గుడ్… రష్మిక మంధాన రెండుమూడు రోజుల నుంచీ ఉడికిపోతున్న సంగతి తెలుసు కదా… తనను ట్రోలర్స్ ఆడుకుంటున్నారు… ‘‘ఛిఛీ, ఈ ట్రోలర్లు, నెటిజెన్స్ నన్ను నా కెరీర్ మొదటి నుంచీ వదలడం లేదు, విషం చిమ్ముతున్నారు అకారణంగా… ఎందుకో మరి..? నాకు సంబంధం లేని వివాదాల్లోకి లాగుతున్నారు… నేను అనని మాటల్ని అన్నట్టు రాసేస్తున్నారు… చివరకు నేనేదో కాంటెక్స్ట్‌లో చెబితే వాటికీ వక్రబాష్యాలు చెబుతూ దాడి చేస్తున్నారు… పట్టించుకోలేదు, మంచి విమర్శ అయితే సరే, నాకూ మంచిదే, కానీ మరీ ఈ దాడి దేనికి…’’ అంటూ ఇన్‌స్టాలో బాగా సుదీర్ఘంగా బాధపడిన తీరు మనమూ చెప్పుకున్నాం కదా…
‘‘కాంతార సినిమా’’ ఇంకా చూడలేదు అని నిజాయితీగా చెప్పుకున్నందుకు ఇప్పుడు ట్రోలింగ్ తీవ్రత బాగా పెరిగింది… ఇదీ నేపథ్యం… అందులో ఆమె తప్పేమీ లేదు… ఒక సినిమాను చూడాలా వద్దా అనేది తన ఇష్టం కదా… కానీ ట్రోలర్లు అలా లైట్ తీసుకోలేదు… నీకు చాన్స్ ఇచ్చి, నీకు లైఫ్ ఇచ్చిన దర్శకుడికి మంచి పేరు వస్తే సహించలేవా..? నీ రూట్స్ మరిచిపోయావా..? అని ఆడుకుంటున్నారు… నిజానికి రష్మిక అంటే కన్నడిగులకు ఎందుకు అంత కోపం…? ఇలాంటివి కొన్ని…
ఉదాహరణకు… ఆమెకు పేరుకు కన్నడిగ… కానీ కన్నడమే సరిగ్గా రాదు తనకు… కన్నడంలో తడబాటు లేకుండా ప్రసంగించలేదు… కన్నడ వర్తమాన విశేషాలు కూడా ఆమెకు పట్టవు… అర్థం కావు… ఒకవైపు తమిళుల్లాగే కన్నడిగుల్లో కూడా భాష పట్ల అభిమానం బాగా పెరిగిపోతున్న తీరు కూడా ఆమె గమనించడం లేదు… ఓసారి పద్మశ్రీ వచ్చిన సాలుమురద తిమ్మక్కను సన్మానించే ఓ ఫంక్షన్ జరిగింది… (ఆమె వృక్షప్రేమికురాలు, కన్నడిగ..)… ఆమె మాటల్ని కాస్త అర్థమయ్యేలా సరళంగా, వివరంగా చెప్పాలని నిర్వాహకులు రష్మికను పిలిచారు… ఆమెకు అదీ చేతకాలేదు… పైగా తిమ్మక్క గురించే ఆమెకు తెలియదు… ఏమీ చెప్పలేక తెల్లమొహం వేసింది…
Ads
కానీ తమిళనటుడు వివేక్ (తను కూడా వృక్షప్రేమికుడు) మైకు అందుకుని తిమ్మక్క సాధించిన విజయాలను వరుసగా ఏకరువు పెట్టి, ఆమె పాదాల మీద తలపెట్టాడు… ఆశీస్సులు తీసుకున్నాడు… రష్మిక చేష్టలుడిగి చూస్తుండిపోయింది… ఇలాంటివి కొన్ని ఆమె పట్ల కన్నడిగుల్లోనే ‘యాంటీ-కన్నడ’ అన్నంత ముద్ర వేశాయి,,, పైగా కన్నడం వదిలి ఇతర భాషల సినిమాల పట్ల అనురక్తి పెంచుకుని, వాటికే ప్రాధాన్యం ఇస్తోందని ఇంకో విమర్శ… ఈమధ్య ‘ప్రయారిటీ టు శాండల్‌వుడ్ ఓన్లీ’ అనేంత భాషాభిమానం పెరిగిపోయింది ఇండస్ట్రీలో… అది అకారణ ద్వేషం… హేమమాలిని, రేఖ, జయప్రద, శ్రీదేవి… విద్యాబాలన్, టబు, ఇలియానా, ఐశ్వర్యారాయ్ సహా… ఎందరు హిందీకి వెళ్లి అక్కడే స్థిరపడ్డారు మరి…
కానీ రష్మిక కన్నడంకన్నా ఇతర భాషలకే ప్రయారిటీ ఇస్తోంది… ప్రత్యేకించి తెలుగు, ఇప్పుడిప్పుడే హిందీ, తమిళం కూడా… పుష్ప-2, మిషన్ మజ్ను, యానిమల్, వారిసు… ఇలా… అదీ కన్నడిగులకు అసహనమే… సో, ట్రోలింగ్ తీవ్రతకు మనం సమర్థించకపోయినా సరే, రీజన్స్ అయితే ఉన్నాయి… కాకపోతే ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా ఎక్కువ…సోషల్ మీడియాలో కూడా ఫాలోయర్స్ ఎక్కువే… ఈ సంఖ్య ఇంకా పెరుగుతోంది… వేల సంఖ్యలో అభిమానుల నుంచి తనకు సమర్థన, మెసేజులు వస్తుండటంతో రిలీఫ్ ఫీలవుతోంది… అందుకే మరో ఇన్‌స్టా నోట్ పెట్టేసింది అర్జెంటుగా…
‘‘నాకు ఆనందంగా ఉంది, థాంక్యూ’’ అని నోట్ పెట్టుకుని, తన ప్రేమను, అభిమానాన్ని వ్యక్తీకరించేలా వేళ్లతో ఓ ముద్రను ప్రదర్శించింది… ఏమిటో మరి, ఈమధ్య చాలామంది వాడేస్తున్నారు ఈ సంకేతాన్ని… మొన్నామధ్య తెలుగు బిగ్‌బాస్‌లో ఇనయ, హౌజు నుంచి వెళ్లిపోయిన సూర్యకు కూడా ఇలాగే చూపించింది… సూర్య నాగార్జున ఉన్న వేదిక నుంచి తనూ అదే చూపించాడు… ఈ కొత్త సింబల్ ఏమిట్రోయ్ అని నాగార్జున తలపట్టుకుని ‘‘నేను కొత్త విషయాల్ని అప్‌డేట్ చేసుకోవాలి’’ అన్నాడు వేదికపైనే… హహహ… మనం చెప్పుకునేది ఇంకెటో వెళ్తోంది కదా… సెలవు…!
Share this Article