ఆ మైన్ ప్రూఫ్ వెహికిల్ కలర్ మీద, ఎత్తు మీద, టైర్ల మీద, రిజిస్ట్రేషన్ చిక్కుల మీద బొచ్చెడు వార్తలు రాశారు, అయిపోయినయ్ కదా… తెలంగాణ సర్కారుకు ఈ చిన్న విషయాల మీద ఆసక్తి ఉండదు…. ప్రస్తుతానికి పవన్ కల్యాణ్ స్నేహితుడూ కాదు, ప్రత్యర్థీ కాదు… ఆలివ్ గ్రీన్ బదులు ఎమరాల్డ్ గ్రీన్ అని రాసేసి, ఓ నంబర్ ఇచ్చేసి, రిజిస్ట్రేషన్ మమ అనిపించేశారు… అసలు అది కాదు కాస్త చూడాల్సింది…
ఈ ట్రక్కులో… ఓహ్, క్యారవాన్ అనాలేమో… యుద్ధరథం అనాలేమో… ప్రచారవాహనం అనాలేమో… ఎలాగూ తెలంగాణలో 32 సీట్లపై కన్నేశాడట… షూటింగుల నడుమ కష్టంగా కాస్త గ్యాప్ తీసుకుని, తెలంగాణలో ఈ ట్రక్కు యాత్ర చేస్తాడా..? చేస్తే బీఆర్ఎస్ సహిస్తుందా..? అదీ ప్రశ్న… ప్రస్తుతానికి పవన్ కల్యాణ్‌ను బీఆర్ఎస్ పెద్దగా దేకదు… అయితే కాంట్రవర్సీల జోలికి పోతే మాత్రం పెట్రోల్ పాకెట్లు, రాళ్లు, కట్టెలతో బీఆర్ఎస్ నాయకులు రెడీగా ఉంటారు…
Ads
ఏయ్, ఎంత మాట… ఎవడ్రా మమ్మల్ని ఆపేది, అసలే ఇక్కడ ఉస్తాద్ భగత్‌సింగ్, ఒక్కొక్కడి తాట తీస్తాం, అగ్గి మండిస్తాం అని సినిమా డైలాగులు వదిలితే బీఆర్ఎస్ శ్రేణులు మరింత రెచ్చిపోతాయి… నా ఫ్యానాభిమానులు చెలరేగి బీఆర్ఎస్ శ్రేణుల తాటతీస్తాయి అని పవన్ గనుక అనుకుంటే ఫాఫం అనుకోవాలి… అంతే… షర్మిల లేడీ లీడర్ కాబట్టి, మా దోస్త్ జగన్ చెల్లె కాబట్టి జస్ట్, టేస్ట్ చూపించాం తప్ప మా మార్క్ దాడి అసలు తీవ్రత చూపించలేదు…
అవునూ, ఈ 32 సీట్లను ఏకపక్షంగా ఖరారు చేసుకున్నట్టేనా..? మిగతావి బీజేపీకి వదిలేసినట్టా..? అసలు ఏపీకి మాత్రమే రోడ్ మ్యాప్ ఉంటుందా..? తెలంగాణకు కూడా ఉంటుందా..? ఇక్కడ ఆల్రెడీ బండి సంజయ్, ధర్మపురి అర్వింద్ వంటి కాపు కిరీటాలున్నయ్, ఇంకా ఆంధ్రా కాపు మాణిక్యాలు దేనికి..? ఎలాగూ బీజేపీకి 119 సీట్లలో అభ్యర్థులు లేరు కాబట్టి, 32 నేను సెలెక్ట్ చేసుకుంటాను, మిగతావి మీ ఇష్టం అంటున్నట్టు భావించాలా..?
బీఆర్ఎస్ సహిస్తుందా ట్రక్కు యాత్రను ఇది కదా ప్రశ్న… సహించదు, పవన్ నోరిప్పితే ఏదో తీట మాట మాట్లాడతాడు… బీఆర్ఎస్కు సంబంధించి పవన్ బీజేపీ మనిషి… కాదంటే టీడీపీ మనిషి… ఆ రెండూ బీఆర్ఎస్కు పడని పార్టీలు… సో, సహించే ప్రసక్తే ఉండదు… బీఆర్ఎస్లో చాలామంది పెద్ది సుదర్శన్‌రెడ్డిలు ఉన్నారు… వాళ్లు కూడా తాటలు తీసే కళలో సిద్ధహస్తులు… పైగా బాగా రాటుదేలి, ముదిరిపోయిన కంకలు… సో, ఈ 32 సీట్లకు సంబంధించి బండి సంజయ్ ఏమైనా చెబుతాడా..? తెలంగాణలో రోడ్ మ్యాప్, మన్నూమశానం ఏమీ లేదని క్లారిటీ ఇస్తాడా..? పోతేపో, టీడీపీతో కలిసి ఏమైనా చేసుకోపో అనగలుగుతాడా..? అదీ చూడాలి…!
Share this Article