పాల్కీ శర్మ ఉపాధ్యాయ్… వయస్సు 40… వృత్తి టీవీ ప్రజెంటర్… ఈమె పేరు ఇప్పుడు జర్నలిస్టు సర్కిళ్లలోనే గాకుండా భిన్నవర్గాల ప్రముఖుల చర్చల్లోనూ నానుతోంది… ప్రస్తుతానికి అధికారికంగా ఏ ప్రకటనా లేదు… కానీ ఈమె ఎన్డీటీవీ ఎడిటోరియల్ చీఫ్‌గా చేరబోతుందనేది ఈ చర్చల సారాంశం… అసలు ఎవరీమె..? మూడు ప్రధాన మీడియా సంస్థలు ఎందుకు ఆమె సారథ్యం కావాలని బలంగా కోరుకుంటున్నాయి..?
విషయం ఎక్కడిదాకా వెళ్లిందంటే కోర్టుకు కూడా ఎక్కింది… వివరాల్లోకి వెళ్దాం… ఆమె పుట్టింది రాజస్థాన్‌లోని పిలానీ… మొదట్లో దూరదర్శన్‌లో చేసేది… తరువాత సీఎన్ఎన్-ఐబీఎన్‌లో చేరి చాన్నాళ్లు పనిచేసింది… భర్త సంకేత్ ఉపాధ్యాయ్… తను కూడా జర్నలిస్టే… పాల్కీకి గుడ్ ప్రజెంటర్‌గా పేరుంది… సరైన గణాంకాలతో, ఒక పర్సనల్ లైన్ తీసుకోకుండా, స్పష్టంగా, సరళంగా ప్రేక్షకులకు సబ్జెక్టును ప్రజెంట్ చేస్తుందనే పేరు… దేశంలోకెల్లా టాప్ టీవీ ప్రజెంటర్ ఆమె ఇప్పుడు…
సీఎన్ఎన్-ఐబీఎన్ తరువాత వియాన్‌లో చేరింది… అది ఎస్సెల్ గ్రూపు, అంటే జీమీడియాకు చెందిన ప్లాట్‌ఫామ్… అంటే బీజేపీ మాజీ ఎంపీ… అనేక చానెళ్లు, మీడియా ప్లాట్‌ఫామ్స్‌తో ఓ బలమైన ఇన్‌ఫ్లుయెన్స్ సంస్థ… అందులో మేనేజింగ్ ఎడిటర్‌గా చేరిన పాల్కీ గ్రావిటాస్ అనే ప్రోగ్రాంతో విస్తృతంగా జనంలోకి వెళ్లింది… ఆర్నబ్‌కూ ఆమెకూ తేడా ఏమిటంటే… ఆర్నబ్ అరుస్తాడు, కరుస్తాడు, ఎగురుతాడు, ఆవేశపడతాడు, తన సొంత భావాల్ని రుద్దే ప్రయత్నం చేస్తాడు… కానీ పాల్కీ అలా కాదు… కూల్… తను ఎమోషనల్ అయిపోదు… విషయం ఏమిటో అర్థమయ్యేట్టుగా వివరిద్దాం, ప్రేక్షకులకే సొంత అభిప్రాయం ఏర్పరుచుకునే అవకాశం ఇద్దాం అనేది ఆమె సూత్రం…
Ads
ఏవో కారణాలు, ఆమె వియాన్‌ను వదిలేసింది… నో, మేం ఎలా ఒప్పుకుంటాం అని జీగ్రూపు ఆమెను రిలీవ్ చేయడానికి మొరాయించింది… కోర్టుకు ఎక్కింది… అదేమంటే..? ఆమె నెట్‌వర్క్18లో చేరబోతోందనీ, వియాన్ సంబంధ కాన్ఫిడెన్షియల్ సమాచారం అక్కడికి చేరితే తమకు నష్టమనీ వాదించింది… ఒప్పందాలకు భిన్నంగా మధ్యలోనే వదిలేస్తున్నందుకు కోట్ల పరిహారం కట్టాలని ఉరిమింది… నెట్‌వర్క్18 తెలుసు కదా… ఆదానీ ఢీకొడుతున్న అంబానీది…
ఇప్పుడు ఆదానీ ఎన్డీటీవీ పగ్గాలను పూర్తిగా చేజిక్కించుకున్నాడు… ప్రణయ్ రాయ్, రాధికా రాయ్ దంపతులతోపాటు ఎడిటోరియల్ విభాగాన్ని లీడ్ చేస్తున్న రవీష్ కుమార్ కూడా రాజీనామా చేశాడు… ఎలాగూ ప్రణయ్ విధేయ టీంను ఆదానీ అక్కడ కొనసాగనివ్వడు… ఈలోపు తనే రాజీనామా చేశాడు… ఆదానీ ఆల్రెడీ పాల్కీ శర్మకు మేనేజింగ్ ఎడిటర్ పోస్టు ఆఫర్ చేశాడనీ, ఆమె చేరబోతోందనీ వెబ్ వార్తల్లో బలంగా వినిపిస్తోంది… నిన్న మొత్తం నెట్‌లో ఇదే డిస్కషన్… ఆమె కోణంలో నిజానికి ఇది మంచి ఆఫరే, ఎన్డీటీవీ కోణంలోనూ మంచి ఆఫరే… ఆమె భర్త ఆల్రెడీ ఎన్డీటీవీలోనే కన్సల్టింగ్ ఎడిటర్‌గా ఉన్నాడు…
సో, పిల్లీ పిల్లీ కొట్లాడుకుంటే కోతి కొట్టుకుపోయిందని… జీగ్రూపు సుభాష్ చంద్ర, నెట్‌వర్క్18 అంబానీల నడుమ ఎన్డీటీవీ ఆదానీ పాల్కీ శర్మ సేవల్ని పొందబోతున్నాడన్నమాట… కాకపోతే అధికారికంగా ఏమీ లేదు… నో, నో, ఎన్డీటీవీ ఇప్పుడు లెఫ్ట్ ఐడియాలజీ నుంచి పూర్తిగా మోడియాలజీ వైపు మళ్లినట్టేనని, పాల్కీ శర్మ అక్కడ ఇమడలేదనీ కొందరి వాదన… ఆమె ఇన్నేళ్లు మంచి పేరు తెచ్చుకున్న వియాన్ కూడా ఆల్‌మోస్ట్ కాషాయ శిబిరమే కదా…!!
Share this Article