పార్ధసారధి పోట్లూరి ……… మూడవ ప్రపంచ యుద్ధం – అప్ డేట్ ! దక్షిణ కొరియా…. దక్షిణ కొరియా మరియు అమెరికాలు కలిసి కొరియా గగనతలంపైన 100 కి పైగా యుద్ధ విమానాలతో మాక్ డ్రిల్ చేస్తున్నాయి గత 24 గంటలుగా ఆపకుండా! టర్కీ – సైప్రస్ ! సైప్రస్ గగనతలం మీద అమెరికాకి చెందిన F-22 యుద్ధ విమానాలు మాక్ డ్రిల్ చేస్తున్నాయి. గతంలో సైప్రస్ మీద విధించిన ఆంక్షలని తొలగించింది అమెరికా. టర్కీని బెదిరించడానికేనా ? ఉక్రెయిన్ ! అణు బాంబు తయారుచేయడానికి సహకరించాల్సిందిగా పాకిస్థాన్ ని అర్ధించిన జెలెన్స్కీ ! దర్యాప్తు చేస్తున్న ఐక్యరాజ్యసమితి పరిశీలక బృందం ! క్రూయిజ్ మిసైళ్ళతో మళ్ళీ విరుచుకుపడ్డ రష్యా! ఉక్రెయిన్ రాజధాని కీవ్ ని లక్ష్యంగా చేసుకొని కీలక ఇన్ఫ్రా స్ట్రక్చర్స్ ని ధ్వంసం చేస్తున్న రష్యా !
అమెరికా – ఆస్ట్రేలియా ! అణు బాంబులని మోసుకుపోగల 6 B-52 బాంబర్ల ని ఆస్ట్రేలియాకి పంపిన అమెరికా ! చైనాకి ముందస్తు హెచ్చరికగా అనుకోవచ్చా ? మూడు నెలల క్రితం ఐక్యరాజ్యసమితి మధ్యవర్తిత్వంతో ఉక్రెయిన్ నుండి గోధుమలు, సన్ ఫ్లవర్ ఆయిల్, మరియు ఇతర ఆహార ధాన్యాలని నల్ల సముద్రం ద్వారా ఎగుమతి చేసుకోవడానికి రష్యా అనుమతి ఇచ్చింది అలాంటి ఎగుమతుల మీద ఎలాంటి దాడులు చేయబోనని ! వ్లాదిమిర్ పుతిన్ ఇప్పుడు ఆ హామీని వనక్కి తీసుకొని దాడులు చేస్తానని హెచ్చరిస్తున్నాడు !
ఇక వివరాలలో వెళ్దాం ! 1974 లో సైప్రస్ దేశంలోని ఉత్తర భాగాన్ని టర్కీ ఆక్రమించుకుంది ! ఆ సమయంలో టర్కీ సైప్రస్ దేశాల మధ్య చిన్నపాటి యుద్ధం జరిగినది, కానీ పరిణామంలో పెద్దది మరియు నాటోలో సభ్యురాలిగా ఉన్న టర్కీని ఎదుర్కోలేక పోయింది సైప్రస్ ! కానీ అమెరికా ఆయుధాలు సరఫరా చేస్తూ వచ్చింది సైప్రస్ కి కానీ టర్కీ అభ్యంతరం పెట్టడం వలన 1987 లో సైప్రస్ కి ఆయుధాలు అమ్మడం మీద ఆంక్షలు విధించింది అమెరికా !
Ads
గత నాలుగేళ్లుగా టర్కీతో అమెరికా సంబంధాలు క్రమంగా క్షీణిస్తూ వచ్చాయి. పాకిస్థాన్, చైనా, రష్యాలతో టర్కీ సన్నిహిత సంబంధాలని నెరపడం నాటో సభ్య దేశం అయిన టర్కీతో అమెరికా విభేదాలు తీవ్రస్థాయిలోకి వెళ్లిపోయాయి. మూడేళ్ళ క్రితం టర్కీ రష్యా నుండి S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కొన్నది అమెరికా అభ్యంతరాలని లెక్క చేయకుండా… దాంతో F-35 ప్రోగ్రామ్ లో భాగస్వామిగా ఉన్న టర్కీని అమెరికా తొలగించింది. గత సంవత్సరం టర్కీని FATF గ్రే లిస్ట్ లో పెట్టించింది. తాజాగా టర్కీ శత్రు దేశం అయిన సైప్రస్ దేశం మీద ఉన్న ఆయుధ సరఫరా ఆంక్షలని ఎత్తివేసింది.
ఆంక్షలు ఎత్తివేసిన రెండు వారాల తరువాత, మూడు రోజులపాటు 1974 లో టర్కీ ఆక్రమించిన సైప్రస్ దేశానికి చెందిన భూభాగం అయిన ఫామగుస్తా [Famagusta] ఎయిర్ స్పేస్ మీద F -22 రాప్టర్ యుద్ధ విమానాలతో విన్యాసాలు చేసినట్లు గ్రీక్ మీడియా వెల్లడించింది. విచిత్రం ఏమిటంటే, F-22 Raptor లని టర్కీ ఆక్రమిత ఎయిర్ స్పేస్ మీద ఉపయోగించడం ఆశ్చర్యం కలిగించింది ! ఎందుకంటే విదేశాలలో ఇంతవరకు F-22 Raptor లని ఉపయోగించలేదు అమెరికన్ ఎయిర్ ఫోర్స్ . ఇదే మొదటిసారి ఇలా విన్యాసాలు చేయడం !
బహుశా రష్యన్ S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ టర్కీ దగ్గర ఉండడం ప్రధాన కారణం కావొచ్చు. రష్యన్ S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ స్టెల్త్ ఫైటర్ అయిన F-22 Raptor ని డిటెక్ట్ చేయగలదా లేదా అనే విషయాన్ని ధృవ పరచుకోవడానికే ఈ విన్యాసాలు చేసి ఉండవచ్చు . రష్యా మాత్రం తమ S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ F-22 Raptor లని కూడా డిటెక్ట్ చేసే మిసైల్ దాడి చేయగలదు అంటూ చెప్పుకొస్తున్నది. ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావిస్తున్నాను అంటే F-22 Raptor రాడార్ డాటాని మన దేశంతో అమెరికా కనుక పంచుకుంటే అప్పుడు F-22 Raptor కి కాపీ అయిన చైనా J-20 స్టెల్త్ ఫైటర్ ని ఎలా మేనేజ్ చేయాలో మనకి తెలిసిపోతుంది. కాకపోతే తన F-22 Raptor రాడార్ డాటాని మనతో పంచుకుంటుందా అమెరికా అనేదే ప్రశ్న!
F-22 Raptor లో ఉన్న పవర్ ఫుల్ రాడార్ S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తో కలిసి పనిచేసే సెర్చ్ రాడార్ సిగ్నల్స్ ని రికార్డ్ చేయగలదు. అదే సమయంలో S-400 F-22 Raptor ని గుర్తించిందా లేదా అన్నది తెలుసుకోవచ్చు! రెండేళ్ల క్రితం సిరియాలో దాడి చేయడానికి వచ్చిన ఇజ్రాయెల్ F-35 ఫైటర్ జెట్ S-400 పరిధిలో ఉన్న ప్రాంతం మీద దాడి చేసి వెళ్ళిపోయింది. రష్యా నుండి వచ్చిన ఆదేశాలతో సిరియాలో ఉన్న S-400 సిస్టమ్ ని తాత్కాలికంగా ఆపేశారు ఆపరేటర్లు.
సిరియా దాడి చేసి వెళ్ళిపోయిన తరువాత మళ్ళీ S-400 ని యాక్టివేట్ చేశారు ఆపరేటర్లు అంటే S-400 ఇజ్రాయెల్ F-35 ని డిటెక్ట్ చేసి ఉండవచ్చు. అది చాలా దూరంలో ఉండగానే కానీ ఇజ్రాయెల్ ఫైటర్ జెట్ లని కూల్చాలా వద్దా అనే సందేహంతో వెంటనే రష్యాలో ఉన్న కమాండ్ ని సంప్రదించారు ఆపరేటర్స్… దాంతో కమాండ్ సెంటర్ నుండి వచ్చిన ఆదేశాల వల్ల తాత్కాలికంగా S-400 ని స్విచ్ ఆఫ్ చేశారు సిరియాలోని ఆపరేటర్లు… అయితే ఎందుకు రష్యాలో కమాండ్ సెంటర్ ఇజ్రాయెల్ F-35 ని చూస్తూ వదిలేశారు ?
1. రష్యా ఇజ్రాయెల్ తో మంచి సంబంధాలని కొనసాగించాలి అనే ఉద్దేశ్యంతో ఉంది కాబట్టి స్విచ్ ఆఫ్ చేయమని ఆదేశాలు ఇచ్చారు.
2. అమెరికన్ F-35 కావొచ్చు లేదా F-16 లు కావొచ్చు, ఇజ్రాయెల్ దిగుమతి చేసుకున్నాక వాటిలో తమ ఎలెక్ట్రానిక్స్ ని అమరుస్తుంది. వాటిలో మరీ ముఖ్యంగా ఎయిర్ డిఫెన్స్ రాడార్ ల సిగ్నల్స్ ని రికార్డ్ చేసే సౌకర్యం ఉంది. తిరిగి వెళ్ళిన తరువాత ఇజ్రాయెల్ సైంటిస్టులు ఎయిర్ డిఫెన్స్ రాడార్ ఎలాంటి బాండ్ ని వాడుతూ ఎలాంటి ఫ్రీక్వెన్సీ లని ప్రసారం చేసింది అన్నది తెలుసుకుంటారు. ఇలా రెండు మూడు సార్లు జరిగాక మొత్తం డాటాని విశ్లేషించి తరువాతి దాడిలో ఎలాంటి ఫ్రీక్వెన్సీలని జామ్ చేసి, ఆయా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ని ధ్వంసం చేయవచ్చో ఒక ప్లాన్ సిద్ధం చేసి పైలట్లకి ఇస్తారు సైంటిస్టులు.
3. ఇలాంటి అవకాశం ఇజ్రాయెల్ కి ఇవ్వకూడదు అనే ఉద్దేశ్యంతో ముందు జాగ్రత్తగా రష్యన్ కమాండ్ స్విచ్ ఆఫ్ చేయమని ఆదేశాలు ఇచ్చింది !
ఎప్పుడో 1974 లో టర్కీ సైప్రస్ భూభాగాన్ని ఆక్రమించుకున్నది కానీ అప్పట్లో అమెరికాతో పాటు మిగతా నాటో దేశాలు అభ్యంతరపెట్టలేదు. ఎందుకంటే టర్కీ కూడా నాటోలో భాగంగా ఉంది, కానీ 38 ఏళ్ల తరువాత అదీ టర్కీ కోసం సైప్రస్ మీద ఆంక్షలు విధించిన అమెరికా ఇప్పుడు ఆ ఆంక్షలని తొలగించి స్వేచ్ఛగా తన ఆయుధాలని సైప్రస్ కి అమ్మడం కోసమేనా ? లేక టర్కీ మీద పరోక్షంగా యుద్ధం ప్రకటించడం అనుకోవాలా ? మరి టర్కీని నాటో నుండి ఎందుకు తొలగించలేదు?
ఒక పక్క తైవాన్ చైనాల మధ్య, మరో పక్క రష్యా ఉక్రెయిన్ ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న పరిస్థితులలో టర్కీ సైప్రస్ ల మధ్య కొత్తగా చిచ్చు పెట్టి టర్కీ ఆక్రమించుకున్న భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకోమని సైప్రస్ ని రెచ్చగొట్టి మరో యుద్ధానికి తెరతీయడానికి కారణం ఏమిటి ? దాని కోసం F-22 Raptor లని ఉపయోగించడం సైప్రస్ కి నైతిక మద్దతు ఇవ్వడానికా ? టర్కీ సైప్రస్ ల మధ్య ఘర్షణ వాతావరణాన్ని సృష్టించి సైప్రస్ చేత ఆయుధాలు కొనిపించి ఆపై మౌనంగా ఉంటుందా అమెరికా ? లేక నిజంగానే సైప్రస్ చేత యుద్ధం చేయించి తాను తోడుగా ఉంటుందా ? ఇలా చాలా ప్రశ్నలు ఉన్నాయి కానీ సమాధానాలు ఇచ్చేవారు లేరు.
టర్కీ పరోక్షంగా రష్యాకి మద్దతు ఇస్తున్నట్లు ఇటీవలే ఒక సంఘటన వెలుగు చూసింది. రష్యా ఉక్రెయిన్ ల మధ్య జరుగుతున్న యుద్ధ వార్తలని కవర్ చేస్తున్న ఉక్రెయిన్ జర్నలిస్ట్ అయిన ఒక మహిళని టర్కీలో అరెస్ట్ చేయమని పుతిన్ అడిగాడు. దానికి ప్రతిస్పందించిన టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ పుతిన్ అడిగిన మహిళా జర్నలిస్ట్ ని నిర్భంధంలోకి తీసుకున్నాడు కానీ ఆ మహిళా జర్నలిస్ట్ ని రష్యా కి అప్పచెప్పాడా లేదా అన్నది తెలియరాలేదు… కానీ ఈ చర్య అమెరికాకి ఆగ్రహం కలిగించింది ఉండవచ్చు, దానికి ప్రతిగా సైప్రస్ మీద ఆంక్షలు ఎత్తివేసి ఆయుధాలు కొనడానికి మార్గం సుగమం చేసింది అనుకోవచ్చు ! (ఇంకా ఉంది ….)
Share this Article