నాకు చిన్న కోరిక… బాలయ్య తన పాపులర్ షో అన్‌స్టాపబుల్‌లో చిరంజీవిని పిలిచి గరికపాటి వివాదం మీద అడగాలి… ఒకవేళ ఆఫ్‌బీట్ అంశాలు అడిగినా తనేమీ చెప్పడు… దానికీ బోలెడంత బిల్డప్పు, హిపోక్రసీ ఉంటయ్… ఈమాత్రం దానికి మా బావగారు లేదంటే నేను బెటర్ కదా అనుకుంటాడు బాలయ్య… మరొకటి జగన్‌ను పిలిచి తన పర్సనల్ అంశాలపై ఆఫ్‌బీట్ ఛాట్ చేయడం… అసలు మీడియా ముందుకే రాని జగన్ ఆఫ్‌బీట్ చాట్‌కు వస్తాడా..? అదీ ప్రత్యర్థి పిలిస్తే…?
బాలయ్య చిన్న బిడ్డ తేజశ్విని ఈ షోకు క్రియేటివ్ కన్సల్టెంటుగా పనిచేస్తున్నట్టు ఈటీవీ భారత్ రాసుకొచ్చింది… అబద్ధం ఏమీ ఉండకపోవచ్చు… నిజానికి ఇప్పుడు ఓటీటీల్లో చాట్ షోలంటే మరీ ఈటీవీలో వచ్చే ‘ఆలీతో సరదాగా’ వంటి నాసిరకం, చవుక షోలు కావు… దాదాపు సినిమా షూటింగుల స్థాయిలో స్క్రిప్టులు, ప్లానింగ్, ఎడిటింగ్ ఎట్సెట్రా జరుగుతున్నయ్… సరే, బాలయ్య స్పాంటేనిటీయే దానికి ప్రాణం… ఆహా ఓటీటీలో ఈ షో బాగా క్లిక్కయింది… ఈ సందర్భంగా ఒకటి గుర్తొచ్చింది…
ఇండియన్ ఐడల్ తెలుగు షో ఆహాలో చేశారు కదా… క్లిక్కయింది… థమన్, నిత్య, కార్తీక్ మనసుపెట్టారు, శ్రీరామచంద్ర కూడా… మధ్యలో కంటెస్టెంట్లకు స్వీట్లు పంపి, టాప్6 కంటెస్టెంట్ల షోకు వచ్చి బాలయ్య హాయిగా వాళ్లతో గడిపాడు… స్పాంటేనిటీ, హ్యూమర్… ఓ కొత్త బాలయ్య కనిపించాడు… సేమ్, అన్‌స్టాపబుల్‌లాగే… కానీ తనతో ఫినాలే జరగకుండా చిరంజీవి అడ్డుపడ్డాడు… మరి బాలయ్యకన్నా బావే ఎక్కువ కదా అల్లు అరవింద్‌కు, అందుకే చిరంజీవితో ఫినాలే జరిపించాడు…
Ads
ప్రస్తుతానికి వద్దాం… చంద్రబాబును పిలిచి ఎంచక్కా సరదాగా సాగే షోకు అత్యంత భారీ హిపోక్రసీని రుద్దారు… వైఎస్ నాకు బాగా దగ్గర స్నేహితుడు అని చెప్పడం ద్వారా వైఎస్ అభిమానుల నుంచి వ్యతిరేకత తగ్గించుకోవడం… వెన్నుపోటుపై బాలయ్యనే ప్రశ్న అడిగి, తనతోనే జవాబు చెప్పించి బుక్ చేయడం… ప్రతిదీ అంతే… ప్రతిదీ అబద్ధమే ఉంటుంది… చంద్రబాబు మారడు… సో, అన్‌స్టాపబుల్ ఫస్ట్ సీరీస్ మీద ఉన్న సదభిప్రాయం కాస్తా పోయింది…
నిజానికి బాలయ్య మాత్రమే బాబును కొన్ని ప్రశ్నలు అడగగలడు… నవ్వుతూనో, చురక వేస్తూనో… ఐనా సరే, అది రాయి, రాగాలు పలకదు… అందుకే ఈ వృథా ప్రయాస దేనికని లోకేష్‌ను కూడా యాడ్ చేశాడు షోకు… సో, బాబును ఇక వదిలేయండి… మహా అయితే రాధాకృష్ణకు బాబుతో కాస్త ఇంటిమసీ ఉంది గానీ అన్‌స్టాపబుల్ షో కేరక్టర్ వేరు…
బాలయ్య చేసిన ఇంటెన్సిటీ ఆర్కే చేస్తే రాదు… రాధాకృష్ణ జర్నలిస్టు… కానీ బాలయ్య నటుడు… ఏ డైలాగ్ ఎలా పలకాలో, ఎలా అడగాలో, ఎలా డైలాగ్ రిలీజయితే పేలుతుందో తనకు తెలుసు… మహేశ్ చాట్ షో హృద్యంగా రావడానికి బాలయ్య ధోరణే కారణం…!! నో, నో, ఎంత అన్‌స్టాపబుల్ షో అయితే మాత్రం చిన్నమ్మ లక్ష్మిపార్వతిని పిలవాలంటారా..? అది నిజంగానే జరిగితే, ఇక బాలయ్య జీవితంలో చాట్ షోలు చేయడు..!!
Share this Article