హిందీ సినిమా… పేరు చుప్… సన్నీ డియోల్, దుల్కర్ సల్మాన్, శ్రేయ ధన్వంతరి, పూజా భట్, అమితాబ్ బచ్చన్ తదితరులూ కనిపిస్తారు ఇందులో… వావ్, ఇంతకీ ఎన్ని వందల కోట్ల బడ్జెట్ అని అడక్కండి… జస్ట్, 10 కోట్లు… చిన్న నావెల్ పాయింట్ పట్టుకుని, దాని చుట్టూ కథ రాసుకుని, ఎవరికి ఎంత పాత్ర ఇవ్వాలో అంతే స్పేస్ ఇచ్చి దర్శకుడు బాల్కి చాలా చాకచక్యంగా మేనేజ్ చేశాడు… సీతారామంతో దుల్కర్ ఈమధ్య పాపులారిటీ ఇంకా పెంచుకున్నాడు కాబట్టి ఈ సినిమా మీద కాస్త ఇంట్రస్టు క్రియేటైంది…
నిర్మాణవ్యయం నీళ్లు తాగినంత ఈజీగా రాబట్టుకుంటారు… రిస్క్ లేదు… అయ్యో, అయ్యో, థియేటర్లకు జనం రావడం లేదనే ఏడుపులు, పెడబొబ్బలు కూడా అక్కర్లేదు… ఇక సినిమా కథకొద్దాం… సాధారణంగా ఒక సినిమా మీద నెగెటివ్ రివ్యూలు వస్తే నిర్మాత, దర్శకుడు, హీరో, ఫ్యాన్స్ ఉడుకెత్తిపోతారు… ఎవడైనా రివ్యూయర్ దొరికితే నరికేయాలి అన్నంత కోపంగా ప్రతిస్పందించిన వాళ్లూ ఉన్నారు… సరే, ఇప్పుడు దానికి విరుగుడుగా రిలీజ్ రోజే డప్పు రివ్యూలు రాయించే బాధ్యతను కూడా ఔట్‌సోర్సింగ్‌కు ఇస్తున్నారు కాబట్టి ఆ కోపాలు కాస్త తగ్గాయి…
నిజంగానే ఏదైనా రివ్యూ మీద కడుపు మండిన వాడు ఓ రివ్యూయర్‌ను పట్టుకుని చంపేస్తే… ఇంకేదో సినిమాకు ఎక్కువ రేటింగ్ ఇచ్చి, డప్పు కొట్టే రివ్యూయర్‌ను కూడా ఖతం చేస్తే..? అబ్బే సిల్లీగా ఉంది… మరీ ఈ రివ్యూలతో అంత కోపం పెంచుకుంటారా ఎవరైనా..? సినిమాలో సరుకు ఉండాలే గానీ రివ్యూలతో నష్టం ఏముంది..? లాభం ఏముంది..? అంటారా…? ఎస్, నిజమే… సిల్లీగా ఉంది… కానీ ఆ సిల్లీ పాయింట్స్‌తో ఓ నగరంలో వరుస హత్యలు చేస్తుంటారు సీరియల్ కిల్లర్స్… ఒక దశలో రివ్యూయర్లు రివ్యూలు రాయడమే మానేస్తారు… అదే ఈ సినిమా కథ…
Ads
ఎహె, ఇది సినిమా కథేమిటి అని పెదవి విరుస్తున్నారా అప్పుడే… ఆ సిల్లీ పాయింట్స్ చుట్టూరా ఓ గ్రిప్పింగ్ క్రైమ్ థ్రిల్లర్ రాసుకున్నాడు దర్శకుడు… సీరియల్ కిల్లర్లు ఎవరు..? వారి కోసం అన్వేషణ, దర్యాప్తు ఈ సినిమా కథ సారాంశం… ఐనా సిల్లీ పాయింట్స్, లాజిక్కుల గురించి ఆలోచిస్తే ఇండియన్ మూవీల్లో ఒక్క థ్రిల్లరూ రిలీజ్ కాదు… ఈ సినిమాలో కూడా కొన్ని సీన్లు, బీజీఎం గట్రా బాగానే ఉన్నా, స్లోగా నడుస్తూ ఓపికకు పరీక్ష పెడుతుంది… క్లైమాక్స్ వీక్…
నటన విషయానికొస్తే… దుల్కర్‌కు వంకపెట్టడానికి ఏముంటుంది..? అలవోకగా లాగించేశాడు… సన్నీ డియోల్ కూడా చాన్నాళ్లకు కనిపించాడు… తనూ సీనియర్… పూజా, శ్రేయ వోకే… ఎటొచ్చీ ఓ సిల్లీ స్టోరీ లైన్, స్లో కథనం సినిమాకు మైనసులు… లాజిక్కులు ఎవడికి కావాలి అనుకుంటే మాత్రం సినిమా వోకే… కొంతమేరకు…!!
Share this Article