ప్రవీణ్ సత్తారు… అంతకుముందు, అంటే పదేళ్ల క్రితం ఈ ఇండో అమెరికన్ డైరెక్టర్ తనే నిర్మాతగా ఎల్బీడబ్ల్యూ అనే సినిమా తీశాడు… తరువాత ఇంకేదో సినిమా, మరేదో అంథాలజీ సీరీస్… తరువాత నాసిరకం గుంటూరు టాకీస్… అంతే… తనను నిలబెట్టింది 5 ఏళ్ల క్రితం తీసిన గరుడవేగ… ఇంత గ్యాప్ వచ్చాక కూడా నాగార్జున ఓ చాయిస్ ఇచ్చాడు… ది ఘోస్ట్ సినిమా తీసి పెట్టవోయ్ అన్నాడు… ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి కదా…
పైగా నాగార్జున పెద్దగా స్క్రిప్టులోనూ, ప్రతి సినిమా నిర్మాణ వ్యవహారాల్లోనూ వేలుపెట్టడు… సినిమా తీశామా, జనంలోకి వదిలేశామా, నడిచిందా, డబ్బులొచ్చాయా… అంతే… మళ్లీ మరో స్క్రిప్టు… సినిమాలు వస్తూనే ఉంటయ్… ప్రిరిలీజ్ ఫంక్షన్లో కావచ్చు, శివ సినిమాలో చెయిన్‌తో వచ్చాను, ఇప్పుడు ఓ కత్తితో వస్తాను అని… అవును, సినిమాలో అంతకుమించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమీలేదు…
యాక్షన్, యాక్షన్, యాక్షన్… ఈమధ్య హీరోలను రా ఏజెంట్లుగా చూపించడం బాగా అలవాటైంది కదా… అందులో నుంచి బయటికి వచ్చేసి, మళ్లీ ఏదో టాస్క్ రాగానే రంగంలోకి ఎంటర్ కావడం… సేమ్, ఇక్కడా అంతే… నాగార్జున ఓ కంట్రాక్టు ఇంటర్ పోల్ కాప్ అట… ఐనంతమాత్రాన గన్స్ పేలుతూనే ఉండాలా…? క్రాఫ్ చెదరకుండా… కళ్లద్దాలపై దుమ్ము కూడా పడకుండా…!
Ads
పేరుకు ఓ సోదరి, ఆ సోదరి బిడ్డ… వాళ్లను రక్షించే ఓ ఫ్లాష్ బ్యాక్… అండర్ వరల్డ్‌తో డిష్యూం డిష్యూం… సినిమాలో అదీ బాగా విసుగెత్తించే పార్ట్… కథ స్థూలంగా చూస్తే వోకే… కానీ ప్రజంటేషన్లో వీక్… మరీ సెకండాఫ్ అయితే మస్తు యాక్షన్ సీన్లు విసుగు పుట్టిస్తాయి… కాస్త ఎమోషనల్ కంటెంట్, సీన్లు పడాలి కదా నాగార్జునా… చూసుకోవాలి కదా, మరీ బిగ్‌బాస్‌ను వదిలేసినట్టు వదిలేస్తే ఎలా… ఇప్పుడు చూడు, స్థూలంగా సినిమా యావరేజ్… కాదు, ఇంకాస్త కిందకే ఎండ్ అయిపోయింది…
సినిమా తెలుగు సినిమాయేనా అనిపిస్తుంది కొన్ని అంశాల్లో… నాగార్జునను ఒక్కడినీ మినహాయిస్తే… హీరోయిన్ సోనాల్ చౌహాన్… అదనంగా గుల్ పనగ్, అనిఖ సురేంద్రన్… అంతా కొత్తకొత్తగా అనిపిస్తూ ఉంటుంది… తీరా సంగీతం చూస్తే… పాటలేమో భరత్, సౌరభ్… పెద్దగా తెలియదు కదా… ఉన్నదే ఒక్క పాట, మరొకటి థీమ్ సాంగ్… తమిళంలో ఆ ఒక్క పాటా లేదు… తెలుగులో అదీ సోసో… సింగర్ కపిల్ కపిలన్… బీజీఎం మార్క్ రాబిన్‌కు అప్పగించారు… మరీ నాసిరకం కాదు, గొప్పగా లేదు… పర్లేదు…
ఈ సినిమా కోసం నాగార్జున క్రౌవ్ మాగా, కటనా నేర్చుకున్నాడట… అంత సీనేమీ లేదు సినిమాలో… క్రౌవ్ మాగా అంటే ఇజ్రాయిలీ మార్షల్ ఆర్ట్… రకరకాల మార్షల్ ఆర్ట్స్ కలిపి రూపొందించిన హైబ్రీడ్ యుద్ధవిద్య అది… అంత వీజీ కాదు… అదే కాదు, కటనా అనేది జపనీస్ విశిష్ట ఖడ్గ విద్య… అది ఇంకా కష్టం… ఈ రెండు విద్యలకూ ఏళ్ల తరబడీ కఠోర సాధన కావాలి… సర్లే, ఏదో సినిమా ప్రమోషన్ కోసం ఏదో చెప్పుకున్నారులెండి…
ఈ సినిమాకు మొదట్లో కాజల్ అగర్వాల్ హీరోయిన్ అనుకున్నారు, ఆమెకు కడుపు రావడంతో, తప్పనిసరై ఇక వేరే ఆప్షన్ వెతికారు… అమలాపాల్ నేనే రెడీ అంది… కానీ ఆమే తప్పుకుంది తరువాత… (క్రియేటివ్ డిఫరెన్సెస్ పేరిట తప్పుకోవడం ఏమిటో, ఎలాగో త్రిష ఆల్రెడీ అందరికీ నేర్పింది కదా… నిజంగానే అమలాపాల్ తనకు ప్రయారిటీ లేని పాత్రల్ని ఒప్పుకోదు…)
తరువాత మెహరీన్‌ను అప్రోచయ్యారు… దాదాపు ఫైనలయ్యే టైమ్‌కు రెమ్యునరేషన్ తక్కువ ఇస్తామనేసరికి లేచి చక్కా వెళ్లిపోయింది… ఇంకేం చేస్తారు మరి… జాక్వెలిన్‌ను తీసుకున్నారు… ఏం జరిగిందో ఏమో గానీ… గత జనవరిలో ఆమె కూడా మానేసింది… చివరకు సోనాల్ చౌహాన్ ‘‘బుక్కయిపోయింది…’’… నాగార్జున నవమన్మథుడు, హీరోయిన్లు తనతో చేయడానికి పోటీలుపడతారని ఎవడ్రా కూసింది, రాసింది..?!
Share this Article