ఎవరో నోటికొచ్చింది కూసిన మాటలు కావు… విదేశాంగశాఖ మంత్రి ప్రతి మాటనూ ఆచితూచి వదులుతాడు… చైనాకు ఝలక్ అయినా సరే, పాకిస్థాన్‌కు హెచ్చరిక అయినా సరే… అంతెందుకు, అమెరికాకు కూడా వాతలు పెడుతున్నాడు ఈమధ్య… తను ఒక మాట అన్నాడంటే అది మన విదేశాంగ నీతికి సంబంధించి ఫైనల్… దటీజ్ జైశంకర్…
నిన్న ఎక్కడో మాట్లాడుతూ ఓ ఇంట్రస్టింగ్ విషయాన్ని వెల్లడించాడు… రాజకీయ సొల్లు వార్తల్లో తడిసి ముద్దయి, పునీతమయ్యే మన మెయిన్ స్ట్రీమ్‌కు పెద్దగా పట్టలేదు… ఓసారి పూర్వరంగం చెబుతాను… దేశవిభజన సమయంలో సిక్కులు పరమపవిత్రంగా భావించే కర్తార్‌పూర్ గురుద్వారా పాకిస్థాన్‌లో ఉండిపోయింది… సో, ఓ కారిడార్ నిర్మించి, సిక్కులు అక్కడికి వెళ్లే వెసులుబాటు క్రియేట్ చేశారు ఈమధ్య…
సేమ్, పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లోకి ప్రసిద్ధ శారదా పీఠం వెళ్లిపోయింది… ఆదరణ లేక శిథిలావస్థకు చేరింది… దాన్ని ఎలాగైనా పునరుద్ధరించాలనే ప్రయత్నాలు సైన్యం సాయంతో సాగుతున్నయ్… సరస్వతీ దేవికి ఉన్న ఏకైక పీఠం అది… బహుశా కొద్దికాలంలో దాని పునరుద్దరణ సాధ్యం కావచ్చు… ఇక అసలు విషయానికి వద్దాం…
Ads
హిందూ సామ్రాజ్యాలు పరిఢవిల్లినప్పుడు… ప్రత్యేకించి తమిళ రాజ్యాలు సముద్రంపై గ్రిప్ సంపాదించి, తూర్పు దేశాలతో సంబంధాలు పెంచుకున్నారు… మన ధర్మాన్ని విస్తరించారు… గుళ్లు కట్టారు… ఫిలిప్పీన్స్, కాంబోడియా, వియత్నాం, తైవాన్, ఇండొనేషియా… ఇలా చాలా దేశాలు… కాంబోడియాలో అలా కట్టిన అంగకార్ వాట్ గుడి ప్రపంచంలోకెల్లా అతి పెద్ద హిందూ దేవాలయం… దాని వాస్తు విశేషాలు చెప్పాలంటే ఇక్కడ సరిపోదు గానీ… అదొక అద్భుత నిర్మాణం…
దాని పునరుద్ధరణకు ఇండియా సాయం చేయబోతోంది ఇప్పుడు… అదీ జైశంకర్ చెప్పింది… అయోధ్య మాత్రమే కాదు… అంగకార్ వాట్ కూడా కేంద్ర సర్కారు ఎజెండాలో ఉంది… అదీ విశేషం… ఒక వారణాసి పునర్నిర్మాణం, ఒక అయోధ్య నిర్మాణం, ఒక అంగకార్ వాట్ పునరుద్దరణ మాత్రమే కాదు… శ్రీలంకలో తిరుకేతీశ్వర గుడి పునరుద్దరణకు కూడా నిధులు ఇస్తోంది… 13.6 కోట్లు అంచనా… అంతకుముందు అక్కడే రామాయణ కారిడార్ అభివృద్ధికి నిధులిచ్చింది…
….(ఈ ఫోటో ఉపరాష్ట్రపతి జగదీప్ ధనకర్, జైశంకర్ అంగకార్ వాట్ సందర్శించినప్పటిది)…
ఎక్కడెక్కడో ఉన్న హిందూ గుళ్ల పునరుద్దరణ ద్వారా ఏదో పాత వైభవ ప్రదర్శన చేయడం కాదు… దేశాల నడుమ ధార్మిక సత్సంబంధాలు పెంచుకోవడం… అన్ని గుళ్లకూ ఎలాగూ నిధులు ఇవ్వలేం, కానీ కొన్ని ముఖ్యమైన గుళ్లను ఓన్ చేసుకోవడం కూడా ఓ దౌత్యనీతే… శ్రీలంక మాత్రమే కాదు, పలు దేశాల నుంచి రెగ్యులర్‌గా అధ్యక్షులు, ప్రధానులు వస్తుంటారు తిరుమలకు… ఇండియాలోని వీవీఐపీలకు ఇచ్చే ప్రొటోకాల్ వాళ్లకు కూడా ఇస్తున్నారు… అది స్పిరిట్యుయల్ కర్టెసీ…
అబ్బే, ఇలాంటి వాటితో దేశాలు తమ పొలిటికల్ లైన్స్ మార్చుకుంటాయా, చైనా ఒక్కసారి నిధులు విదిలిస్తే మళ్లీ జిన్‌పింగ్ కాళ్ల మీద పడిపోతాయి ఈ దేశాలు అంటారా..? కానివ్వండి… మన మర్యాదను ఎందుకు పోగొట్టుకోవాలి… ఎలాగూ మన వ్యూహాలు మనకుంటాయి కదా… ఆ జిన్‌పింగ్‌నే మహాబలిపురం తీసుకొచ్చి, మర్యాద చేయలేదా..? దేనిది దానికే..!!
Share this Article