ఈ సినిమా మీద కాస్త ఆసక్తి ఎందుకు అంటే… 1) సత్యదేవ్… ఒరిజినల్‌గా మెరిట్ ఉన్న నటుడు… వరుసగా అవకాశాలు వస్తూనే ఉన్నాయి… వర్ధమాన హీరోల్లో కాస్త ఫ్యూచర్ కనిపిస్తున్న హీరో… 2) తమన్నా… ఎక్కడో ఉండాల్సిన పాపులర్ నటి… ఫాఫం, అవకాశాలు సరిగ్గా లేక కిందామీదా పడుతోంది… 3) కన్నడం నుంచి మనకు రీమేక్స్ తక్కువ… రెండేళ్లుగా నిర్మాణం సా-గు-తు-న్న సినిమా… 4) నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ తరహా స్టోరీ…
సినిమా మొత్తం పూర్తయ్యాక, ఆవలిస్తూ మనం బయటికి వస్తున్నప్పుడు పదే పదే గుర్తొచ్చి వేధించే ప్రశ్న… ఈ సినిమాలో ఏముందని తమన్నా ఒప్పుకుంది… కన్నడంలో హిట్ అయ్యింది కాబట్టి కథలో నిజంగానే ఏమో ఉంది, నాకూ ఉపయోగమే అనే తప్పుడు అంచనాలో ఉందా..? ఇదుగో ఇలాంటి కారణలేనా ఆమె కెరీర్ అకస్మాత్తుగా ఆపేస్తున్నాయి లేవకుండా..!!
చెప్పలేదు కదూ… కన్నడంలో దీని ఒరిజినల్ పేరు… లవ్ మాక్‌టెయిల్… డార్లింగ్ కృష్ణే నిర్మాత, దర్శకుడు, రచయిత, హీరో… మన తెలుగువాళ్లకు తెలియదు… నిజంగానే 125 కోట్లు కలెక్ట్ చేసిందా ఇది..? ఏమో డౌటే… ఏమో, కన్నడ ప్రేక్షకులు పుణ్యాత్ములు, చూసేసి ఉంటారు అనుకుందాం… కన్నడ కలెక్షన్లు చూసి రీమేక్ చేసేశారా తెలుగులో… వాళ్లకు సొంత అంచనాలు లేవా..?
Ads
భిన్నమైన కథలు తీసుకున్నప్పుడు… మంచి పాటలు పడాలి, పండాలి… స్క్రీన్ ప్లే, కథనం గ్రిప్పింగుగా సాాగాలి… ఎమోషన్స్ పండాలి… ప్చ్, అవేమీ ఉండవు ఈ సినిమాలో… హీరో తన పాత ప్రేమకథను ఎవరు కనిపిస్తే వాళ్లకు చెప్పేస్తూ ఉంటాడు… అలా ఓ నటికి చెబుతుంటాడు… అదేమిటయ్యా అంటే ఇంకో ఇద్దరమ్మాయిలతో ముడిపడిన తన ప్రేమకథ… అదీ తాపీగా నడుస్తుంటుంది…
తమన్నా పర్లేదు, ఆమె అనుభవం ఉన్న నటి కాబట్టి అలవోకగా చేసేసింది… ఐనా అందులో కష్టపడాల్సినంత పాత్ర ఏమీ కాదు… సత్యదేవ్ అప్పియరెన్స్ ప్లజెంటుగా బాగానే ఉంది… నేచురల్ నటుడు… కాకపోతే ఆ ఫార్ములా ఫైట్స్ మాత్రం అవాయిడ్ చేసి ఉండాల్సింది… నాని ఎలాగూ కమర్షియల్ పోకడలతో అందరిలాగే మారిపోయాడు కదా… తనలోని నటుడిని మెల్లిగా మరిచిపోవచ్చు మనం… శర్వానంద్ కూడా అందుబాటులోకి లేకుండా పోతున్నాడు మధ్యతరగతి నిర్మాతలకు… సో, సత్యదేవ్‌కు మంచి పాత్రలు పడితే మాత్రం ఇంకా పైకి లేస్తాడు…
నిజానికి కావ్యా శెట్టి, తమన్నా పాత్రల కేరక్టరైజేషన్ సరిగ్గా లేకపోవడం కథలో ప్రధానలోపం… మేఘా ఆకాష్ ప్రధానంగా ఓ గెస్టు పాత్ర,.. సుహాసిని కూడా సినిమాలో ఉంది… కాలభైరవ సోనూ నిగం, అర్మాన్ మాలిక్, శ్రేయోఘోషల్‌ను తెచ్చుకున్నా ఆ మెరుపులేమీ లేవు పాటల్లో… మరీ టైటిల్‌లోనే గుర్తుందా శీతాకాలం అనడిగితే ఏం చెబుతాం… గుర్తుంచుకునేంత సీన్ ఏమీ లేదు అంటాం… అంతే… అవతార్-2 రిలీజు నాటికి మరో చూడబుల్ కొత్త తెలుగు సినిమా ఏదీ లేకుండా పోతున్నట్టుంది…!!
Share this Article