Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కాంతార సీక్వెల్ కోసం రిషబ్ ప్రత్యేక పూజలు… పంజుర్లి దేవుడి హెచ్చరికలు…

December 11, 2022 by M S R

అయిపోయింది… ఓటీటీలోకి వచ్చేసింది… థియేటర్లలోనూ చల్లబడింది… టీవీల్లో ప్రసారం బాకీ ఉంది… కాంతార మొత్తానికి ఒక చరిత్ర లిఖించి వెనక్కి వెళ్లిపోతోంది… బెంగుళూరులో 50 షోలు వేస్తున్నారు… అదంతా హాంగోవర్ బ్యాచ్.. మరి సీక్వెల్..? ఎస్, ఒక సినిమా సక్సెస్ అయితే వెంటనే సీక్వెల్ తీసి జనం మీదకు వదలడం, సొమ్ము చేసుకోవడం అలవాటు కదా… మరి రిషబ్ శెట్టి, ఈ సినిమా నిర్మాతలు హొంబళె ఫిలిమ్స్ చేసేది కూడా ఆ వ్యాపారమే కదా…

సీక్వెల్‌కు రెడీ అయిపోయారు… మరి అదే కాంతార మ్యాజిక్ రిపిటీ అవుతుందా..? చెప్పలేం… కేజీఎఫ్, బాహుబలి కాలేదా ఏం..? కానీ కాంతారకు ఆ చాన్సులు తక్కువ అనిపిస్తుంది… కాంతార సూపర్ హిట్ అయి భారీగా వసూళ్లు సాధించడానికి అనువైన పరిస్థితులు మళ్లీ అలాగే రావాలని ఏమీ లేదు… రావొద్దనీ ఏమీ లేదు…

రిషబ్‌కు ప్రచారం ఎలా చేసుకోవాలో మాత్రం బాగా మెళకువ పట్టుబడింది… నాకు క్లైమాక్స్ చిత్రీకరణలో గుళిగ దేవుడు ఓ మాట చెప్పాడు, నేనెవరికీ చెప్పను అని ఇంటర్వ్యూల్లో చెప్పాడు… ఇదొక తరహా ప్రచారం… ఇప్పుడు ఏం చేశారంటే..? హొంబళె ఫిలిమ్స్ అధినేత విజయ్ కిర్గందూర్‌తో కలిసి రిషబ్ మంగళూరు శివార్లలో నిర్వహించిన ఓ భూత కోల ప్రదర్శనకు వెళ్లాడు… ప్రధాన పూజారి కృష్ణ అడిగ… ఇది కద్రి మంజునాథేశ్వర గుడిలో జరిగింది…

Ads

తను వెళ్లిందే సీక్వెల్ కోసం తగిన ఆశీస్సుల కోసం… అదీ పంజుర్లి దేవుడి అనుగ్రహం కోసం… మొక్కుకున్నాడు… పంజుర్లి దేవుడు ఎవరినో ఆవహించి, రిషబ్‌ను ఆశీర్వదించాడు… అనుమతించాడు… అంతేకాదు, రిషబ్‌కు కొన్ని హెచ్చరికలు కూడా చేశాడు… అవేమిటో రిషబ్ చెప్పడు, కాకపోతే హెచ్చరికలు వచ్చిన మాట నిజం అంటాడు… అదీ ఓ ప్రచారం…

తన కాంతార టీం మొత్తాన్ని పిలిచాడు రిషబ్… మళ్లీ అదే టీం అని చెప్పాడు… అందరినీ జుత్తు పెంచుకోవాలన్నాడు… అదీ భూతకోలలో ఓ పార్టే… తదుపరి వర్షకాలం ప్రారంభమయ్యేలోపు ఈ సీక్వెల్ షూటింగు స్టార్ట్ చేయాలనేది ఆలోచన… కాకపోతే ఈసారి మరీ ఆ 15 కోట్ల బడ్జెట్ గాకుండా హొంబళె ఫిలిమ్స్ వాళ్లు రిషబ్‌కు స్వేచ్ఛనిచ్చారట… ఇచ్చే ఉంటారు… కాంతార ఫస్ట్ పార్ట్ లాభాలతో ఓ పది సినిమాలు తీయవచ్చు… సో, మంగుళూరు బ్యాచూ, బీ రెడీ…

అవునూ, పంజుర్లి దేవుడు రిషబ్‌కు ఏం హెచ్చరిక చేసి ఉంటాడు..? భక్తా… ఆ నవరసం వంటి పాటలు నీకెందుకురా..? కర్నాటక సంగీతంలోని మేళకర్త రాగాల్లో ఎన్ని శ్రావ్యమైనవి లేవు..? వరాహరూపం వంటి పాటల విషయంలో కాస్త జాగ్రత్త… కోర్టులు, కేసులు, బదనాం ఎందుకు చెప్పు అని చెవిలోనే స్ట్రాంగ్ హెచ్చరికలు జారీ చేసి ఉంటాడు…! అలాగే ఆ తలతిక్క రష్మికను కూడా వదిలేయాలని సూచించి ఉంటాడు..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • దిల్ రాజు మారడు… ఎవడూ తన కళ్లకు ఆనడు… ప్రతి మాటలో అహం..!!
  • ‘సంఘ్’ నేపథ్యమే ప్రధాన అర్హతా..? చంద్రబాబు మాటే చెల్లుబాటా..?!
  • కామాఖ్య కాదు… మన ‘మహా నేతలూ’ నమ్మిన ఈ తాంత్రిక గుడి వేరు…
  • షెఫాలి – స్వేచ్ఛ … ఇద్దరి జీవితాలు… ఒకటే జీవితపాఠం… 
  • అసలెవరీ “సుండలోడు”….” సుండలాయన”….” సుండల్‌క్కారన్”….?
  • ‘రా’ కొత్త చీఫ్‌గా ఆపరేషన్ సిందూర్ మాస్టర్ మైండ్..!!
  • చిరంజీవే హీరో అయినాసరే… మాధవి పాత్రదే అల్టిమేట్ డామినేషన్…
  • ప్రధానిపై క్షుద్ర పూజల ప్రయోగం… విరుగుడుగా ప్రత్యేక పూజలు…
  • బీఆర్ఎస్ పంథాలో ఏమిటీ మార్పు… KCR ఉద్యమ ధోరణికి వ్యతిరేకం…
  • అక్షయ్, శరత్‌కుమార్, మోహన్‌లాల్ ఫెయిల్… విష్ణు, ప్రభాస్ పాస్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions