Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అమ్మ కడుపు కూడా ప్రదర్శన సరుకేనా…? ఇక్కడా ఆ హాట్‌దనమేనా..?!

November 6, 2022 by M S R

ఆధునికత అంటే… అడ్డగోలుగా ఉండటమా..? బిపాసా బసు తాజా ఫోటోలు చూస్తే ఈ డౌటే వస్తుంది… ఒకప్పటి హాట్ హీరోయిన్ కదా, చివరకు బిడ్డ పెరుగుతున్న కడుపును కూడా హాట్ సరుకును చేసింది… కొందరు ఆహా ఓహో అని మెచ్చుకోవచ్చుగాక… కానీ దిగజారుడుతనమే… పలు దశల్లో అమ్మతనాన్ని కూడా ప్రదర్శనకు పెట్టడమే…

బేబీ బంప్ ఫోటోలు ఈమధ్య ట్రెండ్… మరీ సెలబ్రిటీలు అయితే అదొక తప్పనిసరి తంతులా… వదిలేస్తే ఏదో పాపం చేసినట్టుగా భావిస్తున్నారు… అదీ కడుపు మొత్తం కనిపించేలా ఫోటో షూట్లు… ఏమిటి దీని పరమార్థం అనడక్కండి… దీన్ని పైత్యం అంటారు తెలుగులో…

ఏమాటకామాట… మనం ఎడ్డిపిల్ల అని ప్రేమగా తిట్టేస్తుంటాం గానీ ఆలియా భట్ చాలా నయం… ఎక్కడా వెగటు ఫోటోలు లేవు… కడుపుతోనే బ్రహ్మాస్త్ర ప్రమోషన్ వర్క్ కోసం ఊరూరూ తిరిగింది… కడుపు చూపిస్తూ, ఆ పేరిట దేహాన్ని ఎక్స్‌పోజ్ చేస్తూ ఒక్క ఫోటో తీయించలేదు… కొన్ని ఫోటోలు కనిపిస్తాయి గానీ పద్ధతిగానే ఉంటాయి…

Ads

ఈమె చూడండి… బిపాసా బసు… అమ్మతనాన్ని ఆస్వాదిస్తున్నట్టు లేదు… ఇదెందుకు అమ్మకపు సరుకు కావొద్దు అన్నట్టుగా ఉంది… ఎక్స్‌పోజ్ చేస్తూ సగం బరిబాతల కనిపిస్తోంది… చివరకు ఇక్కడా హాట్‌దనమేనా..? ‘‘ఎల్లవేళలా మిమ్మల్ని మీరు ప్రేమించుకొండి, మీరు నివసించే శరీరాన్ని ప్రేమించండి’’ అని ఓ కొటేషన్‌తో షేర్ చేసింది ఈ ఫోటోలను…

bipasa

మిమ్మల్ని మీరు ప్రేమించుకొండి అన్నంతవరకూ బాగానే ఉంది… కానీ మీరు నివసించే మీ శరీరాన్ని ప్రేమించండి అంటే ఏమిటో ఆ ఎడ్డి మొహానికే తెలియాలి… సహజంగానే ఇతర సెలబ్రిటీలు ‘అబ్బో సూపర్ బిపాసా, ఫోటో షూట్ అదరగొట్టావు’ అంటూ అభినందనలు చెబితే… కొందరు ఫ్యాన్స్ కూడా చప్పట్లు కొట్టారు… కానీ చాలామంది నెటిజనులు మాత్రం ఛీకొట్టారు…

ఈ చెత్త ట్రెండ్స్ ఇక్కడితే ఆగుతాయా..? ఇదీ ప్రశ్న… నిజానికి దిష్టి తగలవద్దని గర్భిణుల కడుపుల్ని బయటికి కనిపించనివ్వరు… చివరకు పాలిచ్చేటప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకుంటారు… అడవుల్లో ఉండే అమ్మల దగ్గర నుంచి, మన పల్లెల్లో తల్లుల దాకా…. అసంకల్పితంగా దేహాన్ని ‘‘దాచుకోవడం’’ అలవాటు… మరి వీళ్లు..?! నవ్వొచ్చేది ఏమిటంటే… ఇలాంటి ఫోటో షూట్లతో దిష్టి తగలదట గానీ, ఇతరత్రా ఏ దిష్టీ తగలకుండా మాత్రం కాలికి ఆ బ్లాక్ థ్రెడ్ మాత్రం కట్టుకుంటారుట… ఏం మనిషో…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రెండు శత్రు దేశాల్లోనూ ఒకడే జాతీయ హీరో… ఇంట్రస్టింగ్…
  • ఎస్వీరంగారావు… మెగా ఆర్టిస్టే కాదు… మెగాఫోన్ పట్టాడు, పైసలూ పెట్టాడు…
  • వావ్… రామాయణ్ గ్రాఫిక్ గ్లింప్స్… సింపుల్, జస్ట్, ఓ చిన్న శాంపిల్…
  • దగ్గరలోనే మరో రెండు ఆదిశక్తి పీఠాలు… ఓ విశిష్ట పరిచయం…
  • అంతటి చిరంజీవే మరణిస్తే… తెలుగు ప్రేక్షకులు మెచ్చుతారా..?
  • కామాఖ్యలో కనిపించిన ఓ విశిష్టమైన తంతు… నొప్పి మార్పిడి…
  • స్టార్ల చిన్ననాటి ముచ్చట్లు… జగపతిబాబు టాక్ షో ఆసక్తికరం…
  • సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచన కరెక్ట్… మన స్కూలింగ్ విధానం మారాలి…
  • వాము మంచిదే కానీ జాగ్రత్త, రెచ్చిపోకండి… మసాలా దినుసుల్లో మహారాణి…
  • సీతారామశాస్త్రి రాసిన చరణాల్ని కూడా… బేసబబు అని బాలు మార్చేశాడు..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions