మీకు గుర్తుందా..? పోనీ, ఆర్కైవ్స్‌లోకి వెళ్లి వెతికినా కనిపిస్తుంది… అది డిసెంబరు 13, 2021…. సమంతకు బాగా అస్వస్థత… ఎఐజీ ఆసుపత్రిలో పరీక్షలు, చికిత్స… తరువాత ఇంట్లో విశ్రాంతి… ఈ వార్త దాదాపు ప్రతి మెయిన్ సైటులోనూ వచ్చింది… కానీ అంతకుముందు పలు సోషల్ సైట్లు ఆమె అనారోగ్య కారణాలపై ఏదేదో రాసేయడంతో ఆమె మేనేజర్, పీఆర్వోలు అది మామూలు దగ్గు, జలుబు మాత్రమేనని వివరణ ఇచ్చుకున్నారు… కానీ అప్పటి నుంచే చాలామందికి తెలుసు ఆమె ఓ సీరియస్ వ్యాధితో బాధపడుతోందని… అదే ఇప్పుడు ఆమె వెల్లడించిన మయోసైటిస్… కాకపోతే కొన్ని నెలల క్రితమే గుర్తించారు అని చెబుతోంది… కానీ ఇది చాన్నాళ్లుగా ఉంది ఆమెకు…
నిజానికి ఆమె అప్పటికే సుగర్ పేషెంట్… 2013లోనే గుర్తించినట్టు ఆమే చెప్పుకుంది… కాకపోతే మంచి ఆరోగ్య సూత్రాలు, ఆహార నియమాలు, వ్యాయామంతో ఆమె వ్యాధిని తన కంట్రోల్‌లో ఉంచుకుంది… ఏదో సినిమాలో డయాబెటిక్‌గా కూడా నటించినట్టు గుర్తు… ఫిట్‌నెస్ కాపాడుకోవడానికి బాగా ప్రయారిటీ ఇస్తుంది ఆమె… కానీ అది దుర్మార్గమైన వ్యాధి… చాలా అరుదైన ఆటో ఇమ్యూన్ వ్యాధి… ఆమె చాలా విశ్వాసంతో దాన్ని ఎదుర్కుంటోంది…
వ్యాధిని ఇప్పుడు ఆమె దాచుకోవడం లేదు… బహిరంగం చేసింది… ఎనలేని ఆత్మధైర్యాన్ని కనబరిచింది ఓ నోట్‌లో… గుడ్… మనిషికి ఏ వ్యాధి నుంచైనా సగం చికిత్స ఇలాంటి సెల్ఫ్ మోటివేషన్, సెల్ఫ్ కరేజ్ మాత్రమే… డాక్టర్లు, హాస్పిటళ్లు, మందులు, బాడీ రెస్పాన్స్ గట్రా తదుపరి ఉపయుక్తాలు… ఆమె ఎంత కాన్ఫిడెంటుగా ఉందో ఆమె ట్వీటే చెబుతోంది…
Ads
‘‘మీతో నాకున్న ఈ ప్రేమ, అనుబంధమే నాకు జీవితంలో ఎదురయ్యే కఠిన సవాళ్లను ఎదుర్కోవడానికి కావాల్సిన మనోబలాన్ని ఇస్తుంది. కొన్ని నెలల క్రితమే నాకు ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అయిన ‘మయోసైటిస్’ అనే వ్యాధి ఉన్నట్లు తెలిసింది.
వ్యాధి కాస్త నయం అయ్యాక ఈ విషయం మీతో చెప్పాలనుకున్నా. కానీ ఇది తగ్గడానికి మేం అనుకున్నదాని కంటే కాస్త ఎక్కువ సమయమే పడుతోంది. అన్ని విషయాల్లో ప్రతీసారి బలంగా ముందుకెళ్లలేమనే సంగతి మెల్లిగా నాకు ఇప్పుడే తెలుస్తుంది.
త్వరలోనే ఇది పూర్తిగా నయం అవుతుందని వైద్యులు పూర్తి నమ్మకంతో చెబుతున్నారు. శారీరకంగా చూసుకున్నా లేదా ఉద్వేగాల పరంగా చూసుకున్నా నేను మంచి రోజులను, చెడు రోజులను రెండింటినీ చూశాను. ఇక దీన్ని నేను భరించలేను అని అనుకున్న ప్రతీసారి దాన్నుంచి బయటపడ్డాను. ఇది కూడా అంతే. దీన్నుంచి కోలుకునే దిశగా మరో రోజు గడిచిపోయింది. లవ్యూ. ఈ సమయం కూడా గడిచిపోతుంది” అని ఆమె ట్వీట్‌లో పేర్కొన్నారు…
ఆమె స్నేహితులు, ఆమె కుటుంబసభ్యులు ఆమెకు తోడుగా ఉండవచ్చు… అన్నింటికీ మించి తన విశ్వాసమే తనకు బలం… ఎందుకంటే, డయాబెటిస్‌లాగే ఇదీ పూర్తిగా నివారింపబడదు… దాంతో కలిసి బతకాల్సిందే… కానీ అదుపులో పెట్టుకుని మరీ బతకాలి… సమంతకు ఆ సామర్థ్యం ఉంది… కానీ ఒక్కోసారి అనిపిస్తుంది… తను అలాగే అక్కినేని కుటుంబంలో ఉంటే తనకు మరింత బలమైన సపోర్ట్ దొరికేదేమో అని… కొన్ని దూరమైతే గానీ వాటి విలువ తెలియదు…
తను అంతకుముందే సిద్ధార్థ్ అనే ఓ నాన్ సీరియస్ ఫెలోతో ప్రేమ యవ్వారం నడిపింది… తరువాత తన గుణం అర్థమైంది, వదిలేసింది… చాన్నాళ్లు ఎవరినీ తన దగ్గరకు రానివ్వలేదు… చైతూ ఎలాగోలా ఆమె క్లోజ్ సర్కిల్‌లో చేరాడు… కలిసిపోయారు, పెళ్లి కూడా చేసుకున్నారు… కానీ కొన్నాళ్లకే విడిపోయారు…
సరే, కారణాలు, కారకులు ఏమైతేనేం, ఎవరైతేనేం… ఖచ్చితంగా ఆ కుటుంబం ఆమెకు బలమైన దిక్కుగా నిలబడేది… అలాంటి సపోర్ట్ ఇలాంటి వ్యాధుల్ని సగం నిర్వీర్యం చేస్తాయి… వోకే సామ్, విష్ యూ స్పీడీ రికవరీ… అలియాస్ యశోద…! ( ఆమెను చిన్నప్పుడు కుటుంబ సభ్యులు, స్నేహితులు యశోద అనే పిలిచేవారు… అనారోగ్య పీడిత మహిళల కోసం ఆమె ఓ హెల్త్ ఎన్జీవోను నడిపిస్తోంది… ఇప్పుడు ఆమే ఓ బాధితురాలు.. డెస్టినీ…)
Share this Article