నిన్న ఎక్కడో భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ ఇద్దరు పిల్లలకు కరాటే టెక్నిక్స్ చూపిస్తున్నాడు సరదాగా… అంతేకాదు, మొన్న హఠాత్తుగా పరుగు ప్రారంభించాడు… అసలు ఒకరోజంతా నడిస్తే ఎలా ఉంటుంది అని సవాళ్లు విసురుతున్నాడు… వెంబడి వచ్చే కేడర్, సెక్యూరిటీకి ఠారెత్తి పోతోంది…
ఇక బీజేపీ శ్రేణులు వెటకారంగా రాహుల్ ఫిట్నెస్ మీద జోకులు వేస్తున్నాయి… కానీ అవన్నీ నాన్సెన్స్… 52 ఏళ్ల రాహుల్ ఖచ్చితంగా చాలా చాలా మంది నాయకులకన్నా పర్ఫెక్ట్ ఫిట్… అంతేకాదు, ఆ పిల్లలకు మార్షల్ ఆర్ట్స్ చెబుతున్నాడు కదా, దానికీ అర్హుడే… ఎందుకంటే..? తను అయికిడో అనే ఓ జపనీస్ మార్షల్ ఆర్ట్‌లో బ్లాక్ బెల్ట్ సంపాదించాడు… గతంలో ఆ ఫోటోలు కూడా చూశాం…
అసలు ఏమిటీ అయికిడో…? రకరకాల మార్షల్ ఆర్ట్స్ టెక్నిక్స్ కలిసి రూపొందించిన ఓ మోడరన్ మార్షల్ ఆర్ట్… ఎక్కువగా మెంటల్, ఫిజికల్ ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యం ఇస్తుంది… రాహుల్ మెంటల్ ఫిట్నెస్ సంగతేమిటో గానీ ఫిజికల్ ఫిట్నెస్ మాత్రం ఫిట్… కాకపోతే ఆ గడ్డమే మరీ ముసలోడిగా చూపిస్తోంది…
Ads
నిజానికి అయికిడోను డెవలప్ చేశారు కానీ ఇండియాలో పెద్దగా పాపులర్ కాలేదు అది… ఇండియాలో ఇప్పటికీ కరాటే, టైక్వాండో, జుడో, కిక్ బాక్సింగ్ వంటివే పాపులర్… వారణాసిలో అయికిడో ట్రెయినింగ్ సెంటర్ ఉండేది గానీ ఆమధ్య అదీ ఎత్తేసినట్టున్నారు… బహుశా రాహుల్ ఢిల్లీలోనే నేర్చుకుని ఉండాలి… అందులో భాగంగానే కత్తియుద్ధం కూడా నేర్చుకున్నాడు… లండన్‌లో ఉన్నప్పుడు బ్రెజిలియన్ మార్షల్ ఆర్ట్ జియు-జిట్సు అనే మార్షల్ ఆర్ట్‌ను కూడా నేర్చుకున్నాడు…
అప్పుడప్పుడూ హఠాత్తుగా రాహుల్ మాయమైపోతుంటాడు… ఏదో అబ్రాడ్ అంటాడు… ఈ ట్రెయినింగ్ కోసమే వెళ్లి ఉంటాడా..? కానీ రైట్ వింగ్ బదనాం చేసేది వేరు… 2004లోనే తనకు ఓ స్పానిష్ గరల్ ఫ్రెండ్ ఉందని రాహుల్ ప్రెస్మీట్లో బహిరంగంగానే వెల్లడించాడు… దాపరికం ఏమీ లేదు… ఆమె వెనిజులాలో ఉంటుందనీ, వృత్తిరీత్యా ఆమె ఆర్కిటెక్ట్ అనీ చెప్పాడు… తాను ఇంగ్లండులో చదివేటప్పుడు ఆమె పరిచయం… కానీ ఏమైందో, ఎందుకో గానీ… తను అసలు జీవితంలో పెళ్లే చేసుకోను అని 2013లో ప్రకటించాడు…
ఆమె కోసం అప్పుడప్పుడూ బయటికి వెళ్లి వస్తుంటాడనే ప్రచారం ఇక దాంతో ఆగిపోయింది… బ్లాక్ బెల్ట్ కూడా రావడంతో అయికిడో కోసం అప్పుడప్పుడూ వేరే దేశాలకు వెళ్లి వస్తున్నాడు అనే ప్రచారానికీ ఫుల్ స్టాప్ పడింది… తను గొప్ప లీడర్ కాకపోవచ్చు, రాజకీయ పరిణతి లేకపోవచ్చు, పొలిటికల్ ఫైటర్ కాకపోవచ్చు కానీ ఫిజికల్ ఫిట్నెస్, హెల్త్ విషయంలో మాత్రం ప్రస్తుతానికి రాహుల్‌కా జవాబ్ నహీఁ …. అన్నట్టు తండ్రిలాగే తనకూ పైలట్ లైసెన్సు ఉందండోయ్…
Share this Article