నిజానికి వ్యక్తి పూజ మంచిది కాదు నిజమే… కానీ పునీత్ పట్ల కర్నాటక రాష్ట్రం కనబరిచే అభిమానం తన సినీ గ్లామర్ గురించి కాదు… దాన్ని ప్రభుత్వం పట్టించుకోదు, అవసరం లేదు… పునీత్ బతికి ఉన్నప్పుడు నిర్వహించి దాతృత్వ కార్యక్రమాలు ఒక కారణం… ప్రజల్లో తన పట్ల పెల్లుబుకుతున్న అభిమానం మరో కారణం… ప్రభుత్వ కార్యక్రమాలకు ఉచితంగా బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రచారాలు నిర్వహించడం ఇంకో కారణం…
Ads
ఈమధ్యే పునీత్‌కు మైసూరు యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్‌ను ప్రకటించింది… ఐనా కర్నాటక రత్న పురస్కారంతో రాష్ట్రం ప్రేమగా ఆ పేరును హత్తుకున్నాక మిగతావన్నీ అప్రధానాలు… ఇంతకీ పిల్లల ఉపగ్రహం ఏమిటి..? అదీ చెప్పుకోదగిన విషయం… దేశ 75 ఏళ్ల స్వాతంత్య్ర ఉత్సవాల్ని ఆజాదీకా అమృత్ మహోత్సవ్ పేరిట నిర్వహిస్తున్నాం కదా… ఈ సందర్భంగా ఓ కార్యక్రమాన్ని తీసుకున్నారు… కాబోయే ఫిజిక్స్ సైంటిస్టులు, ఆస్ట్రో సైంటిస్టుల్లో మెరికలను ఎంపిక చేసి ఏకంగా 75 ఉపగ్రహాలను రూపొందింపజేసి, కక్ష్యలోకి ప్రవేశపెట్టాలి…
జాతీయ స్థాయిలో వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో 75 ఉపగ్రహాలను ఆల్‌రెడీ విద్యార్థులు రూపొందిస్తున్నారు… ఒక్కొక్కటీ కిలోన్నర బరువు ఉంటాయి, అంతే… అందులో భాగమే ఈ ‘శాటిలైట్ పునీత్’ కూడా… కర్నాటక రాష్ట్రంలో జోన్ లెవల్, స్టేట్ లెవల్ కంపిటీషన్లు పెడుతున్నారు పిల్లలకు… కర్నాటకలోనే 1000 మందిని షార్ట్ లిస్ట్ చేశారు… ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించేరోజున వీళ్లందరినీ శ్రీహరికోటకు తీసుకువెళ్తారు… ఖగోళ పరిశోధనలు, ఫిజిక్స్, సైన్స్ పట్ల విద్యార్థుల్లో అనురక్తిని పెంచడం ఈ కార్యక్రమ ఉద్దేశం… వీళ్లందరికీ బెంగుళూరులోని వివిధ సైన్స్ రీసెర్చ్ కేంద్రాల్లో శిక్షణ, బోధన ఉంటుంది… మంచి ప్రోగ్రామే…
Share this Article