చర్చి ప్రజలను ఎగదోయవచ్చా..? ఆందోళనల్లో ఆజ్యం పోయవచ్చా..? తమకు సంబంధం లేని వ్యవహారాల్లో వేలుపెట్టి ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాల్ని నిర్వహించవచ్చా..? కేరళలో ఇప్పుడు ఇదే ప్రశ్న… ఎవరి నుంచి వస్తోంది అంటే…? కేరళలో అధికారంలో ఉన్న లెఫ్ట్ ప్రభుత్వం నుంచి… కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నుంచి… ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ కూటమి నుంచి… అందరిదీ అదే ప్రశ్న… విచిత్రం ఏమిటంటే..? వీళ్లంతా ఏకమై చర్చిని ప్రతిఘటించే ఉద్యమాలను చేపట్టడం..!
సాధారణంగా ఏ కాంగ్రెస్ వాదినో, ఏ కమ్యూనిస్టునో కదిలిస్తే ఇది ఆదానీ నిర్దేశించే ప్రభుత్వం… ఆదానీ కోసమే ఈ ప్రభుత్వం అని విమర్శలు చేస్తారు కదా… పైగా బీజేపీ ఎడ్డెం అంటే వాళ్లు తెడ్డెం అంటారు… విషయం ఏమిటనేది తరువాత, ముందయితే ఖండించేస్తారు… కానీ అదే ఆదానీ కోసం ఇవే బీజేపీ, లెఫ్ట్ కలిపి కొట్లాడితే దాన్నేమనాలి..? కమ్యూనిస్టులకు అప్పుడప్పుడూ నిజాలు అర్థమవుతాయి అనుకోవాలి… వివరాల్లోకి వెళ్తే…
కేరళలో విజింజం అనే స్పెషల్ ఎకనమిక్ జోన్ డెవలప్ చేస్తున్నారు… అందులో ఒక పోర్టు కూడా నిర్మిస్తున్నారు… 2015లో 7500 కోట్లతో చేపట్టిన ప్రాజెక్టు అది… ఆదానీ వాళ్లు చేపట్టారు… (ఎయిర్ పోర్టులు, సీ పోర్టులన్నీ ఆదానీ గుత్తాధిపత్యమే కదా…) అయితే లోకల్ మత్స్యకారుల్ని రెచ్చగొడుతూ అక్కడి చర్చి పదే పదే అడ్డంకులు సృష్టిస్తోంది… ఆందోళనలు చేయిస్తోంది… విజింజం సమరసమితి నిర్వహించే ఈ ఆందోళనలు హింసాత్మకం అవుతున్నట్టు లెఫ్ట్ ప్రభుత్వం ఆరోపిస్తూనే ఉంది…
Ads
చర్చి వెనక్కి తగ్గలేదు… లెఫ్ట్ మీడియాలో మత్స్యకారులను ఎగదోస్తున్న చర్చి, విదేశీశక్తులు అంటూ కథనాలు వచ్చాయి… కొన్ని డిమాండ్లను అంగీకరించింది… కానీ సమస్య తెగలేదు… దాంతో ఇక బీజేపీ, లెఫ్ట్ ఒక్కటై ఉల్టా ఆందోళనలకు దిగాయి… ఆదానీ పోర్టుకు మద్దతుగా… లెఫ్ట్ ఆదానీకి మద్దతుగా ఉద్యమించడం అనే వాక్యమే విచిత్రంగా ఉంది కదూ… కాషాయం, ఎరుపు కదిలి కదం తొక్కడం, వెనుక కాంగ్రెస్ కూడా మద్దతునివ్వడం మరో విశేషం…!
Share this Article