నిజానికి ఇదే వార్త గనుక ఆంధ్రజ్యోతి రాయాలనుకుంటే, స్ట్రెయిట్‌గా నాలుగు రకాల మసాలాలు అదనంగా జల్లి, దమ్ కా బిర్యానీ వండి వడ్డించేది… ఈనాడు రాతలో పంచ్ లేదు, అసలు తన రాతియుగం శైలినీ మార్చుకోవడం లేదు… ఫలితంగా ఓ నూకల ఉప్మా లేదా పులిహోర కథనం మూడు కాలాల్లో కనిపించింది… అది చదివితే ఫాఫం, ఈనాడు పాఠకుడు జుట్టు పీక్కోవడం ఖాయం…
నేరుగా రాయొచ్చు… ఢిల్లీ మద్యం స్కాంలో నిందితులందరూ తమ ఫోన్లను పగులగొట్టారు… వాటి విలువే 1.35 కోట్లు… ఈడీ అందరి ఫోన్లనూ స్వాధీనం చేసుకుని తవ్వుతుందనే భయంతో, ఆధారాలు దొరకకూడదని ఇలా ధ్వంసం చేశారు… ఈనేపథ్యంలో విజయసాయిరెడ్డి ఫోన్ చోరీకి గురైందని పోలీసు కేసు పెట్టడం, తరువాత తనే దర్యాప్తు వద్దనడం కొత్త సందేహాలకు దారితీస్తోంది… పోలీసులు గనుక దర్యాప్తు చేస్తే ఇంకేం నిజాలు బయటపడతాయో అనే భయంతో తదుపరి దర్యాప్తు వద్దన్నారు…
విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడు ఈ స్కాంలో ఓ ముఖ్య నిందితుడు, తనను చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కలిసి వచ్చాక సాయిరెడ్డి తన ఫోన్ పోయినట్టుగా ఫిర్యాదు చేశాడు… కాకపోతే నేను కాదు, నా పీఏ వాడుతున్నాడన్నాడు… మరి పీఏ వాడుతున్న ఫోన్‌ను పోలీసులు గనుక దొరకబుచ్చుకుంటే వచ్చిన ఇబ్బంది ఏమిటి..? ఎందుకు తదుపరి దర్యాప్తు వద్దన్నట్టు..? ఆ లిక్కర్ స్కాంలో తన పాత్ర ఎక్కడ బయటికి వస్తుందో అని సాయిరెడ్డి భయపడుతున్నాడు..’’ ఇదీ ఈ వార్త సారాంశం…
Ads
రాయడానికి నానా పాట్లూ పడ్డారు… ఓచోట ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి అంటూ… మరోచోట తెదేపా నాయకులు ఆరోపించారు అంటూ ఎవరికో క్రెడిట్ ఇవ్వడం దేనికి..? ఈనాడే రాయాలనుకుంటే నేరుగా రాయవచ్చు కదా… అంతెందుకు..? ఢిల్లీ మద్యం స్కాం విచారిస్తున్న ఈడీ, సీబీఐ సాయిరెడ్డి పాత్ర మీద కూడా దృష్టి పెట్టాలని నేరుగా వార్తలోనే ప్రస్తావించవచ్చు కదా… ఏపీ పోలీసులు కాబట్టి సాయిరెడ్డి చెప్పగానే ఫోన్ గురించి మరిచిపోయారనీ, నిజానికి ఆ ఫోన్ దొరికితే చాలా నిజాలు బయటపడతాయనీ చెప్పవచ్చు కదా…
ఒకవైపు సాయిరెడ్డి రోజూ రెండు డజన్ల ట్వీట్లు పెడుతూ… చింత బరిగెలతో బాదుతున్నాడు రామోజీరావును..! ఈనాడు ముఖ్యులకు కడుపు రగిలిపోతోంది… కానీ ఏం చేయాలో, సాయిరెడ్డిని ఎలా బజారుకు ఈడ్చాలో తెలియడం లేదు… అవకాశమున్న వార్తల్నీ రాయడం చేతకావడం లేదు… ఆంధ్రజ్యోతి అయితే గాలి పోగేసి మరీ వంటకాలు రెడీ చేసేది… నిజానికి సాయిరెడ్డి ట్వీట్లు చీప్ టేస్ట్… ఆ భాష, ఆ శైలి, ఆ పదాలు నీచంగా ఉంటాయి… అయితేనేం..? సరిగ్గా ఎదురుదాడి జరిగింది ఎక్కడ..? మద్యం స్కాంను ఫోన్ కథతో సాయిరెడ్డి తలకు చుట్టాలని అనుకున్నారు, కానీ చేతగాక చేతులెత్తేశారు… తమ వార్త తమకే నచ్చలేదు, అందుకే నిన్న లోపలి పేజీల్లో వేసుకుని, చూసుకుని, వాళ్లే సిగ్గుపడిపోయినట్టున్నారు..!!
Share this Article