ చూసిన వారి నుంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది.
నిజానికి ఆ సినిమా అఫీషియల్ హక్కులు సురేష్ ప్రొడక్షన్స్ కొని, ఒరిజినల్‌ను యాజిటీజ్‌గా ఫాలో అవకుండా, మన నేటివిటీకి తగ్గట్లు మార్చి తీశారు. ఒరిజినల్ తో కంపెర్ చేస్తే రెండింటి కాన్సెప్ట్ ఒక్కటే కానీ తెలుగులోకి వచ్చేసరికి హీరో బ్యాక్ స్టోరీ వేరు, ఇందులో క్యారెక్టర్లు వేరు.. క్లైమాక్స్ కొన్ని సీన్లు ఉంటాయి. మొత్తంగా ఇది ఓ experimental movie…
Share this Article