కొన్నిఅంతే… నిజంగా స్పందించాల్సిన అంశాలుంటే ఒక్కడూ కిమ్మనడు… అనవసరమైనవీ, అబద్దపు అంశాలపై మాత్రం రచ్చ చేయడానికి ప్రయత్నిస్తారు… ఈ వార్త చూస్తుంటే అలాగే అనిపించింది… ముందుగా వివాదం ఏమిటో చూద్దాం… దృష్టి ఐఏఎస్ అకాడమీ తెలుసు కదా… దేశంలో చాలా ఫేమస్ యూపీఎస్సీ ట్రెయినింగ్ సంస్థ… క్లాస్ రూమ్స్ మాత్రమే కాదు, ఆన్ లైన్ లెసన్స్, బుక్స్ అన్నీ… చాలామందికి ఆ సంస్థ ఇచ్చే సమాచారం మీద నమ్మకం… సరే, ఆ సంస్థ గురించి వదిలేస్తే…
దానికి కోచింగ్ ఫౌండర్, టీచర్ డాక్టర్ వికాస్ దివ్యకీర్తి… తన వీడియోలు కూడా ఫేమసే… ఈమధ్య తను మాట్లాడుతున్న ఓ వీడియో బయటికి వచ్చింది… అందులో హిందువుల మనోభావాలను కించపరిచే మాటలున్నాయనేది విమర్శ… అదేమిటంటే..? దివ్యకీర్తి మాట్లాడుతున్నాడు… ‘‘రాముడు సీతతో అంటాడు, సీతా, నేను రావణుడితో యుద్ధం చేసింది నీకోసం కాదు, నా కులగౌరవం కోసం మాత్రమే, నీదేముంది..? కుక్క ముట్టిన నెయ్యి అస్పృశ్యం కదా…’’ చిన్న వీడియో బిట్…
ఆమేరకు చూస్తే సగటు హిందువుకు చిర్రెత్తడంలో ఆశ్చర్యం లేదు… ఎడబాటు, వేదన, యుద్దం, అలసట అనంతరం రాముడు సీతను ఉద్దేశించి, ఆమెతోనే మరీ నువ్వు కుక్క ముట్టిన నెయ్యివి అంటాడా..? దాంతో రెండుమూడు రోజులుగా ట్విట్టర్‌లో #bandrishtiias అనే హ్యాష్ ట్యాగ్‌తో క్యాంపెయిన్ స్టార్ట్ చేసేశారు… మన సౌత్ రాష్ట్రాల ట్విట్టర్ కస్టమర్లు పెద్దగా పట్టించుకోలేదు గానీ ఉత్తరాదిలో ఇది కాస్త ట్రెండింగులోకి వచ్చింది… అవన్నీ చూస్తున్న సదరు దివ్యకీర్తి మాత్రం మొదటి రెండు రోజులకూ అస్సలు స్పందించలేదు…
Ads
నిజానికి ఇది తప్పుడు క్యాంపెయిన్… ఈ విషయంలో మాత్రం దివ్యకీర్తి సీతను గానీ, రాముడిని గానీ కించపరిచింది ఏమీలేదు… ఆ పూర్తి వీడియో పెట్టకుండా, ఎవడో కావాలని తప్పుడు ఉద్దేశాలతో తనకు అవసరమున్నంత మేరకు మాత్రమే కట్ చేసి, ఆ చిన్న బిట్‌తో రాంగ్ క్యాంపెయిన్ స్టార్ట్ చేశాడు… తను ఏ కాంటెక్స్ట్‌లో అన్నాడో తెలుసుకోకుండానే మిగతా ట్విట్టర్ ఖాతాదారులు పోలోమంటూ ఈ పిచ్చి క్యాంపెయిన్‌కు సహకరించారు…
దిగువన ఓ ట్వీట్ చూస్తే ఆ కాంటెక్స్ట్ ఏమిటో, నిజంగా సదరు టీచర్ ఏమన్నాడో తెలుస్తుంది… సదరు సంభాషణల రైటర్ తన మనస్తత్వాన్ని బట్టి రాసుకుంటూ పోయాడు అనే సెన్స్‌లో దివ్యకీర్తి చెప్పుకుంటూ పోయాడు తప్ప అవి తన వ్యాఖ్యలు కావు… తన సంభాషణలో ఆ ఉద్దేశం కూడా ఏమీలేదు… ముందే చెప్పుకున్నట్టు, ఎవడో కావాలని లేదా హాఫ్ నాలెడ్జితో మొదలుపెడతారు… వెనకాముందు ఆలోచించకుండా వేలాది మంది సై అంటూ సోషల్ ఉద్యమాలకు ముందుకొస్తారు… అవసరమున్న అంశాల్లో మాత్రం ఒక్కడికీ నోరు పెగలదు…
తరువాత సదరు టీచర్ స్పందిస్తూ ‘‘నేనూ హిందువునే, నేనెవరి మీద ఏ వ్యాఖ్యలూ చేయలేదు… కాకపోతే నేను మీరు ట్విట్టర్‌కు ఇచ్చినంత టైమ్ ఇవ్వలేను, నాకు బోలెడు పని ఉంది…’’ అని సింపుల్‌గా కొట్టిపడేశాడు… గుడ్… ఈ ట్వీట్ చూడండి, ఆ టీచర్ మాట్లాడింది ఇంకాస్త ఎలాబరేట్‌గా ఉంది…
ये रहा पूरा वीडियो.
इसे पूरा देखिए और समझिए कि कैसे एक महान अध्यापक की छवि धूमिल की जा रही है.
आधी-अधूरी जानकारी से खतरनाक कुछ नहीं होता.#Isupportdrishtiias#Isupportvikasdivyakirti #NationalEducationDay pic.twitter.com/SD448sLGdC
— Neha Singh Rathore (@nehafolksinger) November 11, 2022
Share this Article