అన్ని హైకోర్టుల చీఫ్ జస్టిస్‌లకు, సుప్రీంకోర్టు జడ్జిలకు ఎమ్మెల్యేల కొనుగోలు ప్రయత్నాల వీడియోలను పంపిస్తున్నట్టు కేసీయారే స్వయంగా చెప్పాడు కదా విలేకరుల సమావేశంలో…! అందరికీ పంపించారు… ‘‘మీరే ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి’’ అని కూడా కోర్టులకు మొరపెట్టుకున్నాడు కేసీయార్…
నిజంగానే ఓ అబ్సర్డ్ తంతు… ప్రచారం కోసం ఉద్దేశించిన ఓ ప్రహసనం… ఏ హైకోర్టయినా తన పరిధిలోని లేని అంశాన్ని ఎందుకు టేకప్ చేస్తుంది..? సుప్రీం జడ్జిలు కూడా తమకు నిర్దేశించిన, తమ టేబుల్ మీదకు వచ్చిన కేసుల్నే విచారిస్తారు… కేసీయార్ వీడియోలు పంపించాడు, వెంటనే విచారిద్దాం అనేదేమీ ఉండదు కదా… వారం క్రితం సుప్రీం జడ్జిలు ఎవరో, ఇంకేదో కేసులో ఏదో వ్యాఖ్యానాలు చేస్తూ… ఈ వీడియోల్ని చూసినట్టుగా చెప్పినట్టు గుర్తు…
ఇతర హైకోర్టుల మాట దేవుడెరుగు… హైదరాబాద్ హైకోర్టే దీన్ని ఏమాత్రం పాజిటివ్‌గా తీసుకోలేదు… అయితే ఈ వార్త ప్రధాన మీడియాలో కనిపించలేదు… ఎప్పటిలాగే…! ఈటీవీ భరత్ కథనం ప్రకారం… టీఆర్ఎస్ అధ్యక్షుడి నుంచి నా ఆఫీసుకు ఓ సీల్డ్ కవర్ వచ్చింది… అవి ఓపెన్ చేయిస్తే ఒక సీడీ, ఒక పెన్ డ్రైవ్ తదితరాలు ఏవో ఉన్నాయి, వాటిని ఏం చేయమంటారు అని చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ స్వయంగా ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించాడు…
Ads
వాటిని అలాగే సీల్ చేయించి, పక్కన ఉంచాలని చెప్పాను, దాన్ని ఏం చేయమంటారో మీరు చెప్పాలని చీఫ్ జస్టిస్ ప్రశ్న… ప్రభుత్వ న్యాయవాది దుష్యంత్ దవేకు ఏం జవాబు చెప్పాలో తెలియలేదు… ఎంబరాసింగ్… జరుగుతున్నది ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణే… స్ట్రెయిట్‌గా చీఫ్ జస్టిస్ వేసిన ప్రశ్నకు ఎలా స్పందించాలో తొలుత ఆయనకు అర్థం కాలేదు… ‘ఇలా జరిగి ఉండాల్సింది కాదు, నేను బేషరతు క్షమాపణ చెబుతున్నాను, ఇలాంటివి చట్టవిరుద్ధం… బాధాకరం, నేరుగా న్యాయమూర్తికే ఇలా వివరాలు పంపించడం, దర్యాప్తు సంస్థలు సమాచారాన్ని ఇలా బహిరంగపరచడం బాగాలేదు…’ అన్నాడు…
ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలు కూడా తమ దర్యాప్తు వివరాల్ని లీక్ చేయడం సాధారణమైపోయింది… రాజకీయ సమరాలకు న్యాయవ్యవస్థను వేదికగా చేయడం సరికాదు… టీఆర్ఎస్ అధ్యక్షుడి నుంచి వచ్చిన కవర్‌ను పట్టించుకోవద్దనీ, లేదా పక్కన పడేయాలని దుష్యంత్ దవే సూచించారు… న్యాయమూర్తులకు ఇలా సీల్డ్ కవర్లు పంపించడం న్యాయవ్యవస్థను ప్రభావితం చేయడమే అని బీజేపీ న్యాయవాది వైద్యనాథన్ ఆరోపించారు…
దేశంలోని ఏ పార్టీ అధ్యక్షుడూ పట్టించుకోలేదు… ఏ ముఖ్యమంత్రీ స్పందించలేదు… అసలు తెలంగాణలోని జనమే నమ్మలేదు… ఒకవైపు సీబీఐని రాష్ట్రంలోని రానివ్వబోమని జీవో ఇచ్చి, ఈ వీడియోలను సీబీఐకు పంపిస్తాడు… ఈ కేసులో కీలకమైన ఎమ్మెల్యేలు ఇప్పటికీ ప్రగతి భవన్‌లోనే ఉంటారు… ఎందుకిదంతా..? ఈ వీడియోలతో భూకంపం అన్నాడు, గాయిగత్తర అన్నాడు… కేసీయార్ ఏం సాధించినట్టు..? పైగా హైకోర్టు నుంచి వ్యతిరేకత సాధించడానికా..? అసలు ఎవరిది ఈ ఆలోచన..?!
Share this Article