సినిమా… షూటింగుకు ఆర్టిస్టుల కష్టాలు, డబ్బు కష్టాలు, పర్మిషన్ల కష్టాలు… అంతా అయ్యాక సెన్సార్ కష్టాలు… బూతులు, అసభ్య సీన్లుంటే నో అనేస్తారు… రియాలిటీకి దగ్గరగా తీసినప్పుడు కొన్ని తప్పవు సార్ అంటే ఎవడూ వినడక్కడ… తరువాత థియేటర్ కష్టాలు… అదొక పెద్ద సిండికేటు… థియేటర్లు సాధించడం అంటే నోబెల్ ప్రయిజ్, ఆస్కార్ అవార్డు గెలిచినంత పెద్ద టాస్కు… ఒకవేళ దొరికినా మౌత్ టాక్ ఉంటే జనం వస్తారు, లేకపోతే దేకరు…
ఓటీటీ వాళ్లు కూడా స్టార్ వాల్యూ ఉంటేనే కొంటున్నారు… ఇంకేం చేయాలి..? రాంగోపాలవర్మ అయితే అప్పట్లో ‘పే పర్ వ్యూ’ అని తనే ఓ యాప్ క్రియేట్ చేసుకుని, పేమెంట్ గేట్ పెట్టేసుకుని, డబ్బులిచ్చిన వాళ్లకు సినిమా చూసే యాక్సెస్ ఇచ్చాడు… అదీ పెద్దగా వర్కవుట్ కాలేదు… ఇక మిగిలింది ఏమిటి మరి..? యూట్యూబులో పెట్టేసుకోవడమేనా..? అంతే… కానీ యూట్యూబ్ వాడు ఇచ్చే రెవిన్యూ సరిపోతుందా..? సరిపోదు..! ఓ ఫుల్ లెంత్ సినిమా నిర్మాణవ్యయం వాడివ్వలేడు కదా…
అందుకే ఉపాయం ఉండాలి అంటారు, ఉపాయం లేనోడిని ఊళ్లో నుంచి వెళ్లగొట్టాలీ అంటుంటారు… మాంగల్యం అనే సినిమా దర్శకుడు తన సినిమాను యూట్యూబులో పెట్టేశాడు… సినిమా గురించి చెప్పాడు, తన బూతుల భాష గురించి, కంటెంట్ గురించి ముందే చెప్పాడు… సినిమా నచ్చితే నాకు నేరుగా ఫోన్ పే, గూగుల్ పే ద్వారా డబ్బు పంపించండి అని అప్పీల్ పెట్టుకున్నాడు… బూతు సీన్లు లేవు, కానీ భాష తప్పలేదు, రియలిస్టిక్ ధోరణిలో వెళ్లినప్పుడు, ఆయా పాత్రల భావోద్వేగాల్ని సహజంగా చూపిస్తున్నప్పుడు అలాంటి సంభాషణల్నే పెట్టాల్సి వచ్చిందీ అన్నాడు…
Ads
ఇంట్రస్టింగు… బూతులున్నయ్, చాలా ఘాటుగానే ఉంటుంది భాష, మీకు ఇష్టమైతేనే చూడండి, నచ్చితేనే నాలుగు డబ్బులివ్వండి అని ముందే చెప్పుకున్నాడు కదా… నెల రోజుల్లో 40 లక్షల వ్యూస్ వచ్చాయి… (అసలు రిలీజుకు నోచుకోక, చేతులు కాలే అనేక చిన్న సినిమాలతో పోలిస్తే ఇది నయమే కదా…)… సో, దర్శకుడి చిట్కా ఫలించింది, వ్యూస్ పడుతున్నయ్, డబ్బులొస్తున్నయ్, ఎవడు థియేటర్ ఇవ్వకపోతే ఏంటి..? ఓటీటీలు కొనకపోతే ఏంటి..? తాను జనంలోకి వెళ్లకుండా ఆపారా..? అనేది ఒక కోణం… దాన్ని వదిలేస్తే…
యూట్యూబ్ అనేది ఓ పిచ్చి ప్రపంచం… బూతు కథలు, బూతు సీన్లతోనే కాదు, అభ్యంతరకరమైన అనేక వీడియోలు విశృంఖలంగా వైరల్ అయిపోతుంటయ్… ఇదేమీ చైనా కాదు, ప్రభుత్వం కొరడా పట్టుకుని కంట్రోల్ చేయడానికి… ఈ స్థితిలో సినిమా దర్శకులు కూడా క్రియేటివ్ ఫ్రీడం, భావస్వేచ్ఛ పేరిట ప్రజలందరికీ యాక్సెస్ ఉండే ఓ మాస్ మీడియాలో ఇలాంటి బూతులు, కంటెంట్‌ను అందుబాటులో ఉంచడం ఆమోదనీయమేనా..? మీకు ఇష్టముంటేనే చూడమన్నాం కదా అనే డిస్‌క్లెయిమర్ సరిపోతుందా..? ఇదొక డిబేట్…
ఎస్.., ఇక్కడ మరో కోణం కూడా ఉంది… స్మార్ట్ ఫోన్లను హీరోయిన్ల కాళ్ల నడుమ పెట్టి మరీ షూట్ చేసి, రెండు బట్టపేలికలను కట్టి మిగతాదంతా ఫుల్ ఎక్స్‌పోజ్ చేసి, ఇదే క్రియేటివిటీ అనే వర్మలకన్నా ఈ మాంగల్యం చాలా చాలా బెటర్…!! ఇక బూతు అంటారా..? ఏక్తాకపూర్ వంటి నిర్మాతలే పరమ బూతును, వెగటు సీన్లను తమ ఓటీటీల వెబ్ సీరీస్‌ల్లో నింపేస్తుండగా, ఈ చిన్న దర్శకుడిని ఎందుకు నిందించాలి..?! జస్ట్, మాటలే కదా..!!
Share this Article