అదుగదుగో వచ్చేస్తోంది… మరో భారీ సినిమా… తమిళంలో, తమిళకోణంలో, తీయబడిన ఓ తమిళ చరిత్ర… పొన్నియిన్ సెల్వన్… ఈ సినిమా మీద కొన్ని ముచ్చట్లు చెప్పుకున్నాం కదా… ఇది పేరుకు తమిళకథే అయినా సరే, తెలుగు ప్రాంతాల్లో షూటింగ్ చేశాం కాబట్టి తెలుగు కథే, ఆదరించండి అని సుహాసిని అప్పీల్ చెప్పుకున్నాం… ఈ సినిమా దిల్ రాజు బిడ్డ అని అప్పగింతలు పెట్టిన తీరూ గమనించాం… అదేసమయంలో సినిమాలోని పాత్రల పేర్లు గనుక దిల్ రాజు చెప్పగలిగితే… సినిమా చూడకపోయినా సరే, టికెట్టు ధరను ఫోన్ పే చేయడంలోె తప్పేమీ లేదని కూడా సెటైర్లు వేసుకున్నాం కదా…
నిజం… ఆ పాత్రల పేర్లు తమిళులకేమోగానీ… తెలుగు, ఇతర భాషల ప్రేక్షకులకు ఇనుప గుగ్గిళ్లే… మనం కనిమొళి అని రాస్తున్నాం కదా… అందులో ళ అనేది నిజానికి కరెక్టు ఉచ్ఛారణ కాదు… తమిళులు దాన్ని ఉచ్ఛరించే రీతిలో రాయగలిగే అక్షరం తెలుగు వర్ణమాలలో లేదు… అలాగే Pukhazhenthi పేరును మనం పుహళేందిగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చాం… ఆ చర్చలోకి ఇక్కడ లోతుగా పోలేం గానీ… తమిళులకు ఇట్టే జీర్ణమయ్యే అక్షరాలు, పదాల్ని మణిరత్నం ఎలా పలికించాడో మరి…
ఈ సినిమాకు ఆధారమైన, కల్కి కృష్ణమూర్తి రాసిన అయిదు సంపుటాల మహాగ్రంథంలోని కీలకపాత్రల్ని ఒక్కసారి చూద్దామా… ఒకసారి మొత్తం చదివాక మీరు కాసేపు సుప్తచేతనావస్థలోకి జారిపోయే ప్రమాదం కూడా ఉంది… జాగ్రత్త… (వీటి సరైన ఉచ్ఛరణ మనకు తెలియదు… మనకు అలవాటైనట్టుగా తెలుగులోనే రాసుకుందాం… కనిమొళి, పుహళేందిలాగా…)
Ads
ఇవైతే కథాగమనానికి కీలకపాత్రలు… ఏయే పాత్రలకు ఏయే ఆర్టిస్టుల్ని తీసుకున్నారో కూడా రాస్తే లంబాచోడా అయిపోతుంది, కాబట్టి ఇక్కడ ఆపేద్దాం… ఇంతకీ పొన్నియిన్ సెల్వన్ పేరుకు అర్థం తెలుసా మీకు..? పొన్ని అనేది కావేరీ నదికి మరోపేరు… సెల్వన్ అంటే కొడుకు… ఒకసారి సుందర చక్రవర్తి రెండో కొడుకు రాజరాజచోళుడు కావేరీ నదిలో పడి, మునిగిపోతుంటే, కావేరీ తల్లే అతడిని కాపాడిందని అంటారు… అందరూ అందుకే తనను పొన్నియిన్ సెల్వన్ అని పిలిచేవారు… తన కథే ఈ సినిమా…
(Quora నుండి సేకరణ… వాత్సల్య గుడిమళ్ళ సమాధానం ప్లస్ సమాచారం…)
Share this Article