Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

లైగర్ చుట్టూ గట్టిగానే బిగుస్తోంది… బాలీవుడ్‌కూ సెగ తాకుతోంది…

December 1, 2022 by M S R

ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ కూరుకుపోతున్నారు… రష్మిక తనకు అవసరం లేని వివాదాల్ని నెత్తికి చుట్టుకుంటూ కూరుకుపోతోంది… విజయ్ దేవరకొండను మనీ లాండరింగు కింద ఈడీ గట్టిగానే బిగిస్తోంది… ఆ పిచ్చిది అనవసరంగా రిషబ్ అండ్ గ్యాంగును గోకుతోంది… పాతవన్నీ మనసులో పెట్టుకుని వాళ్లను రెచ్చగొడుతూ ఉంది… అవన్నీ మనం ఇంతకుముందే చెప్పుకున్నాం…

కన్నడ ఎగ్జిబిటర్లు, నిర్మాతలు ఇప్పటికీ ఆమె మీద మంట మీద ఉన్నారు… ఆమె నటించిన రెండు సినిమాలపై కర్నాటకలో నిషేధం అనే ప్రతిపాదన ఇంకా సజీవంగానే ఉంది… ఈలోపు ఒక వీడియో వైరలయిపోయింది తాజాగా… ఎవరైనా ఎదిగేకొద్దీ బేస్‌ను పటిష్టం చేసుకుంటూ పోతారు… ఈ పిల్ల పునాదిని ధ్వంసం చేసుకుంటూ, కొత్త అంతస్థులు కట్టుకునే పనిలో పడింది…

అంటే తన మాతృ ఇండస్ట్రీ కన్నడను ఇగ్నోర్ చేస్తోంది… అది మూర్ఖత్వం… ఇప్పుడు రిషబ్ గ్యాంగు ఫ్యాన్స్ ఓ పాత వీడియోను తవ్వారు… ఫుల్ సర్క్యులేషన్‌లోకి తీసుకొచ్చారు… అందులో ఆమె ‘‘కన్నడ సినిమాలు లేకపోతేనేం, తెలుగు, హిందీ, తమిళ సినిమాల్లో కంఫర్టబుల్‌గా ఉన్నాను… సక్సెస్ అవుతున్నారు’’ అని ఏదో చెబుతోంది… దీంతో ఆమెను యాంటీ కన్నడ అని చిత్రీకరించి ప్రాపగాండాకు పూనుకున్నారు… ఇప్పటికిప్పుడు ఆమెకు నష్టం తీవ్రత తెలియకపోవచ్చు… కానీ భవిష్యత్తు ఆమె కళ్లు తెరిపిస్తుంది…

Ads

నిజానికి రష్మిక ఓ ఫ్రస్ట్రేషన్‌లో ఉంది… దాని పేరు విజయ్ దేవరకొండ… రష్మిక సంపాదించిందంతా విజయ్ ప్రేమలో పడి, ఇచ్చుకుంటూ పోయిందట… లైగర్ దెబ్బకు అటు చార్మి జగన్నాథులే కాదు, ఇటు రష్మిక కూడా నిండా మునిగిందని ఇప్పుడు తెలుగు, కన్నడ ఇండస్ట్రీల్లో టాక్… చార్మికి ఏడుపొక్కటే తక్కువ… జగన్నాథుడు అన్నింటికీ అతీతంగా సన్యాసయోగంలో ఉన్నాడు కాబట్టి ఏమీ బాధిస్తున్నట్టు లేదు…

దీంతో అయిపోలేదు… లైగర్ సినిమా పెట్టుబడుల విషయంలో ఈడీ చాలా పట్టుదలతో ఉంది ఎందుకో మరి..? ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ కింద గట్టిగానే బిగిస్తున్నట్టు సమాచారం… దీంతో సమస్య ఏమిటంటే… విజయ్ దేవరకొండతో సినిమా అంటే కొత్త నిర్మాతలు వణికిపోయే స్థితి వస్తుంది… సో, రష్మిక, విజయ్ విడివిడిగానే ఒకే దిశలో పయనిస్తున్నారు… ఈడీ విచారణ టాలీవుడ్‌తో ఆగబోవడం లేదు… కరణ్‌జోహార్, అపూర్వ మెహతా సహా మరికొందరికీ నోటీసులు రాబోతున్నాయ్…

చెప్పనే లేదు కదూ… రష్మిక మాటలు ఎక్కడి దాకా వెళ్లాయంటే… తెలుగు, తమిళ, హిందీ మాత్రమే కాదు… ఇంగ్లిషు ఫిలిమ్స్ మీద కూడా కాన్సంట్రేట్ చేస్తాను… ఒక్క ప్రత్యేకమైన జోన్‌కు పరిమితం (కన్నడ) కాదల్చుకోలేదు అంటోందట… వామ్మో… బాగానే తలకెక్కినట్టుంది… ప్రస్తుతం రష్మిక చేతిలో ఉన్న ప్రాజెక్టుల్లో పుష్ప-2 ముఖ్యమైంది… వారసుడు రావల్సి ఉంది… యానిమల్, మిషన్ మజ్ను… ప్రస్తుతానికి బిజీ… కానీ విజయ్ దేవరకొండకు ఖుషీ తప్ప మరో సినిమా లేదు… అన్నట్టు ఈడీ విచారణపై విజయ్ అపరిపక్వ స్పందన తెలుసా..? ‘‘పాపులారిటీతో ఇలాంటి సమస్యలు వస్తాయి, ఇదొక అనుభవం’’..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అవునూ హరీషూ… కొండగట్టు బస్సు ప్రమాద మృతులు గుర్తున్నారా..?!
  • సైన్స్, ఎమోషన్, సంప్రదాయం ఆస్తికత్వం, హేతువాదం… హేట్సాఫ్ టి.కృష్ణ..!!
  • ‘‘హస్తరేఖలు మన పిడికిట్లో ఉన్నట్టే ఉంటాయి, కానీ మన మాట వినవు’’
  • వినేవాడు వెర్రివెంగళప్ప అయితే… చెప్పేది రష్మిక మంధానా..!!
  • పరమ నాసిరకం ఫైటర్లను ఇండియాకు అంటగట్టే యత్నం… పార్ట్-2
  • మోడీ వినక తప్పలేదు… బనకచర్ల కుట్రను చేధించిన రేవంత్‌రెడ్డి…
  • F-35 …. అడ్డగోలు లోపాల ఫైటర్… అమెరికా అంటగట్టే యత్నం… పార్ట్-1
  • దిల్ రాజు మారడు… ఎవడూ తన కళ్లకు ఆనడు… ప్రతి మాటలో అహం..!!
  • ‘సంఘ్’ నేపథ్యమే ప్రధాన అర్హతా..? చంద్రబాబు మాటే చెల్లుబాటా..?!
  • కామాఖ్య కాదు… మన ‘మహా నేతలూ’ నమ్మిన ఈ తాంత్రిక గుడి వేరు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions