నారప్ప రెవిన్యూ మొత్తం చారిటీకి ఇస్తాం… దగ్గుబాటి సురేష్ నోటి నుంచి వచ్చిన ఈ మాట కాస్త నవ్వు పుట్టించింది… తెలుగు సినిమా ఇండస్ట్రీలో పేరెన్నిక గన్న పెద్దలకు చారిటీ అంటే తెలుసా..? అసలు దగ్గుబాటి కుటుంబానికి సంబంధించిన చారిటీ వార్త ఒక్కటైనా చదివామా..? ఫోటో ఒక్కటైనా చూశామా..? తనే కాదు, ది గ్రేట్ దిల్ రాజు, రాజమౌళి ఎట్సెట్రా అందరూ… పిల్లికి బిచ్చం, ఎడమచేత్తో కాకిని… వంటి సామెతలన్నీ వీళ్లకే సూటబుల్…
ఈ ప్రస్తావన ఎందుకొచ్చిందీ అంటే… వెంకటేష్ ఆమధ్య నారప్ప అనే సినిమా తీశాడు… కానీ ఓటీటీలోనే విడుదల చేశారు… కరోనా సమయం, థియేటర్లు ఓపెన్ లేవు, దాంతో అమెజాన్లో రిలీజ్ చేసేశారు… సినిమా పర్లేదు, హిట్ టాకే వచ్చింది… కానీ ఇప్పుడు వెంకటేష్ బర్త్డే సందర్భంగా ఆ సినిమాను థియేటర్లలో ఒక్కరోజు కోసం రిలీజ్ చేస్తారట… టాలీవుడ్ సిండికేట్ మెంబరే కాబట్టి జస్ట్, ఒక్కరోజుకు థియేటర్లను అలా అలా అడ్జస్ట్ చేసిపారేస్తారు… అదెంత పని…
అయితే కేవలం ఒకరోజు (డిసెంబరు 13) షోల కోసం థియేటర్లలో రిలీజు దేనికి..? ఎలాగూ ఒక్కరోజు రెవిన్యూ మీద ఆశపడరు వాళ్లు… పైగా అమెజాన్ వాడు ఒప్పుకోడు… ఈ ప్రశ్నలకు బదులిస్తూ దగ్గుబాటి అభిమానులు కోరారు కాబట్టి అమెజాన్ను అడిగితే వాళ్లు ఓకే అన్నారట… మరి రెవిన్యూ మాటేమిటి అంటే… చారిటీకి ఇచ్చేస్తాం అన్నారట…
Ads
Share this Article