మొన్న ఓ విషయం చెప్పుకున్నాం… టూరిస్టుల్ని ఆకర్షించడంలో గోవా కమర్షియల్, కన్వెన్షనల్ టూరిజాన్ని కాశి స్పిరిట్యుయల్, మోడరన్ టూరిజం చాలా ముందుకు వెళ్లిపోయిందని..! అక్కడే ఓ మాట చెప్పుకున్నాం… గంగా నదీఆధారిత క్రూయిజ్, ఇతర వాటర్ ప్రాజెక్టులు కూడా గంగా పర్యాటకులకు ఆకర్షణీయం కాబోతున్నాయని… అందులో ముఖ్యమైనది గంగా విలాస్ క్రూయిజ్… ఇది ప్రపంచంలోనే అతి పెద్ద నదీ పర్యాటక ప్రాజెక్టు… కాశి నుంచి మొదలుపెట్టి అస్సోంలోని దిబ్రూగఢ్ దగ్గర ముగిసే 50 రోజుల, 4 వేల కిలోమీటర్ల నదీవిహారం… అదీ బంగ్లాదేశ్ మీదుగా ప్రయాణం…
చెప్పుకోవాలి… 27 నదుల్ని టచ్ చేస్తుంది… వరల్డ్ హెరిటేజ్ సైట్లుగా పేర్కొన్నవాటితో సహా మొత్తం 50 ప్రముఖ టూరిస్టు సైట్లను సందర్శించేలా చేస్తుంది… ఓ యూనియక్ రివర్ వాటర్ క్రూయిజ్… డిఫరెంట్ టూరిజం… ఇది సక్సెసయితే దేశంలోని ఇతర ప్రముఖ నదులను సంధానించే కొత్త టూరిజం క్రూయిజ్ ప్యాకేజీల గురించీ ఆలోచించబోతున్నారు… ఈ గంగా విలాస్ క్రూయిజ్ చేపట్టిన అంతార లగ్జరీ రివర్ క్రూయిజెస్‌కు చిన్న చిన్న క్రూయిజ్ ప్యాకేజీలు నడిపించేది… ఇప్పుడు ఏకంగా 4 వేల కిలోమీటర్ల పెద్ద పర్యటనను టేకప్ చేసింది…
ఇలాంటి ఇన్నొవేటివ్ టూరిజం ప్రాజెక్టుల్ని వారణాసి బేస్డ్‌గా ఆలోచిస్తున్నారు కేంద్ర టూరిజం ఉన్నతాధికారులు… అందుకే వారణాసి రాబోయే రోజుల్లో ఇంకా బెటర్ టూరిజం డెస్టినేషన్ కాబోతోంది… ఎలాగూ రొటీన్‌గా వచ్చే భక్తుల సంఖ్య కూడా పెరిగిపోతూనే ఉంది… ఇప్పుడు వారణాసి నుంచి డాకా మీదుగా దిబ్రూగఢ్ చేరే ఈ క్రూయిజులో 18 లగ్జరీ సూట్స్, ఇతర కామన్ రూమ్స్ ఉంటయ్…
Ads
అంతేకాదు, ఒక స్పా… 40 సీట్ల రెస్టారెంట్… నాయిస్ రిడక్షన్, పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్‌మెంట్ ప్రత్యేకత… క్రూయిజ్ ఎనిమిదోరోజు పాట్నా చేరుతుంది… తరువాత అక్కడి నుంచి 12 రోజుల తరువాత కోల్‌కతా చేరుతుంది… ఆ తరువాత రోజే బంగ్లాదేశ్‌లోకి ప్రవేశిస్తుంది… బంగ్లాదేశ్ పరిధిలోనే 15 రోజులు గడపాలి… గంగ- బ్రహ్మపుత్ర నదుల నడుమ రవాణా, పర్యాటకానికి తగిన ఒప్పందాలు ఆల్‌రెడీ కుదిరాయి కాబట్టి నో ప్రాబ్లం…
యునెస్కో ఆదీనంలోని సుందర్‌బన్ విహారంతోపాటు ఈ క్రూయిజ్ పర్యాటకులకు ప్రతిరోజూ ఆన్‌షోర్, ఆఫ్‌షోర్ ప్యాకేజీలు కూడా ఉంటాయి… ఇది సరేగానీ, ఇతర నదుల మీద సిమిలర్ క్రూయిజ్ సర్వీసులు లేవా అంటే… ఉన్నాయి..! కాకపోతే అవి ఇంత సుదీర్ఘపు ప్యాకేజీలు కావు… బ్రహ్మఫుత్ర రివర్ క్రూయిజ్ ఒకటి 10 నైట్ ప్యాకేజీతో నడుస్తోంది… గౌహతి నుంచి దిబ్రూగఢ్ వరకు నడుస్తుంది అది… గోవాలో కూడా మండోవి నదిపై వన్డే క్రూయిజ్ ప్యాకేజీ కూడా ఉంది… మంగుళూరు రివర్ క్రూయిజ్ ఫాల్గుణి నది బేస్డ్ ప్యాకేజీ… కాకపోతే జస్ట్, 3 గంటలే ప్రయాణం… ఇప్పుడు ఏకంగా రెండు దేశాలు, 4 వేల కిలోమీటర్లు, 50 రోజుల యాత్ర ఇది… పైగా ఎక్కువగా నేచర్, హిస్టరీ బేస్డ్ టూరిజం ప్లేసుల్ని కనెక్ట్ చేస్తుంది… ఇంట్రస్టింగు… జనవరి 10న మొదటి పర్యటన స్టార్ట్ కాబోతోంది…!!
Share this Article