కొన్ని వార్తలు చదువుతుంటే… పాఠకులతో షేర్ చేసుకుంటే హృద్యంగా ఉంటాయి… మన ఉన్నత పదవుల్లో ఉన్నవాళ్లు చూపించే ‘అతి వేషాలు’, ప్రత్యేకించి వాళ్లు పొందే ప్రొటోకాల్ మర్యాదలు… చివరకు దేవుళ్ల దగ్గరకు వెళ్లినప్పుడు సైతం తామే ఉన్నతులమనే పిచ్చి ధోరణులు వాళ్ల పట్ల ద్వేషాన్ని తప్ప అభిమానాన్ని పెంచవు, పెంచలేవు… మన తిరుమలకు ఏ వీవీఐపీ వచ్చినా సరే, పత్రికల్లో వార్తలు, ఫోటోలు… మహాద్వారం గుండా ప్రవేశాలు, ప్రత్యేక ఆశీర్వాదాలు, ప్రత్యేక వసతులు, ప్రధానార్చకులు సహా అందరి పొర్లుదండాలు…
ఈ వార్త చదవండి… రాష్ట్రపతి ద్రౌపది ముర్ము… ఆమెకు రాష్ట్రపతి అభ్యర్థిత్వం ఖరారు కాగానే ఆమె సింపుల్‌గా వెళ్లి, ఓ స్థానిక గుడిలో చీపురు పట్టుకుని, కాసేపు ఊడ్చి, దండం పెట్టుకుని వెళ్లిపోయింది… అంతే… అదీ దేవుడికి ఆమె చెల్లించిన ప్రత్యేక పూజ..!! ఈ దేశ ప్రథమ పౌరురాలు అయినా సరే, డౌన్ టు ఎర్త్… ప్రత్యేకించి దేవుళ్ల దగ్గర ఏ అతిశయం, అతితనం ప్రదర్శించదు… ఉన్నత పదవుల్లో ఉండేవారి నడత, సంస్కారం, మాటతీరు, ప్రవర్తన బాగుంటే అవి పిల్లలకు కూడా ఆదర్శంగా ఉంటాయి… అది జాతికి కూడా మంచిది…
నిన్న రాష్ట్రపతి హోదాలో ఒడిశాకు వచ్చింది… గవర్నర్ గణేషి లాల్, చీఫ్ మినిస్టర్ నవీన్ పట్నాయక్ స్వయంగా వెళ్లి ఎయిర్ పోర్టు వద్ద స్వాగతం పలికారు… గౌరవవందనం సరేసరి… ఈరోజు ఘనంగా పౌరసన్మానం జరిపించారు…
Ads
In a rare gesture, President Droupadi Murmu walked about two kilometers to seek the blessings of Lord Jagannath at Puri. Devotees greeted the President on her way to the temple. pic.twitter.com/b6C8IQQZnr
— President of India (@rashtrapatibhvn) November 10, 2022
స్వతహాగానే ఆమె భక్తిపరురాలు… పూరి జగన్నాథుడి గుడికి వెళ్లకుండా ఒడిశా నుంచి తిరిగి వెళ్లదు కదా… పైగా ఆమె స్వరాష్ట్రం… బయల్దేరింది… ముందే రాష్ట్రపతిభవన్ సిబ్బంది గుడి అధికారులకు చెప్పిపెట్టారు కాబట్టి అన్ని ఏర్పాట్లు జరిగాయి… కానీ ఆమె రెండు కిలోమీటర్ల దూరంలోనే తన వాహనాల్ని ఆపింది… దిగింది… సెక్యూరిటీ, ఇతర స్టాఫ్ షాక్…
ఇక్కడి నుంచి నేను గుడి వరకూ నడిచి వెళ్తాను అని చెప్పి చకచకా నడవడం ప్రారంభించింది… ఇతర రాష్ట్రపతులతో పోలిస్తే 64 ఏళ్లు యంగ్ ఏజే కదా… ఆమె వేగంగా నడుస్తుంటే సెక్యూరిటీ వెంటనే సర్దుకుని ఇరువైపులా ఆమెను కవర్ చేస్తూ తిప్పలు పడ్డారు… రోడ్డు మీద ఓ మామూలు మహిళలా నడుచుకుంటూ వస్తుంటే… ఆ రెండు కిలోమీటర్ల మేరా… రోడ్డుకు ఇరువైపులా జనం, భక్తగణం, పిల్లలు ఆశ్చర్యంగా చూస్తూ, అభినందనగా చేతులు ఊపుతూ… జైజగన్నాథ్ అని నినాదాలు చేస్తూ అదొక కొత్తరకం హడావుడి…
మన ఓవరాక్షన్ రాష్ట్రపతులు అయి ఉంటే… ఏకంగా ప్రధాన ద్వారం వరకూ వాహనాన్ని తీసుకుని వెళ్లడానికి అనుమతించేవాళ్లేమో… ఈ రాష్ట్రపతి గుడ్ జెశ్చర్… అందుకే ముందే నేను చెప్పింది, కొన్ని వార్తలు రాస్తుంటే కూడా మనసుకు తృప్తిగా ఉంటుంది… తిరుమల వీవీఐపీ సందర్శన వార్తలు, ప్రత్యేకించి పత్రికల్లో వచ్చే ఫోటోవార్తలు చదువుతున్నప్పుడల్లా ఈ ద్రౌపది ముర్ము వార్తే గుర్తుకురావాలి అన్నంతగా…!!
Share this Article