మన మీడియా పెద్దగా కాన్సంట్రేట్ చేయడం లేదు గానీ… చత్తీస్‌గఢ్‌లో ఈడీ దెబ్బలకు సీనియర్ ఐఏఎస్ అధికారుల కూసాలు కదిలిపోతున్నయ్… కోట్లకుకోట్ల డబ్బు దొరుకుతోంది… లెక్కకులేని, సరే, లెక్కేలేనంత సంపద పోగేసిన తీరు బట్టబయలవుతోంది… విచిత్రం ఏమిటంటే… కాంగ్రెస్ ముఖ్యమంత్రి భూపేష్ భాగెల్ వీళ్లను వెనకేసుకుని వస్తూ… ఇవన్నీ రాజకీయ దాడులని ఎదురుదాడికి దిగడం…
సింపుల్… చత్తీస్‌గఢ్‌లో ఓ సిండికేట్… అందులో రాజకీయ నాయకులు, దళారులు, బ్యూరోక్రాట్లు, వ్యాపారులు ఉంటారు… అక్రమంగా సంపాదించిన డబ్బు ఓ నిష్పత్తిలో పంచుకుంటారు… ఉదాహరణకు టన్ను బొగ్గు రవాణా జరిగితే 25 రూపాయలు వీళ్ల ఖాతాలో పడాల్సిందే… అసలు చత్తీస్‌గఢ్ అంటేనే బొగ్గు గనులు… ఇక రెగ్యులర్‌గా ఎంత డబ్బు వస్తుందో లెక్కేసుకోవడమే… ఇవిగాకుండా అక్రమాలు వేరే…
నిజానికి నాయకులతో మిలాఖతైపోయి, ప్రజాధనాన్ని దోచుకునే అధికారులనే ఈడీ, సీబీఐ ఫస్ట్ టార్గెట్ చేయడం బెటర్ అని..! రాజకీయ నాయకుడి పదవి అశాశ్వతం… పైగా ఖర్చులు ఎక్కువ… బ్యూరోక్రాట్లకు 60 ఏళ్ల దాకా కొలువుకు ఢోకా లేదు… రకరకాల ట్రిబ్యునళ్లు గట్రా సపోర్టుకు వస్తాయి… ఖర్చుల్లేవు… దొరికితే, వీలుంటే లాయర్ల ఖర్చులూ ఖజానా నుంచే పెట్టించొచ్చు… ఇండియాలో సిసలైన వైభోగం అనుభవించేది సీనియర్ బ్యూరోక్రాట్లే…
Ads
చత్తీస్‌గఢ్‌లో కొన్నాళ్ల క్రితం సీనియర్ ఐఏఎస్ సమీర్ విష్ణోయ్‌ను, మరో ముగ్గురు బొగ్గు స్కాం పాత్రధారుల్ని అరెస్టు చేశారు… వాళ్లిప్పటికీ జైలులోనే ఉన్నారు… (ఈమధ్యే జార్ఖండ్‌లో పూజా సింఘాల్ అనే సీనియర్ ఐఏఎస్‌కు చెందిన 83 కోట్ల ప్రాపర్టీస్ అటాచ్ చేసింది ఈడీ…) మరోవైపు చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ డిప్యూటీ సెక్రెటరీ సౌమ్య చౌరాసియా యాక్టివిటీ మీద నిఘా వేసింది ఈ రెండు నెలలుగా… ఆధారాలు దొరకగానే నిన్న అరెస్టు చేసింది ఏకంగా… ఆమె అక్రమాల వేళ్లు అక్రమ మైనింగు నుంచి మనీలాండరింగు ద్వారా విస్తరించుకుని ఉన్నాయి…
ఇంకా చాలామందిపై వల విసరబడి ఉంది… జార్ఖండ్, చత్తీస్‌గఢ్ మైనింగుల మీద దృష్టి పెట్టింది ఈడీ… భూపేష్ భాగెల్ స్పందన ఏమిటో తెలుసా..? ‘‘ఈ దాడులన్నీ పొలిటికల్ కక్షసాధింపు… అధికారులను పిలిచి రాడ్లతో కొడుతున్నారు… విచారణ పేరుతో వేధిస్తున్నారు… తిండి, మంచినీళ్లు కూడా లేకుండా రాత్రిళ్లు విచారిస్తున్నారు… ఇదంతా నా ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేయడం కోసమే’’ హవ్… అవినీతి అధికారుల భరతం పడుతుంటే కాంగ్రెస్ ముఖ్యమంత్రికి ఉలికిపాటు దేనికి..? తను సాక్షాత్తూ సీఎం డిప్యూటీ సెక్రెటరీ… ఇంకెక్కడ తన బాగోతాలు బయటికి వస్తాయో అని భయం… ఈమె ఇంటిపై కొన్నాళ్ల క్రితం రెయిడ్ చేస్తే 14 కోట్ల నగదు, నగలు దొరికాయి… ఇవన్నీ ఎక్కడివి అనడిగితే బ్బెబ్బెబ్బె…
ఆమెను అరెస్టు చేస్తుంటే న్యూస్‌టుడే నెట్‌వర్క్‌కు చెందిన రిపోర్టర్ సునీల్ నామ్‌దేవ్ లైవ్ రిపోర్టింగ్ వీడియో ఇప్పుడు వైరల్ అయిపోయింది… ఆమెను తీసుకువెళ్తుంటే ఆ దృశ్యాలు చూపిస్తూ… ‘‘వెళ్తోంది చూడండి, సూపర్ సీఎం… అవినీతికి రూపం…’’ అంటూ కడుపులో ఏదో కక్ష రగిలిపోతున్నట్టుగా వ్యాఖ్యలు చేశాడు… అక్కడున్న అధికారులు, ప్రభుత్వ సిబ్బంది, లాయర్లు ‘మస్త్, బెత్రీన్, సూపర్’ అని మెచ్చుకోవడం గమనార్హం… అంటే అందరికీ ఆమె మీద ఎలా మండిపోతున్నదో చెప్పడానికి నిదర్శనం…
సదరు రిపోర్టర్ మాట్లాడిన తీరు నాకైతే నచ్చలేదు… సబ్జెక్టు బలంగా ఉన్నప్పుడు ప్లెయిన్‌గా, కూల్‌గా రిపోర్ట్ చేసినా బలంగానే పేలుతుంది… అయితే తననే కాదు, ఇతర జర్నలిస్టులనూ ప్రభుత్వం ఈమధ్య బాగా వేధిస్తోంది… ఇదే రిపోర్టర్ మీద రెండు కేసులు కూడా ఉన్నాయి… గత నెలలో అమిత్ షాకు రిపోర్ట్ చేశాడు తను… ప్రత్యేకించి మైనింగ్ అక్రమాలు రాస్తున్న ప్రతి జర్నలిస్టునూ చత్తీస్‌గఢ్ ప్రభుత్వం వేధిస్తోంది… అదంతా వేరే కథ…
This is fearless and honest journalism! pic.twitter.com/lZ2Tfp2IGr
— ADV. ASHUTOSH J. DUBEY 🇮🇳 (@AdvAshutoshBJP) December 2, 2022
Share this Article