భారీ వసూళ్లు సాధించిన సినిమాల్ని కూడా టీవీ ప్రేక్షకులు పట్టించుకోలేదు… రేటింగ్స్ రావడం లేదు… బోలెడంత డబ్బు పోసి శాటిలైట్ రైట్స్ కొన్న చానెళ్లు లబోదిబో అంటున్నాయి… ఈ ధోరణికి ఉదాహరణలు, కారణాలను కూడా మనం గతంలో చెప్పుకున్నాం… జీతెలుగు టీవీలో 18.9.2022న ఎఫ్3 సినిమా ప్రసారం చేశారు… సరే, కుటుంబ ప్రేక్షకులు పెద్దగా హింసను, యాక్షన్‌ను పట్టించుకోరు కాబట్టి స్టారాధిస్టార్ల తాజా సినిమాలను కూడా ఈమధ్య తిప్పికొట్టారు టీవీల్లో…
కానీ ఎఫ్3 వినోదప్రధానం అని ప్రచారం చేసుకున్నారు కదా… మస్తు వసూళ్ల లెక్కలను చెప్పుకున్నారు కదా… అంతకుముందు ఎఫ్2 హిట్ కదా… సో, థియేటర్లలో రిజల్ట్ పక్కన పెడితే టీవీల్లో రిజల్ట్ ఏమిటో చూడాలని అనిపించి, రేటింగ్స్ జాబితాలు చెక్ చేస్తే సేమ్ రిజల్ట్ కనిపించింది… జస్ట్, 5.72 రేటింగ్స్ మాత్రమే దక్కించుకుంది… (హైదరాబాద్ బార్క్ కేటగిరీ…) వెంకటేశ్, వరుణ్‌తేజ, తమన్నా, మెహరీన్ ఎట్సెట్రా ఎఫ్2 నుంచి వచ్చినవాళ్లే…
వీళ్లు సరిపోరేమోనని ఆలీ, సునీల్ వచ్చారు… వెన్నెల కిషోర్, రాజేంద్రప్రసాద్ సరేసరి… సోనాల్ చౌహాన్‌ను పట్టుకొచ్చారు… పూజా హెగ్డేతో ఐటం డాన్స్ అనబడే గెంతులు వేయించారు… ఒక హీరోకు నత్తిని పెట్టారు… ఇంకో హీరోకు రేచీకట్లు… తెలుగు టీవీ సీరియల్లోలాగా దాదాపు 30 మంది తారాగణం వస్తుంటారు, పోతుంటారు… మనం అప్పట్లోనే చెప్పుకున్నాం… ఇది కిచిడీ కామెడీ, ఓ సుదీర్ఘమైన జబర్దస్త్ షో అని తేల్చిపడేశాం… మరి జబర్దస్త్, డ్రామా కంపెనీ, క్యాష్, ఢీ, కామెడీ స్టార్స్, జాతిరత్నాలు వంటి బోలెడు కామెడీ షోలు టీవీల్లోనే వస్తుంటే… మళ్లీ అవన్నీ మిక్సి చేసిన సిమిలర్ షోను ఈ సినిమా తారాగణం చేస్తే కళ్లప్పగించాలా..? కొత్తదనం ఏముంటుంది..? పైగా దర్శకుడు పక్కా జబర్దస్త్ టైప్ దర్శకుడు… అదేదో మహేశ్‌బాబు సినిమాలో కూడా జబర్దస్త్ తరహా కామెడీ పెట్టాడు కదా…
Ads
ఎస్, టీవీ ప్రేక్షకులు అలాగే అనుకున్నారు… లైట్ తీసుకున్నారు… అదీ ఆ తక్కువ రేటింగుకు కారణం… టీవీ సినిమా వేరు, ఓటీటీ సినిమా వేరు, థియేటర్ సినిమా వేరు… అవును, ఇప్పటి ప్రేక్షకుడు ఇలాగే సినిమాల్ని వర్గీకరించుకుంటున్నాడు… ఎఫ్3 అయితే అటూఇటూ కాని సినిమా… సో, టీవీ రేటింగ్స్ చతికిలపడి, జీతెలుగు చానెల్ చేతులు కాలిపోయాయ్… మీరు చూస్తూ ఉండండి, రాబోయే చాలా సినిమాలు టీవీల్లో డిజాస్టర్లు కాబోతున్నయ్… కోట్ల డబ్బు పెట్టి కొత్త సినిమాలు ఎగబడి కొనే చానెళ్లకే ఇంకా అర్థం కావడం లేదు…
ఇక మరో సినిమా గురించి చెప్పాలి… ఆ వారం బార్క్ రేటింగుల పరిధిలోకి వచ్చిన టీవీ ప్రీమియర్ల జాబితాలో ఎఫ్3తోపాటు మైడియర్ భూతం అనే సినిమా కూడా ఉంది… ప్రభుదేవా హీరో… మిగతా తారాగణం మనకు పెద్దగా పరిచయం లేదు… కిడ్స్ను టార్గెట్ చేసుకున్న సినిమా… థియేటర్లలోకి ఎప్పుడు వచ్చిందో ఎప్పుడో పోయిందో సరిగ్గా గమనించలేదు, అంత వేగంగా మెరుపుతీగ తరహాలో వచ్చెళ్లిపోయింది… ఏదో చీప్ రేటుకు దీన్ని జీతెలుగు వాడు కొన్నట్టున్నాడు… కానీ ఆ మెయిన్ చానెల్లో వేయడానికి తనే సిగ్గుపడ్డాడు…
జీసినిమాలు అని వేరే చానెల్ ఉంటుంది కదా… అదుగో, దాంట్లో ప్రసారం చేశాడు… అదీ శుక్రవారం… (23.9.2022)… ఏవేవో చానెళ్లు ట్యూన్ చేస్తుంటే పొరపాటున తగిలితే అప్పుడప్పుడూ చూసే సినిమా చానెల్ ఇది… ఈ కొత్త సినిమా వేస్తున్నారని తెలియదుగా… ఎవరూ పట్టించుకోలేదు… ఫలితంగా 1.41 రేటింగ్ వచ్చింది… ఒక్క ముక్కలో చెప్పాలంటే అవసలు రేటింగ్సే కావు… ఫాఫం, ప్రభుదేవా… ఫాఫం జీతెలుగు…!!
Share this Article