Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మహారాష్ట్రలోనే కాదు… కేరళలోనూ కాంగ్రెస్ కూటమి ఇచ్చుకపోతోంది…

November 19, 2022 by M S R

పార్ధసారధి పోట్లూరి ……. కేరళ కాంగ్రెస్ పార్టీలో అభద్రతా భావం ! రాహుల్ ఎక్కువ రోజులు పర్యటించింది కేరళలో, కానీ అదే కేరళ రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు ఏ మాత్రం సంతోషంగా లేరు రాహుల్ పర్యటన వలన… పోయిన బుధవారం రోజున కేరళ కాంగ్రెస్ అధ్యక్షుడు సుధాకరన్ కన్ననూర్ లో చేసిన ప్రకటన అక్కడ రాజకీయ అభద్రతా భావాన్ని సూచిస్తున్నది. కన్ననూర్ లోని ఒక సభలో కేరళ కాంగ్రెస్ అధ్యక్షుడు సుధాకరన్ మాట్లాడుతూ దశాబ్దాల క్రితం తాను కేరళలోని RSS శాఖలని కాపాడాను అంటూ ఒక గందరగోళ వ్యాఖ్య చేశాడు…

 

1970 వ దశకంలో అప్పటి CPI[M] పార్టీ కార్యకర్తలు ఏదక్కాడ్, తోట్టడ, కిజ్హున్నా [Edakkad, Thottada and Kizhunna] జిల్లాలలోని ఆర్ఎస్ఎస్ శాఖల మీద దాడులు చేస్తుంటే సుధాకరన్ తన అనుచరులని పంపించి వాళ్ళని కాపాడాను అన్నాడు. తనకి ప్రజాస్వామ్యం మీద అపారమయిన గౌరవం ఉందని కాబట్టే ఆర్ఎస్ఎస్ ఉనికి అవసరం అనిపించి కాపాడాను అన్నాడు సుధాకరన్ !

Ads

సమయం సందర్భం లేకుండా కేరళ pcc చీఫ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దేనికోసం ? అంటే అప్పట్లో నేను ఆర్ఎస్ఎస్ ని కాపాడాను కాబట్టి ఇప్పుడు పినరయి విజయన్ నుండి తమని కాపాడమని అడుగుతున్నాడా సుధాకరన్ ? అయితే ఈ వ్యాఖ్య మీద కాంగ్రెస్ పార్టీలో కంటే కాంగ్రెస్ కి దశాబ్దాలుగా కేరళలో అండగా ఉంటూ వస్తున్న ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ [Indian Union Muslim League] మాత్రం ఘాటుగానే స్పందించింది. కేరళలోని UDF[యునైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ ] లోకేరళ ముస్లిం లీగ్ భాగస్వామి. UDF అధికారంలో ఉన్నప్పుడల్లా ముస్లిం లీగ్ కి మంత్రివర్గంలో స్థానం కల్పిస్తూ వస్తున్నది కాంగ్రెస్ !

కేరళ ముస్లిం లీగ్ నాయకుడు మరియు శాసన సభ్యుడు అయిన MK మునీర్ మాట్లాడుతూ కేరళ pcc చీఫ్ సుధాకరన్ చేసిన వ్యాఖ్యల మీద వెంటనే హై లెవల్ మీటింగ్ పెట్టి చర్చ చేయాలని డిమాండ్ చేశాడు. ఒక పక్క ముస్లిం లీగ్ తో పొత్తు తో ఉంటూనే రహస్యంగా ఆర్ఎస్ఎస్ తో చేతులు కలిపిన కాంగ్రెస్ ని నమ్మలేము. ఈ విషయం మీద తాడో పేడో తేల్చుకోవాల్సిందే అంటూ తీవ్రంగా ప్రకటన చేశాడు మునీర్!

కాంగ్రెస్ కి CPI[M] పార్టీ తో సమస్యలు ఉంటే భాగస్వామ్య పార్టీ అయిన తమతో చర్చించి ఒక అవగాహనకి వచ్చి యాక్షన్ తీసుకోవాలి కానీ ఇలా రహస్యంగా ఆర్ఎస్ఎస్ తో చేతులు కలపడం దేనికీ ? సుధాకరన్ వ్యాఖ్యల మీద కాంగ్రెస్ పెద్దలు తమతో కూర్చొని చర్చలు చేసి ఇక ముందు ఇలా జరగదు అనే హామీ ఇస్తేనే కానీ మేము UDF లో భాగస్వామి గా ఉండలేము అంటూ మునీర్ ఖరాఖండిగా చెప్పేశాడు!

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తన రాజకీయ భవిష్యత్తు కోసం ఎంతకయినా తెగిస్తాడు అనడానికి ఉదాహరణగా మూడు నెలల క్రితం కేంద్రం PFI ని నిషేధించినప్పుడు చెలరేగిన అల్లర్లని కఠినంగా అణిచివేశాడు… ఎందుకంటే PFI వలన తన వోట్ బ్యాంక్ దెబ్బతింటున్నది కాబట్టి. ప్రస్తుతం కాంగ్రెస్ ని టార్గెట్ చేస్తున్నాడు పినరయి… బహుశా సుధాకరన్ చేసిన వ్యాఖ్యలు పినరయి నుండి మమ్మల్ని రక్షించండి అనే అర్ధంలో ఉన్నట్లుగానే భావించాలి. కేరళ PCC చీఫ్ ఆడగాల్సింది రాహుల్ ని కానీ ఆర్ఎస్ఎస్ ని కాదు కదా ? మరి ఇంతోటి దానికి రాహుల్ భారత్ జోడో యాత్ర ఎందుకో ? కేరళలో ఎలాంటి ప్రభావం చూపకపోగా… పినరయి నుండి వేధింపులు అక్కడి కాంగ్రెస్ పార్టీకి !

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఏమాత్రం ధృవీకరణ లేని… ఓ డిటెక్టివ్ స్టోరీ ఫ్రం ఆపరేషన్ సిందూర్…
  • మళ్లీ ఓసారి ఈ దేశం ఈ ఐరన్ లేడీ ఇందిరని గుర్తుతెచ్చుకుంటోంది..!!
  • ‘‘మొగుడు పోయిన ఆడది, ఎన్నిక ఓడిన లీడర్ జనంలోకి వెళ్లొద్దు’’
  • నిన్నటి కాల్పుల విరమణ మరియు మహాభారతంలోని ఓ సంభాషణ..!
  • కోహ్లి రిటైర్‌మెంట్ ప్రచారాల వెనుక అసలు కథలేమిటి..?
  • పాపం శమించుగాక… ఇద్దరు వ్యక్తుల పేర్లు పదే పదే గుర్తొస్తున్నాయి…
  • యుద్ధానికి విరమణ సరే… కానీ ఈ ఆపరేషన్ ఏం తేల్చి చెప్పింది..?!
  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions