నవంబరు 4 నుంచి ఓటీటీలో ప్రసారం చేసేస్తాం… మొదట్లో కాంతార నిర్మాతలు హొంబళె ఫిలిమ్స్ ప్రకటన… చేశారు కదా, వాయిదా వేసుకున్నారు… ఇంకా థియేటర్లలో డబ్బులొస్తున్నాయి కదా, ఎలాగూ అమెజాన్ వాడు కొన్నాడు కదా, నాలుగురోజులు ఆగుతాడులే అనుకున్నారు… నవంబరు 18 నుంచి ఓటీటీ ప్రసారం అనేశారు… నిజం ఏమిటంటే… నవంబరు చివరి దాకా ఆపుతారు, చూడండి…
హొంబళె వాళ్లకు కేజీఎఫ్, కేజీఎఫ్-2 తరువాత కాంతార అనుకోని సక్సెస్… పైగా కేవలం 15 కోట్లు పెడితే ఇప్పటికే 350 కోట్ల వసూళ్లు దాటాయి… లాభశాతం లెక్కేసుకొండి… అదీ వాళ్ల ఆనందం… వస్తున్న డబ్బు ఇంకా ఊరిస్తోంది… స్టిల్ థియేటర్లలో స్టడీగా నడుస్తోంది… పైగా ప్రేక్షకుల్లో కూడా ఇది థియేటర్లలో మాత్రమే చూడదగ్గ సినిమా అనే ఫీలింగ్ సాగుతోంది…
42 రోజులయినా ప్రస్తుతం బెంగుళూరు సిటీలోనే 307 షోలు పడుతున్నాయి రోజూ… తెలుగులో స్టడీగా ఉంది… ఇక హిందీలో అయితే స్ట్రెయిట్ హిందీ సినిమాలాగే నడుస్తోంది… ఎప్పుడో పుష్ప వసూళ్లను దాటేసింది… ఇప్పటికి సినిమా ఇండియాలోనే 277 కోట్ల నెట్ షేర్ కొట్టేసింది… అంటే దాదాపు 327 కోట్ల గ్రాస్… మిగతా ప్రాంతాలు కలిసి 350 కోట్లు క్రాస్ చేసింది… సో, నిర్మాతల కన్ను ఇప్పుడు 400 మార్కు మీద పడింది… ఒక్కసారి అది దాటితే ఇక ఓటీటీలో ప్రసారానికి వోకే చెబుదాం అనేది వాళ్ల ఆలోచన…
Ads
తప్పులేదు, అనుకున్నదానికన్నా వందల శాతం లాభం… వస్తున్న వరదను ఎందుకు అడ్డుకోవాలి… ఎలాగూ ఓటీటీ వాడి ఇచ్చే రేటు ఫిక్స్‌డే కదా… అమెజాన్ కూడా సత్వరం ప్రసారానికి ఇచ్చేయాలని త్వరపెట్టడం లేదు… లేటయినా సరే మంచి వ్యూస్ వస్తాయని ఆ ప్లాట్‌ఫారం ఆశిస్తున్నట్టుంది… కానీ అగ్రిమెంట్ల మీద ముందే రాసుకుంటారు ఎన్నిరోజుల్లో ప్రసారానికి ఇచ్చేయాలనే అంశాన్ని… ఐనా అమెజాన్ నుంచి ప్రెజర్ లేకపోవడం విశేషమే… మొదట కేవలం కన్నడకే పరిమితం అనుకున్నారు ఈ సినిమాను, కానీ స్పందన బాగుండేసరికి పాన్ ఇండియా రిలీజ్ అనుకున్నారు… ఎలాగూ కేజీఎఫ్-2తో మంచి మార్కెట్ నెట్‌వర్క్ కుదిరింది…
తెలుగు, హిందీ భాషల్లో చకచకా డబ్బింగ్ పూర్తి చేసి, మార్కెట్‌కు ఇచ్చేసి, తాపీగా తమిళం, మలయాళం కూడా డబ్ చేసేశారు… ఆ రెండు భాషల్లో కన్నడ డబ్బింగ్ సినిమాలకు ఆదరణ తక్కువే… ట్రేడ్ నిపుణులను ఆశ్చర్యపరుస్తున్నది ఏమిటీ అంటే..? హిందీ ప్రేక్షకులకు ఈ సినిమా విపరీతంగా నచ్చేయడం… కాస్త కన్నడ వాసన అధికంగానే ఉన్నా సరే, నార్తరన్ ఇండియా బలంగా ఓన్ చేసుకుంటోంది ఎందుకో మరి…
ఒక డబ్బింగ్ కన్నడ సినిమా హిందీ మార్కెట్‌లో 26 రోజుల్లోనే 67 కోట్లు కలెక్ట్ చేయడం మామూలు విషయమేమీ కాదు… ఈ సినిమా ప్రస్తుతం అక్షయ్‌కుమార్ రామసేతు, అజయ్ దేవగణ్ థాంక్ గాడ్, కత్రినా కైఫ్ ఫోన్ భూత్, ఆయుష్మాన్ ఖురానా డాక్టర్ జి తదితర సినిమాలకు దీటుగా థియేటర్లలో ఆడుతోంది… మిలీ, డబుల్ ఎక్స్ఎల్ సినిమాలను మించి… సో, ఈ లెక్కలన్నీ వేసుకున్న హొంబళె ఫిలిమ్స్ 400 కోట్ల మార్కు దాటుతామనే విశ్వాసంతో ఉన్నారు… వీకెండ్స్‌లో తెలుగులో కూడా బాగానే కలెక్ట్ చేస్తోంది ఇంకా…!! కాంతార క్లైమాక్స్‌లాగే ఈ సినిమా లాభాలు కూడా నిర్మాతలకు అనూహ్యమైన జోష్ నింపుతున్నాయి…
Share this Article