చెప్పుకోవాలి… ఇలాంటి పిచ్చి పాత్రికేయం కనిపించినప్పుడల్లా చెప్పుకోవాలి… దిక్కుమాలిన తిక్క బాష్యాలతో బ్యానర్లు కొట్టేస్తుంటే తప్పకుండా చెప్పుకోవాలి… అక్షరాలను పొలిటికల్ బురదలో స్నానం చేయిస్తుంటే చెప్పుకోకుండా ఎలా ఉండాలి…? మన పవన్ కల్యాణ్‌ను పిలిచి ప్రధాని భేటీ వేశాడు… నాకన్నీ తెలుసు, మనం కలిసి పనిచేద్దాం, రోడ్ మ్యాప్ పంపిస్తా, నాదెండ్ల మనోహర్‌తో చదివించుకో, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ అని చెప్పాడు… పవన్ పడిపోయాడు…
అదే సమయంలో చంద్రబాబును కనీసం దేకలేదు… ఇంత పెద్ద స్టీరింగ్ చక్రవర్తికి ఈ రెండు రోజుల హడావుడిలో వీసమెత్తు పాత్ర లేకుండా పోయింది, పైగా పవన్ కల్యాణ్ జారిపోతున్నాడు… అయ్యో, అయ్యో అని చంద్రబాబుకన్నా ఎక్కువ ఫీలైపోయింది ఆంధ్రజ్యోతి… ప్రధాని మోడీ మీద అదొక్కటే వ్యతిరేకతకు కారణం… చంద్రబాబును పది ఆమడల దూరం పెడుతున్నాడు, పొత్తు లేదు, గిత్తు లేదు, టీడీపీతో సంబంధాలు జాన్తా నై అంటున్నాడు… అదీ రాధాకృష్ణ కోపం…
ఇలాంటి ఆగ్రహ, ఉగ్ర, ఆవేశ, ఉద్రిక్త, అసహన పరిస్థితుల్లో తను బట్టలు పరపరా చింపేసుకుని, ఇష్టారాజ్యంగా ఏదేదో రాసేస్తుంటాడు… ఈరోజు ఆంధ్రజ్యోతి బ్యానర్ కూడా సేమ్… సర్, సర్, సర్, అర్థమవుతోందా మోదీ సర్ అనేది శీర్షిక… తెలుగులోనే సీఎం జగన్ విన్నపాలు అని ఉప శీర్షిక (డెక్)… మోదీని ఇబ్బంది పెట్టొద్దనేనా అంటూ మరొక విశ్లేషణ… రాసుకొచ్చిన సారాంశం ఏమిటంటే..?
Ads
జగన్ పూర్తిగా తెలుగులో ప్రసంగించడం వ్యూహాత్మకం అట… ఒకవేళ తను హిందీలో లేదా ఇంగ్లిషులో మాట్లాడితే, ఆ తరువాత మాట్లాడాల్సిన మోడీ స్పందించాల్సి ఉంటుంది కాబట్టి తెలుగులో మాట్లాడాడట… ప్రధానికి ఇబ్బంది సృష్టించడం ఇష్టం లేక ఈ తెలుగు ప్రసంగం అట… ఆ రాసుకొచ్చిన స్పీచ్ కూడా చదవడానికి కష్టపడ్డాడట… ‘మూడు’ రాజధానుల మాటెత్తడానికి కూడా దాటవేశాడట…
ముఖ్యమంత్రి అక్కడ ప్రసంగించింది అక్కడికి వచ్చిన లక్షలాది జనం కోసం… అందుకే తెలుగు… చాలా సింపుల్ ఫ్యాక్ట్… ప్రధానికి సమస్యలు చెప్పడానికి, డిమాండ్లు చేయడానికి, కోరికలు కోరడానికి అక్కడ కావాలని హిందీలో లేదా ఇంగ్లిషులో మాట్లాడతాడా..? అలాంటివి ఏమైనా కోరికలు, మెమొరాండాలు గట్రా ఉంటే ప్రధానిని ఏకాంతంగా కలిసినప్పుడు బయటపెడతాడు… అంతేతప్ప వేదిక మీద ప్రధాని కోసం తెలుగు వదిలేస్తాడా..? ఐనా తను ఎలాగూ హిందీలో మాట్లాడలేడు… కష్టపడి మాట్లాడాల్సిన అవసరమూ అక్కడ లేదు…
దీనికి ఇంత వక్రబాష్యం దేనికి..? పోనీ, ఈయన ఇంగ్లిషులో మాట్లాడాడు అనుకుందాం… అది బ్రహ్మాండంగా అర్థం చేసుకున్న మోడీ అక్కడికక్కడే స్పందించాల్సిన పనేముంది..? తను స్పందించాలి అనుకుంటే తన ప్రసంగంలో ఎలాగూ చెబుతాడు, ఇష్టం లేని విషయాన్ని అస్సలు అటెంప్ట్ చేయడు… రామగుండం వెళ్లి సింగరేణిని ప్రైవేటీకరించడం లేదు అని చెప్పాడు… అక్కడ ఎవరూ హిందీలో గానీ, ఇంగ్లిషులో గానీ అడగలేదు… ప్రధాని ఏ సభలో ఏం మాట్లాడాలో ముందే ఫిక్స్… అందుకే వైజాగ్ స్టీల్ మీద కిమ్మనలేదు… ప్రైవేటీకరణపై ముందుకు వెళ్లడమే బీజేపీ పాలసీ… ఇక ప్రత్యేక హోదాలు, కీలక విభజన సమస్యల్ని జగన్ పార్టీ ఏనాడో వదిలేసింది… ఇక వేదిక మీద ఎందుకు ప్రస్తావిస్తాడు..?
కొంతమేరకు ఈనాడు నయం… మరీ ఇలా బరితెగించి, బజారులో బట్టలు విప్పి పిలిచేరకం కాదు… కాస్త తలుపుచాటున నిలిచి కన్నుకొట్టేరకం… నిజానికి తను కూడా ఈ తెలుగు ప్రసంగం మీద చెత్త బాష్యాన్ని రాయాలి… తెలుగుదేశం ఆఫీసు బలంగానే కోరుకుంది, కానీ ఈనాడు తిరస్కరించి, ప్రధాని పర్యటనను వెకిలి చేయదలుచుకోలేదు… అందుకే వదిలేసింది… అంతేకాదు, ప్రధాని మీటింగుకు జనం విపరీతంగా వచ్చారనీ రాసుకొచ్చింది… అఫ్‌కోర్స్, అక్కడా జగన్‌కు క్రెడిట్ ఇవ్వదలుచుకోలేదు… అందుకే మొత్తం ప్రభుత్వ యంత్రాంగంపై ఒత్తిడి తెచ్చి, జనాన్ని సమీకరించారని తన కళ్లను తనే తుడుచుకుంది ఫాఫం…!!
Share this Article