ఎందుకు కొన్ని తప్పులు సరిదిద్దుకోలేం..? నిక్షేపంగా దిద్దుకోవచ్చు… ఉదాహరణకు, జగన్ తన తప్పు తెలుసుకుని, ఇప్పటికైనా తన ఇజ్జత్ పోయే ప్రమాదాన్ని గుర్తించి, రాంగోపాలవర్మను తాడేపల్లికి మళ్లీ పిలిపించి ‘‘బయోపిక్కులు లేవు, తొక్కాతోలూ ఏమీ లేవు, వదిలెయ్, లేకపోతే మర్యాద దక్కదు’’ అని హెచ్చరిస్తే… అదొక దిద్దుబాటు… చేయొచ్చు… కానీ చేస్తాడా లేదా అనేది వేరే ప్రశ్న… అంత ఆలోచిస్తే వ్యూహం, శపథం సినిమాలు ఎందుకు వార్తల్లోకి వస్తాయి,..? ఆలీ ఎలక్ట్రానిక్ మీడియా అడ్వయిజర్ ఎలా అవుతాడు..?
సరే, వర్మ తాజా ట్వీట్ చూశారా..? ఓ పిచ్చి లెక్కను చెప్పాడు… బీజేపీ డివైడెడ్ బై పీకే ఇంటూ సీబీఎన్ మైనస్ లోకేష్ ప్లస్ జగన్ ఈక్వల్ టు వ్యూహం అట…. దిమాక్‌లో చటాక్ కూడా మిగలని ట్వీట్… ఇలాంటి పిచ్చి ట్వీట్లతో హైప్ క్రియేట్ చేస్తున్నాను అనుకుంటాడు… కానీ ఇలాంటివి సాయిరెడ్డి నాసిరకం ట్వీట్లలా పరువు తీస్తుంటాయనే సోయి వైసీపీ ముఖ్యులకు వెలగదు… వెలిగేలోపు కొండా మురళి సినిమాలాగా కథ చప్పున ఆరిపోతుంది… సో, కథ కంచికి, వర్మ ఇనయ ఇంటికి…
తనే అంతకు ముందు ఏదో ట్వీట్‌లో చెప్పాడు… ‘‘అహంకారానికి , ఆశయానికి మధ్య జరిగిన పోరాటం నుండి ఉద్భవించిన “వ్యూహం” కధ , రాజకీయ కుట్రల విషం తో నిండి వుంటుంది . రాచకురుపు పైన వేసిన కారం తో బొబ్బలెక్కిన ఆగ్రహానికి ప్రతికాష్టే “వ్యూహం” చిత్రం.
నేను అతి త్వరలో “వ్యూహం” అనే రాజకీయ సినిమా తియ్యబోతున్నాను ..ఇది బయోపిక్ కాదు …బయో పిక్ కన్నా లోతైన రియల్ పిక్. బయో పిక్ లో అయినా అబద్దాలు ఉండొచ్చు కానీ ,రియల్ పిక్ లో నూటికి నూరు పాళ్ళు నిజాలే ఉంటాయి.
ఈ చిత్రం 2 పార్ట్స్ గా రాబోతుంది .. మొదటి పార్ట్ “వ్యూహం” ,2nd పార్ట్ “శపథం” .. రెండింటిలోనూ రాజకీయ ఆరాచకీయాలు పుష్కలంగా వుంటాయి. రాష్ట్ర ప్రజలు మొదటి చిత్రం “వ్యూహం “ షాక్ నుంచి తెరుకునే లోపే వాళ్ళకి ఇంకో ఎలెక్ట్రిక్ షాక్ , పార్ట్ 2 “శపథం “ లో తగులుతుంది .
వ్యూహం “ చిత్ర నిర్మాత నాతో అంతకు ముందు వంగవీటి సినిమా తీసిన దాసరి కిరణ్ . ఎలక్షన్స్ టార్గెట్ గా ఈ చిత్రం తియ్యట్లేదని చెప్తే ఎవ్వరూ నమ్మరు కనక ,ఏం చెప్పాలో, ఏం చెప్పకూడదో చెప్పాల్సిన అవసరం లేదని మీకు వేరే చెప్పక్కర్లేదు కనక చెప్పట్లేదు..’’
https://twitter.com/RGVzoomin/status/1585895435167707137?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1585895435167707137%7Ctwgr%5E562e17a6d5cb5bb222835854c3e2d6e23f02a556%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Ftelugu.samayam.com%2Fandhra-pradesh%2Fnews%2Fram-gopal-varma-another-tweet-on-vyuham-movie%2Farticleshow%2F95141222.cms
Ads
ఆ భాష చూడండి… ‘‘రాష్ట్ర ప్రజలు మొదటి చిత్రం “వ్యూహం “ షాక్ నుంచి తెరుకునే లోపే వాళ్ళకి ఇంకో ఎలెక్ట్రిక్ షాక్ , పార్ట్ 2 “శపథం “ లో తగులుతుంది …’’ నిజమే, అసలు మొదటి చిత్రం షాక్ నుంచి తేరుకుంటే కదా… మరో ఆణిముత్యం చదవండి… ‘‘ రాచకురుపు పైన వేసిన కారం తో బొబ్బలెక్కిన ఆగ్రహానికి ప్రతికాష్టే “వ్యూహం” చిత్రం…’’ ఆగ్రహం బొబ్బలెక్కడం ఏమిటో, అసలు ఈ ప్రతికాష్ట అనే పదం ఏ భాషో వర్మకే తెలియాలి…
బయోపిక్ అయితే అబద్ధాలు ఉండొచ్చట, కానీ తను తీసేది రియల్ పిక్ అట… అన్నీ నిజాలే ఉంటాయట… అన్నీ నిజాలే తీస్తే ఆ సినిమా మాకు దేనికి మరి..? మాకు చంద్రబాబు బట్టలు విప్పే సినిమా కావాలి… జగన్‌ను హీరోగా పొగిడి, ఆకాశానికి ఎత్తే సినిమా కావాలి… వైఎస్ వంటి దేవుడు మళ్లీ పుట్టడు అని కీర్తించే సినిమా కావాలి… ఎన్నికల్లో ఫాయిదా కావాలి… కానీ ఈ అరబుర్రతో తీసే రియల్ పిక్స్, సర్రియల్ పిక్స్ మాకెందుకు..? అప్పట్లో పవన్ కల్యాణ్ మీద తీసిన సినిమాను ఎవరైనా జగన్‌కు చూపిస్తే బాగుండు… తన పరువు తను కాపాడుకునే టైమ్ ఇప్పటికీ ఉంది… ఉంది…!!
Share this Article