రెండుమూడు చోట్ల చూసి నవ్వొచ్చింది… సరోగసీ కవలల్ని కని నయనతార అడ్డగోలుగా బుక్కయిందట… తమిళనాడు ప్రభుత్వం సీరియస్‌గా ఉందట… అంత సీన్ ఏమీ లేదు గానీ గాభరాపడకండి… ఏరకంగా చూసినా సరే, నయనతార మీద చర్యలు తీసుకోలేదు ప్రభుత్వం… అందుకే ఏదో తూతూమంత్రంగా మీడియా కళ్ల గప్పడానికి ఆ జంట నుంచి వివరణ కోరతామని తమిళనాడు మంత్రి సుబ్రమణియన్ ప్రకటించాడు…
నిజానికి నయనతార చర్య అనైతికం కాదు, చట్టవిరుద్ధం కాదు, అధర్మం కాదు, వక్రమూ కాదు… సంప్రదాయికం కాకపోవచ్చుగాక, అది వేరే చర్చ… 1) వాళ్లదేమీ అక్రమ సంబంధం కాదు, చాన్నాళ్లుగా సహజీవనంలో ఉన్నారు… 2) ఇరు కుటుంబాల్లో అందరికీ తెలుసు… 3) సరోగసీ చట్టబద్ధమే… కాకపోతే ఏదో ఫ్యాక్టరీకి ఆర్డరిచ్చి , సరుకును డెలివరీ చేసుకున్నట్టుగా సాగిన తంతు మాత్రం సంప్రదాయవాదుల్ని చివుక్కుమనిపించింది…
సరోగసీ నిబంధనల ప్రకారం …. 21 నుంచి 35 ఏళ్ల వయస్సుండీ, పెళ్లయిన మహిళ తన అండాల్ని దానం చేయాలంటే ఆమె తల్లిదండ్రులు లేదా భర్త అంగీకారం కావాలి… అందుకే మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ ఎంక్వయిరీ చేస్తాడని మంత్రి ప్రకటించాడు… ఇవేమీ నిలవవు… ఇక్కడ ఆమె దాత కాదు.., తన స్వీయ అవసరం… తను కడుపు మోసేంత బలంగా, ఆరోగ్యంగా లేనని చెబుతుంది… పేరెంట్స్, భర్త కూడా అవసరమైతే సంతకాలు చేస్తారు… పెళ్లయిన మహిళకు మాత్రమే సరోగసీ చాన్స్ కల్పించాలనే రూల్ ఏమీ లేదు.. ఆల్రెడీ పెళ్లయి ఐదేళ్లు అయి ఉండాలని మరో రూల్ ఉందట.. వాళ్లకు ఐదేళ్ల క్రితమే పెళ్లయింది… ఎక్కడా అనకండి…
Ads
స్టాలిన్‌కు, తన కుటుంబానికి సినిమా ఇండస్ట్రీతో బలమైన సంబంధాలున్నయ్… గెలుక్కోడు… స్వయంగా తన కొడుకే ఓ హీరో… పైగా ఇదేమీ కొరడాలతో కొట్టించే నేరమేమీ కాదు… మీకు గుర్తుందా..? ఈ జంట ఓసారి తిరుమలకు వచ్చింది… అక్కడ మాడ వీథుల్లో హఠాత్తుగా ఫోటో షూట్ స్టార్ట్ చేశారు… ఆమె చెప్పులతో నడిచినట్టు వార్తలు, ఫోటోలు కనిపించినయ్… ఆయ్, వాళ్ల మీద యాక్షన్ తప్పదు అని ఎప్పటిలాగే టీటీడీ కూసింది… అంతకుమించి అదేమీ చేయదు కదా…
మళ్లీ దాన్ని అడిగినవాళ్లు లేరు… కాకపోతే టీటీడీ బాధ్యుల్లో ఎవరైనా కాస్త బుర్ర ఉన్నవాళ్లు… ‘‘ఆమె క్రిస్టియన్… హిందూ పద్ధతిలో పెళ్లి చేసుకుంది… పెళ్లి బట్టలతోనే మొగుడిని తీసుకుని స్వామివారి ఆశీస్సులకు వచ్చింది… స్వామీ నువ్వే రక్ష అని సాగిలబడింది… ఏం చర్య తీసుకోమంటారు..?’’ అని కంట్రవర్సీ మీడియాను ఉల్టా ప్రశ్నిస్తే బాగుండేది…
ఒక్కసారి సమంత, నాగచైతన్య పెళ్లిని గుర్తుచేసుకొండి… ఆమె మతం మారలేదు… చైతూ మతం మారలేదు… అందులో తప్పేమీ లేదు… కానీ ఒక మతాన్ని పూర్తిగా అడాప్ట్ చేసుకోవడంలో సమంత ఫెయిలైంది… సరే, అది ఆమె ఇష్టం… డయానా మరియన్ కురియన్ నయనతార అసలు పేరు… ఈ పేరు మార్పిడి కమర్షియల్ కోణంలోనో, ప్రభుదేవా కోసమో జరిగింది ఉండవచ్చుగాక… కానీ మతం విషయంలో ఆమె అడమెంట్ కాదు, చాలా ఫ్లెక్సిబుల్… సో, వివరణలు, చర్యలు గట్రా పదాల్ని మరిచిపొండి…!! ఆమెను టార్గెట్ చేయడం నీచం…
Share this Article