పార్ధసారధి పోట్లూరి ……. అక్టోబర్ 31, 2022… యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ [UAE] మొదటిసారిగా భారత్- ఇజ్రాయెలీ సంయుక్త తయారీ అయిన బరాక్-8 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ని మోహరించింది తన దేశంలో ! 2020 లో ఇజ్రాయెల్ అరబ్ దేశాలతో దౌత్య సంబంధాలని నెలకొల్పిన తరువాత తన వాణిజ్యాన్ని మరింత మెరుగుపరుచుకోవడానికి గాను నిత్యం సౌదీ అరేబియా మరియు UAE లతో సంప్రదింపులు జరుపుతూనే వస్తున్నది. దాని ఫలితమే ఇజ్రాయెల్ నుండి మొదటి సారిగా బరాక్ -8 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ని కొనుగోలు చేసింది.
బరాక్ 8 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ని భారత్ కి చెందిన DRDO మరియు ఇజ్రాయెల్ ప్రభుత్వ రంగ సంస్థ అయిన రఫీల్ [RAEFEL] లు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఇజ్రాయెల్ తన స్వంత అవసరాల కోసం కొన్నా లేదా ఇతర దేశాలకి మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ అమ్మినా దానిలో భారత్ కి కూడా వాటా ఉంటుంది. జస్ట్ బ్రహ్మోస్ మిసైల్ సిస్టమ్ ని అమ్మితే రష్యాకి వాటా వెళుతుంది. బ్రహ్మోస్ లో రష్యాకి వాటా ఉంది, అలాగే బరాక్ 8 మిసైల్ సిస్టమ్ లో భారత్ కి వాటా ఉంది.
****************************
UAE భారత్ -ఇజ్రాయెలీ తయారీ అయిన బరాక్ 8 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ఎందుకు కొన్నది ? ఇరాన్ మద్దతు ఇస్తున్న దక్షిణ యెమెన్ లోని హుతీ తిరుగుబాటు దారుల దాడులు ప్రధానంగా సౌదీ అరేబియాతో పాటు UAE ని లక్ష్యంగా చేసుకొని డ్రోన్ల తో దాడులు చేస్తూ వస్తున్నారు. ఒక్కోసారి ఆన్ గైడెడ్ క్రూయిజ్ మిస్సైళ్ల ని కూడా ప్రయోగిస్తున్నారు.
2022 జనవరి 17 న అబుధాబికి దగ్గరలో ఉన్న ఒక పారిశ్రామిక ప్రాంతం మీద హుతీ తిరుగుబాటుదారులు డ్రోన్లతో దాడి చేశారు. ఈ దాడిలో ఇంధనం రవాణా చేస్తున్న మూడు ట్రక్కులు ధ్వంసం అయ్యాయి. నలుగురు విదేశీ కార్మికులు చనిపోయారు. ఈ దాడికి ముందు UAE లోని మిలటరీ, పారిశ్రామిక, ఆయిల్ డిపోలని లక్ష్యంగా చేసుకొని హుతీ తిరుగుబాటు దారులు తరుచూ దాడులు చేయడం, అవి గురి తప్పి వేరే చోట పడి పేలిపోవడం జరిగింది.
అయితే 2022, జనవరి 17 దాడి గురి తప్పలేదు. నేరుగా లక్ష్యాన్ని తాకాయి హుతీ తిరుగుబాటు దారుల డ్రోన్లు. ఫిబ్రవరి నెలలో UAE చాల రహస్యంగా ఇజ్రాయెల్ తో సంప్రదింపులు జరిపింది బరాక్ 8 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ కోసం! UAE కి తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అయిన బరాక్ -8 తో పాటు స్పైడర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కూడా కొనమని రికమండ్ చేసింది ఇజ్రాయెల్.
UAE లో అమెరికన్ థాడ్ [Terminal High Altitude Area Defence –THAAD] ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లేదా ? అమెరికన్ థాడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ UAE తో పాటు రొమేనియా, ఇజ్రాయెల్, దక్షిణ కొరియా దేశాలు కొన్నాయి. కానీ థాడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ బాలిస్టిక్ మిసైళ్లు, ఎక్కువ ఎత్తులో ఎగురుతూ వచ్చే జెట్ ఫైటర్స్ మరియు క్రూయిజ్ మిసైళ్ళ ని ఎదుర్కోవడానికి డిజైన్ చేయబడ్డ సిస్టమ్… రష్యన్ S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మరో ఉదాహరణ గా చెప్పుకోవచ్చు.
ఇరాన్ సప్లై చేస్తున్న డ్రోన్లు, ఆన్ గైడెడ్ రాకెట్స్ ని దక్షిణ యెమెన్ లోని హుతీ తిరిగుబాటుదార్లు తరుచూ సౌదీ అరేబియాతో పాటు UAE మీద ప్రయోగిస్తున్నారు కానీ థాడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వాటిని ట్రాక్ చేయలేకపోతున్నది. ఎందుకంటే అవి తక్కువ ఎత్తులో ఎగురుతూ వచ్చి దాడి చేస్తున్నాయి కాబట్టి…
***************************
2020 లో డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిగా వ్యవహరించి ఇజ్రాయెల్ అరబ్ దేశాల మధ్య సఖ్యత కుదిర్చాడు దాని ఫలితమే ‘అబ్రహం పాక్ట్ ‘ లేదా అబ్రహం ఒప్పందం పేరుతో గల్ఫ్ దేశాలతో ఇజ్రాయెల్ కి దౌత్య సంబంధాలు ఏర్పడ్డాయి. 2020 నుండి ఇజ్రాయెల్ తన ఉత్పత్తులని గల్ఫ్ దేశాలలో అమ్ముకోవడానికి ప్రయత్నిస్తున్న వేళ ఇరాన్ పరోక్షంగా ఇజ్రాయెల్ కి మార్కెట్ సృష్టించింది. ఆఫ్ కోర్స్ ఇరాన్ దేశం ఇటు ఇజ్రాయెల్ తో పాటు సౌదీ, UAE లకి ఉమ్మడి శత్రువు అవడం కాకతాళీయం. లెబనాన్ లోని హెజ్బొల్లాహ్ ఉగ్ర గ్రూపు ఎలాంటి రాకెట్లని ఇజ్రాయెల్ మీద ప్రయోగిస్తుందో ఇంచుమించు అలాంటి వాటినే హుతీ తిరుగుబాటుదారులు కూడా వాడుతున్నారు సౌదీ, UAE ల మీద. చాలా కాలంగా ఇజ్రాయెల్ తన స్పైడర్ మరియు బరాక్ 8 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ తో వీటిని సమర్ధవంతంగా ఎదుర్కోవడం తెలిసిందే ! అదే ఇప్పుడు సౌదీ అరేబియా తో పాటు UAE కి కూడా అవసరం అయ్యింది.
****************************
ఇంతలో ఎంత మార్పు ?
మొత్తం అరబ్ దేశాలు ఇజ్రాయెల్ నీడని కూడా ఇష్టపడేవీ కావు. అలాంటిది ఇప్పుడు ఏకంగా అరబ్ దేశాలకి ఇజ్రాయెల్ రక్షణ కల్పించడానికి ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఇజ్రాయెల్, సౌదీ, UAE లు ఒక కూటమిగా ఏర్పడడానికి ప్రయత్నిస్తున్నాయి. కానీ ఈ మధ్య సౌదీ ఆరేబియాకి అమెరికాతో పొసగట్లేదు అందుకే ఇజ్రాయెల్ సౌదీ UAE కూటమి ఒప్పందం ఆలస్యం అవుతున్నది. అదే డొనాల్డ్ ట్రంప్ కనుక అధికారంలో ఉన్నట్లయితే ఇప్పటికే మూడు దేశాలు ఒక కూటమిగా ఏర్పడి ఉండేవి. సౌదీ క్రమంగా రష్యా, చైనా ల వైపు మొగ్గు చూపడం కేవలం జో బిడెన్ తీసుకుంటున్న నిర్ణయాలే ప్రధాన కారణం!
కాలం అన్నిటికీ సమాధానం ఇస్తుంది ! ఏ అరబ్ దేశాలు నిత్యం ఇజ్రాయెల్ ని నాశనం చేయాలని చూసాయో ఇప్పుడు అవే అరబ్ దేశాల రక్షణ బాధ్యతని ఇజ్రాయెల్ నిర్వహించబోతున్నది. UAE లోని మరో 15 కీలక ప్రాంతాలని గుర్తించి అక్కడ కూడా ఇజ్రాయెల్ కి చెందిన స్పైడర్, బరాక్ 8 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ని ఏర్పాటు చేయాలని రెండు దేశాలు ఒక అంగీకారానికి వచ్చాయి. UAE లో ఇజ్రాయెలీ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ పని తీరుని బేరీజు వేసుకొని త్వరలో సౌదీ అరేబియా కూడా ఇజ్రాయెల్ తో ఒప్పందం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. So! ఇజ్రాయెల్ భారత్ ల సంయుక్త ప్రాజెక్ట్ అయిన బరాక్ 8 అమ్మకాలు పెరిగితే అవి పరోక్షంగా భారత్ కి కూడా లాభాలని ఇస్తుంది !
Share this Article