Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఈ తుషార్ అసలు కథ ఇదా..? అబ్బో.., కేసీయార్‌కూ ఇన్‌డైరెక్ట్ దోస్త్…!!

November 4, 2022 by M S R

‘‘తుషార్ చెబితే సంతోష్ వింటాడు, సంతోష్ చెబితే అమిత్ షా వింటాడు, అమిత్ షా చెబితే మోడీ వింటాడు… ఆ తుషార్ మధ్యవర్తిగా తెలంగాణలో ఎమ్మెల్యేలను కొంటున్నారు…’’ ఇదే కదా కేసీయార్ మొన్న పదే పదే చెప్పింది… అసలు ఎవడు ఈ తుషార్..? కేబినెట్ సెక్రెటరీయా..? ఆర్ఎస్ఎస్ ప్రముఖ్..? అజిత్ ధోవల్ చుట్టమా..? అబ్బే, ఎవరూ కాదట… ఇదే కేసీయార్ చెప్పాడు… రాహుల్ గాంధీ మొన్నటి ఎన్నికల్లో కేరళలో వయనాడులో నిలబడ్డాడు కదా, అదుగో అప్పుడు రాహుల్ మీద పోటీచేశాడట… బీజేపీ అభ్యర్థి అట…

నిజానికి ఎవరీ తుషార్ అని కాస్త సెర్చితే నవ్వొచ్చే విషయాలు బయటపడ్డాయి… అసలు ఆ తుషార్ బీజేపీ మనిషే కాదు… తను రాహుల్‌పై పోటీచేసిన బీజేపీ అభ్యర్థి కాదు… అన్నింటికీ మించి… ఏ లెఫ్ట్ పార్టీలయితే ఫాఫం, ఇప్పుడు కేసీయార్ చంకలోకెక్కాయో, కేసీయార్ బహుళ కీర్తనలతో వాళ్లను బుజ్జగిస్తున్నాడో… ఆ లెఫ్ట్ పార్టీలకు ఈ తుషార్ సన్నిహితుడు… వివరాలు కావాలా..? చెప్పుకుందాం… 

తన పేరు తుషార్ వెల్లపల్లి… తండ్రి పేరు నటేశన్… వీళ్లకు ఓ పార్టీ ఉంది… దాని పేరు భారత ధర్మ జనసేన… బీడీజేఎస్… వయనాడులో బీజేపీకి వేరే దిక్కు లేక, నిలబడేవాడు లేక ఈ తుషార్‌కు మద్దతునిచ్చింది… ఫోవోయ్, నువ్వే ఎన్‌డీఏ అభ్యర్థివి అని ప్రకటించింది… తరువాత ఏమీ పట్టించుకోలేదు… తుషార్‌కు కూడా పెద్ద సీనేమీ లేదు… అది ముస్లిం ప్రాబల్యమున్న సీటు… రాహుల్‌కు వచ్చిన వోట్లలో తుషార్‌కు పదో వంతు కూడా రాలేదు… డిపాజిట్ కూడా రాలేదు… తను చెబితే బీజేపీ హైకమాండ్ వింటుందట… ఇంకా ఉంది…

తుషార్ తండ్రి నటేశన్‌కు ఓ సంస్థ ఉంది… దాని పేరు శ్రీనారాయణ ధర్మపరిపాలన యోగం… ఎస్‌ఎన్‌డీపీ… అది కేరళలోని ఈళవ అనే ఓ బలమైన బీసీ కమ్యూనిటీని రిప్రజెంట్ చేస్తుంటుంది… ఆ సంస్థకు నటేశన్ ప్రధాన కార్యదర్శి… ఆమధ్య కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్, కొందరు మంత్రులు నటేశన్ నివాసానికి ‘‘స్నేహపూర్వక’’ పర్యటనకు వెళ్లారు… ఎందుకంటే… పలు హిందూ సమస్యల మీద ఈ సంస్థ సీపీఎంకు సపోర్ట్ చేస్తుంది కాబట్టి…

Ads

ఈ నటేశన్ ఆమధ్య శబరిమల కర్మ సమితి మీద విమర్శలకు దిగాడు… అది అన్ని హిందూ వర్గాలకు ప్రాతినిధ్యంలా లేదు అని ఆరోపించాడు… అప్పట్లో సీపీఎం వాల్ ఆఫ్ వుమన్ నిర్వహించింది కదా… దానికి కూడా ఈ నటేశన్ బలమైన మద్దతునిచ్చాడు… అప్పుడే అయిపోలేదండీ… ఇంకా ఉంది… ఆమధ్య ఇదే తుషార్‌ను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో అరెస్టు చేశారు… కారణం, 19 కోట్ల చెక్ బౌన్స్ కేసు…

అజ్మన్‌లో అరెస్టు చేస్తే హుటాహుటిన కేరళ ప్రభుత్వం రంగంలోకి దిగింది…  ‘నా కొడుకును అక్రమంగా, అన్యాయంగా ట్రాప్ చేసి, అరెస్టు చేశారు’ అని నటేశన్ లబోదిబోమన్నాడు… అసలే బలమైన ఈళవ కమ్యూనిటీ, పైగా హిందూ ఇష్యూస్‌లో నటేశన్ సహకరిస్తుంటాడు… ఇంకేముంది..? కేరళ సీఎం పినరై విజయన్ రంగంలోకి దిగాడు… విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్‌కు లేఖ రాశాడు… కాస్త నువ్వు కలగజేసుకుని విడిపించు అన్నాడు… జైలులో తుషార్ ఆరోగ్యం బాగాలేదు, కాస్త వ్యక్తిగతంగా నువ్వు శ్రద్ధ తీసుకోవాలి’’ అని కోరాడు… 

ఇవన్నీ మలయాళ మీడియాలో వచ్చినవే… దాపరికాలు లేవు, తెర వెనుక యవ్వారాలు కూడా కావు… బీజేపీ దొంగ అని కేసీయార్ పదే పదే ఆరోపించే ఈ తుషార్ అసలు కథ ఇదీ… ఇలాంటి వ్యక్తి చెబితే సంతోష్ వింటాడట, సంతోష్ చెబితే అమిత్ షా వింటాడట, అమిత్ షా చెబితే మోడీ వింటాడట… డబ్బు మూటలు కట్టుకట్టుకుని ఎమ్మెల్యేల కొనుగోళ్లకు మార్కెట్‌కు బయల్దేరతారట…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఒకే గది… ఒకే రోజు… కథ అక్కడక్కడే తిరిగే ‘షో టైమ్’… రక్తికట్టింది…
  • ఐదు రోజుల టెస్టు మ్యాచ్ 3 BHK… ప్రేక్షకులకు కావల్సింది T20 ….
  • వావ్, మళ్లీ కేవీపీ కనిపించాడు… అద్సరే గానీ సర్కారు గౌరవానికి రోశయ్య అర్హుడే…
  • భార్యా రూపవతీ శత్రుః….. కాదు, కాదు… భర్తా రూపవాన్ శత్రుః…
  • అయ్యో, తమ్ముడూ… ఎమోషన్, యాక్షన్ రెండూ ‘లయ’తప్పాయి..!!
  • Walk Of Fame Star… ఈ అంతర్జాతీయ గౌరవాన్ని దీపిక ‘కొనుక్కుందా..?!
  • ఓహో, నువ్వు సినిమా హీరోయిన్‌వా..? నేనెప్పుడూ నిన్ను చూడలేదమ్మా..!!
  • సరిగ్గా కుదరాలే గానీ… బేజా ఫ్రై టేస్టు… ఆరోగ్యానికి బెస్టు… ఇప్పుడిదే ట్రెండు…
  • రెండు శత్రు దేశాల్లోనూ ఒకడే జాతీయ హీరో… ఇంట్రస్టింగ్…
  • ఎస్వీరంగారావు… మెగా ఆర్టిస్టే కాదు… మెగాఫోన్ పట్టాడు, పైసలూ పెట్టాడు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions