Priyadarshini Krishna……….. చిన్నప్పుడే కామిక్ పుస్తకాల కథలతో నీతి పాఠాలు, చరిత్ర, పురాణేతిహాసాలు చదివించేది మా అమ్మ… నిజానికి నాకు ఈ మాత్రమైన తెలుగు హింది ఇంగ్లీష్ భాషలు రావడం, ఇంకా పురాణ పాత్రలపై అవగాహన వచ్చిందంటే కేవలం చందమామ, బాలమిత్ర, బొమ్మరిల్లు అన్నిటికంటే ఎక్కువగా అమరచిత్ర వారి సీరిస్ అండ్ టింకిల్….. అమరచిత్ర కథల సీరీస్‌లోని రామాయణం, మహాభారతం పూర్తి సీరీస్ నాన్న బైండ్ చేయించారు. సెలవుల్లో అవి చదువుకోవడం ఒక యాక్టివిటీ…. అంతటి పిల్లల పుస్తకాల్లో సైతం ఎంతో రిసెర్చ్ చేసి ఎక్కడా పొల్లుపోకుండా కథ, పాత్రల ఆహార్యం, పాత్రల హావభావాలు సంక్షిప్తం చేసారు… పిల్లలకే కదా అని ఇష్టం వచ్చినవి కెలికి పడెయ్యలేదు…
పిల్లల కోసం కాబట్టి వారి మెదడులో మరింత బలమైన ముద్రను వేసేలాగా చిత్రీకరించారేతప్ప, వ్యాపారమే కదా ఏదో ఒకటి అచ్చేద్దాం అనుకోలేదు. ఈ సినిమా అని కాదుగానీ అసలు ఏ సినిమా గానీ బొమ్మల పుస్తకాలు గాని పురాణ ఇతిహాస, చారిత్రక కథలను ఎంచుకున్నప్పుడు దానిని డిపిక్ట్ చెయ్యడానికి జనబాహుళ్యంలో ఉన్న పంథానే ఎన్నుకున్నారు తప్ప తమ సొంత ఊహాపోహశక్తికి రూపమివ్వలేదు. యే ఇతిహాసమైనా, యే పాత్రైనా ప్రేక్షకులమైన మన మనస్సుల్లో చాలా చాలా బలంగా ముద్రించిన రూపాలు హావభావాలను కాదని వేరొక ఆహార్యాలను మెచ్చుకునేలాగా చెయ్యడం ఇప్పటికిప్పుడు సాధ్యం కాదు.
యానిమేషన్ సీరీస్ గానీ, కామిక్ బుక్స్ గానీ అలవోకగా క్రియేట్ చెయ్యరు. ఎంతో రిసెర్చ్ చేసి సీన్లో యే పాత్రలు హైలైట్ కావాలి, యే పాత్రలకు సంభాషణలుండాలి, ఆయా సంభాషణల హావభావాలు ప్రస్ఫుటంగా కనపడేలా బొమ్మలను ఎలా తీర్చిదిద్దాలి వంటి కత్తిమీద సాములాంటి పనిని కూడా అలవోకగా చేసేసారు. ఒక పౌరాణిక పాత్ర ఎలా వుండాలో మనం ఈ రోజు కొత్తగా సృష్టించనక్కర్లేదు గానీ మనం కొంత రిసెర్చ్ చేస్తే చాలు… ఆ రిసెర్చ్ కూడా వేరే బుక్కుల్లో కాదు… మన పురాణాల్లోనే వుంది.
Ads
ప్రతి పాత్రనూ అనేక శ్లోకాల్లో వర్ణించారు. చివరికి ఒక్కో దేవుడు దేవత ఎటువంటి రంగు దుస్తులు వేసుకున్నది మొదలు ఎటువంటి వాహనం వాడేవారో కూడా రాసే వుంది. రామాయణ మహాభారతాల్లోని ఒక్కో పాత్ర ఎంత ఎత్తు వుండేది సైతం రాసారంటే ఎంత మైన్యూట్ డిటేల్స్ మన ఇతిహాసాల్లో రికార్డు చెయ్యబడ్డాయో వేరే చెప్పక్కర్లేదు. విష్ణువు గరుడవాహనుడైతే, మన్మధుడు చిలుక వాహనుడు.
రామాయణంలోని వివిధ పాత్రలు ఆనాటి కాలానికి రథాల్లో పల్లకిల్లో ప్రయాణించేవారు. కానీ లంకాధిపతి రావణుడు మాత్రం అనేక విమానాలను వాడినట్లు సూచికలున్నాయి, చరిత్రలో కూడా ఆనవాళ్ళున్నాయి. అలాంటి రావణున్ని అదేదో గబ్బిల వాహనం ఎక్కినట్లు నిన్నటి ట్రైలర్లో చూసి మూర్చవచ్చినంత పనైంది.
సినిమా మాధ్యమం కానీ, టీవీ కానీ ఎందులో కూడా మనం కొత్తగా ట్రై చేద్దాం అని పురాణ పాత్రలను సామాన్యంగానో హాలీవుడ్ వారి అనాకారి మొహాలతోలో ఎవరూ రూపొందించాలనే సాహసం చెయ్యలేదు… సృజన- క్రియేటివిటీ అంటే మన బుర్రలో పుటిన ఆలోచనకి రూపం ఇవ్వడం మాత్రమే కాదు…. సమాజంలో వేళ్లూనుకున్న భావాల్ని పెకిలించకుండా ఆహ్లాదమైనదిగా రూపొందించడం… అలాంటి కల్పన పదికాలాలపాటు ప్రేక్షకుల మనసుల్లో నిలుస్తుంది…. I am deeply hurt by just watching a teaser…. సినిమా చూడాలనే ఆసక్తి చచ్చిపోయింది…. by…Priyadarshini Krishna
Share this Article