సుహాసినిని ఒకతరం తెలుగు సినిమా ప్రేక్షకులు బాగా ఇష్టపడేవాళ్లు… ఈతరానికి ఆమెతో పెద్దగా కనెక్షన్ లేదు… అకడమిక్‌గా ఆమె చారుహాసన్ బిడ్డ, కమలహాసన్ అన్న బిడ్డ, మణిరత్నం భార్యగానే తెలుసు… ఆమె నటనలో దిట్ట… ఎంతయినా హాసన్ కుటుంబం కదా… అయితే, చాన్నాళ్లుగా ఆమె తెలుగు తెరపై లేదు… అరవయ్యేళ్లు వచ్చాయి కదా, తన యాక్టివిటీస్‌ను బాగా పరిమితం చేసుకుంది, ఎక్కువగా తమిళంకే కుదించుకుంది…
ఆమధ్య ఎన్నికలవేళ కమలహాసన్ పార్టీ ప్రచారం కోసం శృతిహాసన్‌తో కలిసి సుహాసిని తమిళ వీథుల్లో తీన్మార్ డాన్సులు చేసిన ఫోటోలు ఆమె అభిమానుల్ని కలుక్కుమనిపించాయి… అసలు సుహాసిని అంటే ఎంత హుందాగా ఉండాలి..? ఇక ఇప్పుడు హైదరాబాద్‌లో ఆమె తలాతోకా లేకుండా మాట్లాడిన మాటలు కూడా ఆ డాన్సుల్లాగే ఉన్నాయి… ఐనా మాకు బండ్ల గణేష్, కేఏపాల్ వంటి బోలెడు మంది నేతలున్నారుగా… వాళ్లకు దీటైన తెలుగు టీవీ న్యూస్ చానెళ్ల ప్రజెంటర్లున్నారుగా… ఇంకా కొత్తగా సుహాసిని వంటివాళ్లు కూడా తమిళనాడు నుంచి రావాలా అనీ అనిపించింది…
హైదరాబాద్‌లో నిన్న పొన్నియిన్ సెల్వన్-1 ప్రిరిలీజ్ ఫంక్షన్ ఒకటి నిర్వహించారు… ఆ సినిమాతో నేరుగా సుహాసినికి సంబంధం లేకపోవచ్చుగాక… కానీ తన భర్త డ్రీమ్ ప్రాజెక్టు అది… శుభస్కరన్ ఫైనాన్స్ చేసి ఉండవచ్చుగాక, స్థూలంగా ఇది సుహాసిని కుటుంబ సొంత సినిమా… పైగా భారీ బడ్జెట్… ఒక్క ముక్కలో చెప్పాలంటే మణిరత్నం కెరీర్‌కు ఇది అగ్నిపరీక్ష… సో, సుహాసిని కూడా సినిమా ప్రమోషన్ కోసం పలు ప్రాంతాల్ని పర్యటిస్తోంది… తప్పదు… సహజం…
Ads
ఫంక్షన్‌లో ఎప్పటిలాగే ముఖ్యులు ఏవో నాలుగు మంచిమాటలు మాట్లాడారు, అయిపోయింది… కానీ సుహాసిని మాట్లాడిన తీరే ఆశ్చర్యం కలిగించింది… అసలు ఈమేనా టీవీల్లో సోషల్, జెండర్ ఇష్యూస్ మీద డిబేట్లు రన్ చేసింది..? ఇంత పూర్ ప్రజెంటేషన్ ఏమిటి అనిపించింది… ‘‘నేను ఇండస్ట్రీకి వచ్చి 42 ఏళ్లయింది, ఇన్నాళ్లూ నాపై చూపిన ప్రేమను ఈ సినిమాపై చూపండి’’ అని అప్పీల్ చేసింది, పెద్ద రిస్కీ ప్రాజెక్టు కాబట్టి, ప్రేక్షకుల్ని అలా అడుక్కోవడంలో తప్పేమీ లేదు… కానీ…
‘‘పెళ్లికి ముందే నాకు మణి పొన్నియిన్ సెల్వన్‌కు సంబంధించిన 5 బుక్స్ ఇచ్చాడు, వన్ లైన్ ఆర్డర్ రాసి ఇవ్వమన్నాడు… ఆ పని సరిగ్గా చేయకపోతే పెళ్లి కేన్సిల్ అవుతుందేమోనని సందేహించాను… నిజానికి ఇది తమిళ కథే అయినా… ఆంధ్ర, తెలంగాణల్లో షూటింగ్ జరిగింది కాబట్టి ఇది తెలుగువారి సినిమా… పైగా ఇది దిల్ రాజు బిడ్డ… ఇక ఆయనే చూసుకోవాలి…’’ అంటోంది సుహాసిని… నవ్వొచ్చింది… పెళ్లికి ముందు ఈ పరీక్ష ఏమిటో మణిరత్నానికే తెలియాలి మరి…
పొన్నియిన్ సెల్వన్ కథ అచ్చంగా తమిళుల కథ… అది వేరే ప్రాంతాల వారికి ఎక్కదు అనే అభిప్రాయాలు ఇప్పటికే వ్యాప్తిచెందాయి… పైగా మణిరత్నం తమిళ కోణంలోనే ఆలోచిస్తాడు, వేరే భాషల ప్రేక్షకులు తమ తీటకొద్దీ చూడాలే తప్ప, తను మాత్రం పాన్ ఇండియా అనే ఫోకస్‌తో సినిమాలు చేయడు… సో, జస్ట్, ఇది అరవ కథ అనే ప్రచారానికి విరుగుడుగా సుహాసినితో ‘‘తెలుగు వారి కథ కూడా’’ అనిపించారు… దానికి ఓ పిచ్చి కారణం, ఇక్కడ షూటింగు జరిగింది కాబట్టి అట… నలుగురు తమిళ యాక్టర్లను తీసుకెళ్లి, సెంటినలీస్ దీవుల్లో షూటింగ్ చేస్తే, అది ఆ ప్రాంత కథ అయిపోతుందా సుహాసినీ..?
పైగా ఇది దిల్ రాజు బిడ్డ అట… సో వాట్..? నిజానికి దిల్ రాజు డబ్బులు పెట్టాడు అనేదే ఈరోజుల్లో నెగెటివిటీకి దారితీస్తోంది కదా… సినిమాలో సరుకు ఉండాలి తప్ప ఈ రాజులు, ఈ చక్రవర్తులు ఏం చేస్తారు తల్లీ..? నిజం చెప్పాలంటే, ఎవరైనా తనతో చనువు ఉన్న జర్నలిస్టు ఇంటర్వ్యూ చేస్తూ… సడెన్‌గా… ఈ సినిమాలో పాత్రల పేర్లు చెప్పమంటే… నెవ్వర్., చెప్పలేడు…!
అనంత శ్రీరాముడు మాట్లాడుతూ ‘‘ఈ పాటలు ఇంత గొప్పగా వచ్చాయంటే అది తెలుగు భాష గొప్పతనమే తప్ప నా గొప్పతనం ఏమీ లేదు’’ అన్నాడు… హహహ… ఈ సినిమా పాటలన్నీ అట్టర్ ఫ్లాప్… ఏ ఒక్కటీ కనెక్ట్ కాలేదు… పైగా దరిద్రపు పదప్రయోగాలు కూడా… మీకు చేతగాక, ప్రతిదీ భాషకు ఎందుకు రుద్దుతావు అనంతా..? ఫాఫం, అదేం పాపం చేసింది..?!
Share this Article