అల్లు శిరీష్..! ఓసారి చెప్పుకోవాలి… తనలో స్పాంటేనిటీ ఉంది, ఎనర్జీ ఉంది… సెన్సాఫ్ హ్యూమర్ ఉంది… బలమైన బ్యాక్ గ్రౌండ్ ఉంది… కానీ వీసమెత్తు లక్కు లేదు… ఎస్, ఇద్దరు అన్నదమ్ముల కథలు ఒకేరీతిలో సాగాలని ఏముంది..? ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ కథ తెలియదా మనకు… సేమ్, అల్లు అర్జున్ అలియాస్ బన్నీ ఎక్కడికో వెళ్లిపోయాడు… శిరీష్ ఎక్కడున్నాడో అక్కడే ఆగిపోయాడు…
అల వైకుంఠపురంలో తనను స్టార్ హీరోగా నిలబెట్టింది… పుష్ప అయితే జాతీయ స్థాయికి తీసుకుపోయింది… తన ప్లస్ పాయింట్స్ ఏమిటంటే..? హార్డ్ వర్కర్, మంచి డాన్సర్… తనలాగా స్టెప్పులు వేసే హీరో టాలీవుడ్‌లో ఇప్పుడు వేరే ఎవరూ లేరు… ప్లస్ రఫ్ అండ్ టఫ్… నటన మాటెలా ఉన్నా తనకు లక్కు కలిసొచ్చింది… దాంతో సూపర్ హిట్ అయిపోయాడు… పుష్ప జోరుతో మరో పదేళ్ల దాకా బన్నీకి ఢోకా లేదు…
సీన్ కట్ చేస్తే… శిరీష్… స్టెప్పులు పెద్దగా చేతకావు… రఫ్ అండ్ టఫ్ పాత్రలు పెద్దగా సూట్ కావు, ఆ ప్రయత్నాలూ చేయనట్టున్నాడు… దాంతో కెరీర్ కుంటుతోంది… తన మొత్తం కెరీర్‌లో ఏడు సినిమాలు… అదీ పదేళ్లలో… అందులో ఒకటి మలయాళం… 2019లో ఏబీసీడీ సినిమా వచ్చాక మళ్లీ ఇప్పుడే తెర మీద కనిపిస్తున్నాడు… (ఏబీసీడీ కూడా ఏదో మలయాళ సినిమాకు రీమేక్)… రాక్షసివో ఊర్వశివో సినిమాతో… మూడేళ్లుగా తను ఖాళీ… ఈ సినిమా పేరు కూడా మొదట్లో ‘ప్రేమ కాదంట’ అని పెట్టారు… మళ్లీ మార్చారు…
Ads
ఈ సినిమా కూడా ప్యార్ ప్రేమ కాదల్ అనే సినిమాకు రీమేక్… ఎక్కడో డబ్బాల్లోనే ఆగీ ఆగీ ఎట్టకేలకు రిలీజైంది… అల్లు అరవింద్ కొడుకు సినిమాకు ఈ దుర్గతి ఏమిటో మరి..? అనూ ఇమాన్యుయేల్‌తో లిప్ లాక్ సహా కాస్త రొమాన్స్ సీన్లు దట్టించినా సినిమాకు హిట్ టాక్ ఏమీ రాలేదు… మూడు హగ్గులు, ఆరు కిస్సులు ఎట్సెట్రా ఫ్యామిలీ ప్రేక్షకులను దగ్గరకు రానివ్వవు… పెట్టుబడికి తగిన లాభం వస్తే రావచ్చుగాక, కానీ శిరీష్‌ను కాస్త బలంగా నిలబెట్టే సినిమా కాదు… మరి వాట్ నెక్స్ట్..?
బలమైన బ్యాక్ గ్రౌండ్ ఇండస్ట్రీకి పరిచయం చేస్తుంది… ఎంట్రీ ఇస్తుంది… బలంగా సపోర్ట్ ఇస్తుంది… కానీ నిలబడాల్సింది సదరు వారసుడే… తనలోని మైనసులు, ప్లస్సులు విశ్లేషించుకుంటూ, మార్కెట్ ట్రెండ్స్ పట్టుకుంటూ, కష్టపడాల్సిన బాధ్యత తనదే… ఏళ్ల కొద్దీ తండ్రి సపోర్ట్ చేయలేడు… వారసత్వం ఒక అవకాశం మాత్రమే… పదేళ్లలో శిరీష్ వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమీ లేదు… నా సినిమా అని చెప్పుకునే ఒక్క సినిమా లేదు… ఊర్వశివో సినిమాలో కాస్త నటన ఇంప్రూవ్ అయ్యింది… అదొక్క రిలీఫ్…
ఈ హగ్గులు, ఈ కిస్సులు, ఈ దిక్కుమాలిన రొమాన్స్ సీన్లతో… పాత కథల్లో మునిగితేలడంకన్నా ఏవైనా ప్రయోగాలు చేయవచ్చు కదా శిరీష్… నాకెందుకు రిస్క్..? తోచినప్పుడు ఓ సినిమా తీస్తాను, మా ఆస్తులు చూసుకుంటే సరిపోదా ఏం..? అంటావా…శుభం… టైంపాస్ హీరోలను వెండితెర చాలామందిని చూసింది.., వదిలేసింది…!!
Share this Article