ఎమ్మెల్యే రాజాసింగ్ మీద పీడియాక్ట్ దాకా దారి తీసిన వివాదాల్లో స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారూఖీ ప్రదర్శన పట్ల బెదిరింపు… తనే కాదు, బీజేపీ కూడా బలంగానే వ్యతిరేకించింది… ఎందుకు..? ఈ దేశాన్ని, ఈ సంస్కృతిని బ్యాడ్ లైట్‌లో ఫోకస్ చేస్తూ, ప్రత్యేకించి యాంటీ హిందూ ధోరణులను సదరు మునావర్ ఎక్కువగా ప్రదర్శిస్తూ దాన్నే హాస్యం అనుకోమంటాడు కాబట్టి… గతంలో కొన్ని రాష్ట్రాలు తన ప్రదర్శనలను అందుకే బ్యాన్ చేశాయి… కానీ తెలంగాణ వేరు కదా…
కేసీయార్ హఠాత్తుగా యాంటీ-మోడీ అయిపోయాడు కదా… గోకుతున్నాడు కదా… గోకుతూనే ఉంటాను అని కూడా చెప్పాడు కదా… జాతీయ రాజకీయాలకు బాట కూడా వేసుకున్నాడు కదా… పైగా యాంటీ -మోడీ ధోరణిని యాంటీ- హిందూ పోకడలోకి మార్చుకుంటూ, మజ్లిసే ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నదేమో అన్నంత స్నేహ విధేయంగా కూడా వ్యవహరిస్తున్నాడు కదా… మునావర్‌ను పిలిచి, ప్రత్యేకంగా హైదరాబాదులో తన షో పెట్టించి, వేల మంది పోలీసులతో భద్రతను కల్పించాడు కేసీయార్… సదరు నాసిరకం షో ఉద్దేశాలు మనకేల… బీజేపీ వ్యతిరేకించింది, మనం సమర్థించాలి… అంతే… మరి కేసీయార్ అలాగే మారిపోయాడుగా…
సారూ, మీకు మళ్లీ ఓ మంచి చాన్స్ వచ్చేసినట్టే… హిందూ జనజాగృతి సమితి వంటి హిందూ సంస్థలు బలంగా ఫిర్యాదు చేయడంతో కర్నాటక వీర్‌దాస్ అనే మరో స్టాండప్ కమెడియన్ షోకు అనుమతి రద్దు చేసేసింది… బీజేపీ ప్రభుత్వమే కాబట్టి సరేనంది… హిందూ మనోభావాాల్ని గాయపరుస్తాడు, ఇండియాను కించపరిచే వ్యాఖ్యలు చేస్తుంటాడు అనేది తనపై ఫిర్యాదు… ‘‘అనుకోని పరిస్థితుల్లో షో రద్దయింది, టికెట్లు కొన్నవాళ్లకు డబ్బు వాపస్ ఇచ్చేస్తాం, మళ్లీ కలుద్దాం’’ అని సదరు దాస్ కూడా ఇన్‌స్టా పోస్టులు పెట్టాడు…
Ads
ఇప్పుడు కేన్సిలైన షో సదరు కమెడియన్ చేపట్టిన ‘పాన్-ఇండియా’ ప్రాజెక్టు… టైటిల్ వాంటెడ్… పదిన బెంగుళూరులో జరగాల్సి ఉండింది… తరువాత కోల్‌కతా, 18న చెన్నై, 24న ముంబై, 25న పూనె, 26న లూథియానా, 27న చండీగఢ్… ఇలా… ఉంది, ఉంది… హైదరాబాద్‌లో 20న జరగాల్సి ఉంది షెడ్యూల్ ప్రకారమైతే… ఎలాగూ అనుమతి అడిగే ఉంటారు… పోలీసులు ఇచ్చే ఉంటారు… ఇక కేసీయార్ కూడా మునావర్ షోకు అన్నిరకాల భద్రత కల్పించిన తరహాలోనే వీర్ దాస్‌కూ సహకరించాలని ఒకమాట చెబితే చాలు… మళ్లీ వేలమంది పోలీసులకు పని… ఎలాగూ బీజేపీ వ్యతిరేకిస్తుంది కదా… సో, కేసీయార్ సమర్థించాలి కదా, ప్రజెంట్ తన రాజకీయ సూత్రం ప్రకారం…
అశ్విన్ గిద్వానీ అనే నిర్మాత ఒకరు రీసెంటుగా ఈ కమెడియన్‌పై కేసు పెట్టాడు… తమ షో ‘ఫర్ ఇండియా’ తరహాలో ఈ కమెడియన్ ‘వాంటెడ్’ షో ఉందనీ, అందుకే కాపీ రైట్ చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవాలనేది కేసు… ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు… ఇలాాంటి వివాదాలు వీర్ దాస్‌కు కొత్తేమీ కాదు…
యాంటీ-హిందూ, యాంటీ-ఇండియా వ్యాఖ్యలతో పాపులర్ కావడానికి ప్రయత్నించే ఇలాంటి కమెడియన్లను ఎందుకు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఎంకరేజ్ చేస్తాయి..? అవి యాంటీ-బీజేపీ కాబట్టి… బీజేపీ వ్యతిరేకిస్తుంది కాబట్టి… అంతే… ఇక్కడ మన ప్రశ్న ఏమిటంటే..? ప్రతిదీ బీజేపీ కోణంలో ఎందుకు చూడాలి…? ఆఫ్టరాల్, అదీ ఓ రాజకీయ పార్టీ… అది వ్యతిరేకిస్తే మీరు సమర్థించడం దేనికి..? మీకంటూ ప్రతి అంశం మీద మీదైన స్టాండ్, మీదైన ఆలోచన ఉండదా..? ఇదెక్కడి పోకడ..?!
Share this Article