ఇంత దుర్మార్గమైన ఫోటో వార్తను ఈమధ్యకాలంలో చూళ్లేదు… జగన్ వ్యతిరేక క్యాంపెయిన్‌లో, చంద్రబాబుకు పనికొచ్చే ప్రచారాల్లో ఈనాడు, ఆంధ్రజ్యోతి అన్నిరకాల ప్రమాణాల్ని, బట్టలనూ విడిచేసుకుని బజారులో నర్తిస్తాయనేది అందరికీ తెలిసిందే… ఈ విషయంలో రామోజీరావు ఓ లక్ష డాక్టరేట్లు, రాధాకృష్ణకు లక్షన్నర డాక్టరేట్లను ఇచ్చేయొచ్చు… కనీసం వేమన యూనివర్శిటీ డాక్టరేట్లయినా సరే… అవును, అవును… ఆ వేమన యూనివర్శిటీ గురించే చెప్పుకునేది…
పొద్దునే రెండు పత్రికల్లోనూ ఒకే తరహా వార్త వచ్చింది ఆ యూనివర్శిటీ మాద… ఫోటోల్ని, కంటెంటుకు తెలుగుదేశం ఆఫీసు పంపించినట్టుంది… యథాతథంగా కుమ్మేశారు…. ఇంతకుముందు అక్కడున్న వేమన విగ్రహాన్ని తీసేసి వైఎస్ విగ్రహాన్ని పెట్టారని ఆ వార్త… నిజమే… గతంలో వేమన విగ్రహం ఉన్న ప్లేసు ఫైల్ ఫోటో వేసి… ఇప్పుడు అక్కడ వైఎస్ విగ్రహం ఉన్న ప్లేసు ఫోటో కూడా పెట్టేసరికి పాఠకులకు నిజమే అనిపించింది… ఎందుకంటే..?
- మొన్నమొన్నటిదాకా ఎన్టీయార్ పేరు తీసేసి, ఆరోగ్య వర్శిటీకి వైఎస్ పేరు పెట్టిన వివాదం నడిచింది… అది దిక్కుమాలిన నిర్ణయమే… సమర్థించుకోవడానికి నానాతిప్పలు పడింది వైసీపీ, ప్రభుత్వం…
- జెండాల పిచ్చి, అన్నింటికీ ఆ మూడురంగులు వేసే పైత్యం, ప్రతి పథకానికీ వైఎస్ పేరు పెట్టే వైపరీత్యం చూస్తున్నారు కాబట్టి… బహుశా ఇక్కడ నిజంగానే వేమన విగ్రహం పీకిపారేశారేమో అనుకున్నారు పాఠకులు… జరుగుతున్నదంతా ఇదే కదా…
- ఎడాపెడా సలహాదార్లు, పదవులు, వృథా వ్యయం, విపరీతంగా అప్పులు, ఉపయుక్త ప్రాజెక్టులపై నిర్లక్ష్యానికి తోడు ఈ పేర్లు, రంగుల పిచ్చి ఏమిటో ఎవరికీ అర్థం కాదు…
ఈ ఫోటోల్ని, ఈ వార్తల్ని చూశాక సహజంగానే సోషల్ మీడియా బాగా నెగెటివ్‌గా రియాక్టయింది… తెలుగుదేశం ఫ్యాన్స్ అయితే రెచ్చిపోయారు… తరువాత కొందరు వైసీపీ అభిమానులు తేరుకుని, వేరే సమాచారాన్ని పోస్ట్ చేయడం ప్రారంభమైంది… అప్పుడు గానీ ఆ రెండు పత్రికల పాతాళ పాత్రికేయం ఏమిటో బయటపడలేదు… నిజానికి ఇక్కడ వేమనకు అన్యాయం ఏమీ జరగలేదు, అగౌరవం కూడా ఏమీలేదు, పైగా సరైన ప్రయారిటీ ఇచ్చారు… కానీ యెల్లో పైత్యానికి ఆ వేమన కూడా షాక్ తిని ఉంటాడు… ముందే తెలిస్తే, ఈ దిక్కుమాలినతనం మీదే ఓ శతకం రాసేవాడిని కదా అనుకుంటున్నాడేమో…. ఒక్కసారి ఆ వార్తల్ని చూడండి…
Ads
నిజానికి జరిగిందేమిటి…? సోషల్ మీడియాలో కొందరు సర్క్యులేట్ చేస్తున్న సమాచారం ప్రకారం… ‘‘రెండు లైన్లుగా ఉన్న ఎంట్రన్స్ రోడ్డును నాలుగు లైన్లుగా మార్చారు… ఒక యూనివర్సిటీకి అనుబంధ పీజీ సెంటర్ గా ఉన్న సంస్థ ఎంట్రన్స్ గేట్ ను ఆ యూనివర్సిటీ కూడా అసూయ పడేంతలా అభివృద్ధి చేశారు… అక్కడొక విగ్రహం కావాల్సి వచ్చింది… వేమన సర్కిల్ లో ఉన్న విగ్రహాన్ని ఎంట్రన్స్ ముందుకు తీసుకొద్దామనుకున్నారు… వేమన సర్కిల్ ఖాళీగా బోసి పోతుంది కాబట్టి అక్కడొక విగ్రహం పెట్టాలి… కోట్ల కొద్దీ నిధులతో యోగి వేమన అనే యూనివర్సిటీకి ప్రాణం పోసిన వ్యక్తి సర్ సీవీ రామన్ బ్లాక్ ఎక్కడో దగ్గర మూలన నిలబడి ఉన్నాడు… ఆయన విగ్రహాన్ని తెచ్చి ఇక్కడ పెట్టారు…’’ ఇదీ ఒక పోస్టులో కీలకభాగం… ఇదీ ఆ ఫోటో…
‘‘అరె, ఆయన వేమారెడ్డే కదా… ఆయన్ని కూడా పీకిపారేశారా..?’’ అనే వ్యంగ్యం కూడా… (నిజానికి ఈ రెండు వార్తలు టెక్నికల్ గా అబద్ధాలు కావు… వేమన విగ్రహం తీసేసిన చోట వైఎస్ విగ్రహం పెట్టారు అనేది నిజం… అక్కడి వరకు కరెక్ట్… కానీ అసలు నిజాన్ని దాచేసి, కేవలం వేమన విగ్రహం పాత ప్లేసులో లేదనే అంశాన్ని నెెగెటివ్ టోన్‌లో పబ్లిష్ చేయడం అతి పెద్ద దరిద్రం… ఈ పిచ్చి స్ట్రాటజీలు దేనికి..? చేతనైతే జగన్ పాలన విధానాల లోపాలపై నేరుగానే దాడి చేయొచ్చు కదా…)
ఉదయం నుంచే ఈ నెగెటివ్ ప్రచారం జనంలోకి విపరీతంగా వెళ్లిపోతుంటే… ఆ ప్రధానద్వారం ఫీడ్ తెప్పించి ఎందుకు ఓ చిన్న వార్తను ప్రసారం చేయలేకపోయింది సాక్షి టీవీ… మరి తన సొంత ప్రయోజనాలకే పనికిరాకపోతే, ఇక ఎందుకు పెట్టుకున్నట్టు జగన్ ఆ టీవీని..? అలాగే ఇలాంటి దుష్ప్పచారాన్ని వెంటనే కౌంటర్ చేయగల సౌలభ్యం ఉన్న సాక్షి సైటు ఎందుకు స్పందించలేదు…
వాటిల్లోనే ఏమీ రావడం లేదు కాబట్టి… బహుశా ఆ రెండు పత్రికలూ రాసింది కరెక్టేనేమో అనే సందిగ్ధంలో పడిపోయారు చాలామంది… జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయాక ఇప్పుడు ఎన్ని ఆకులు కట్టుకున్నా, కాలిన చేతులు వెంటనే కోలుకోవు… యెల్లో పత్రికల స్ట్రాటజీలు, దాడుల ముందు సాక్షి వెలవెలబోతూ దిక్కులు చూస్తోంది… (ఈ కథనం రాసే సమయానికి ఉన్న పరిస్థితి… తరువాత ఏమైనా రాశాయేమో తెలియదు…
లేదా రెండు రోజులు ఆగి, సాక్షి పత్రిక ఎడిట్ పేజీలో ఏదో మొక్కుబడి కౌంటర్ రాసేస్తే సరిపోతుందిలే అనుకున్నారేమో…) ఆ వర్సిటీకి PRO లేడా…? VC కి ఇంకా ఆ సోయి లేనట్టుంది..!! (అయ్యా, జగనయ్యా… నువ్వు పెట్టుకునే అసంఖ్యాక సలహాదారులకూ తమ సోషల్ మీడియా వాల్స్‌పై చిన్న చిన్న కౌంటర్లు కూడా రాసుకునే కృతజ్ఞత వంటి ఫీలింగ్ లేదా..? ఎలాగూ చేయడానికి పనేమీ లేదు కదా….)
Share this Article