కమల్ హాసన్… జగమెరిగిన నటుడు… తన సిద్దాంతాలు, విశ్వాసాలు, వ్యాఖ్యలు, వ్యక్తిగత జీవితం గట్రా మనకు నచ్చినా నచ్చకపోయినా మంచి నటుడు… ఒకప్పటి ప్రయోగాలు మానేసినా సరే, తను చేసినన్ని ప్రయోగాలు, సాహసాలు ఏ ఇండియన్ నటుడికీ చేతకావు, కాలేదు, కావు కూడా… అయితే… తన మాటలు అప్పుడప్పుడూ చిత్రంగా, ఎవడ్రా వీడు అనేట్టుగా ఉంటయ్… అందులో ఒకటి తాజాగా…
చాన్నాళ్ల తరువాత, తప్పనిసరై, రజినీకాంత్ కూడా స్పందించాడు కాబట్టి తనూ స్పందిస్తూ… కాంతారను ప్రశంసించాడు… ఆ సందర్బంగా నేను కూడా కన్నడ ఇండస్ట్రీకి చెందినవాడిని కాబట్టి గర్విస్తున్నాడు అన్నాడు… మెంటల్ కామెంట్… తనకూ కన్నడ ఇండస్ట్రీకి సంబంధం ఏమిటి అసలు..? రజినీకాంత్ అంటే బేసిక్‌గా కన్నడ రూట్స్… తను ఓన్ చేసుకుంటే అర్థముంది… కానీ కమల్ హాసన్‌కు కన్నడ ఇండస్ట్రీకి ఆ బంధం ఏముంది..?
తను పుట్టింది తమిళ అయ్యంగార్ కుటుంబంలో… తండ్రి ఓ లాయర్, శ్రీనివాసన్… తల్లి గృహిణి రాజలక్ష్మి… తన అసలు పేరు పార్థసారథి… ఇంటిపేరు హాసన్, తండ్రి తన పేరును కమల్ అని మార్చాడు… తండ్రి సమరయోధుడు కాబట్టి ముస్లిం పేరు కూడా స్ఫురించేలా కమల్ అని పెట్టాడు అని ఆమధ్య ఆర్కే ఓపెన్ హార్ట్‌లో చెప్పుకున్నాడు కమల్… కమల్ అని పేరు పెడితే అది మతసామరస్యం ఎలా అవుతుందో ఆ తండ్రికే తెలియాలి… కమల్ అంటే కమలం… పోనీలే, అదో దిక్కుమాలిన సమర్థన…
Ads
కమల్ సోదరులు చారుహాసన్, తనూ ఓ నటుడే… ఇంకొక సోదరుడు చంద్రహాసన్… వివరాలు తెలియవు… సోదరి పేరు నళిని… ఆమె ఓ శాస్త్రీయ నృత్యకారిణి… మద్రాసులోనే కమల్ చదువు, నటన, ఎదుగుదల అన్నీ… బాలనటుడిగా ఇండస్ట్రీలో ఎంట్రీ… ఇక కర్నాటకతో లింకేమిటి..? తను కన్నడంలో కూడా నటించాడు… అవీ చూద్దాం… కోకిల… దర్శకత్వం బాలుమహేంద్ర… కమల్ లీడ్ రోల్… తరువాత తప్పిడ తాళ… ఇది బాలచందర్ సినిమా… ఇందులో రజినీకాంత్ కూడా ఉన్నాడు… కమల్‌ది చిన్న పాత్రే… ఆ తరువాత మరియా మై డార్లింగ్… కన్నడ, తమిళ ద్విభాషాచిత్రం… అందులో శ్రీప్రియ హీరోయిన్…
తరువాత బెంకియల్లి అరవిద హూవు… నిజానికి ఇది సుహాసిని సినిమా… బాలచందర్ డైరక్టర్… దర్శకత్వం బాలచందర్… ఇందులో కమల్‌ది బస్ కండక్టర్‌గా ఓ చిన్న పాత్ర… అదీ తమిళ రీమేక్… నిజానికి కమల్‌ది గెస్ట్ రోల్… ఇవన్నీ అప్పుడెప్పుడో 1983లోపువి… తరువాత 2005లో రామ శామ భామ చేశాడు… సో, కన్నడ ఇండస్ట్రీని ఓన్ చేసుకోవడంలో అర్థం లేదు… తెలుగులో మంచి స్ట్రెయిట్ హిట్స్ ఇచ్చాడు కాబట్టి తెలుగును ఓన్ చేసుకున్నా ఓ అర్థముంది…
' I also belong to the #Kannada film industry. #Karnataka,the land which gave us films like #VamshaVriksha and #OndanonduKaaladalli, #Kantara is a great example ' @ikamalhaasan @FilmCompanion pic.twitter.com/azwodXtf6h
— A Sharadhaa (@sharadasrinidhi) December 12, 2022
ఇప్పుడే కాదు, ఏ సందర్బం వచ్చినా సరే, నేను కన్నడిగ అంటాడు… ఆ కన్నడ ఇండస్ట్రీకి చేసిందేమీ లేదు… 2013లో కావచ్చు బహుశా.. చెన్నైలో ఇండియన్ ఫిలిమ్ ఇండస్ట్రీ సెంటినరీ సెరెమనీలో మాట్లాడుతూ నేనూ కన్నడిగ అన్నాడు… నేను కన్నడిగుడిగా ఉండాలని కోరుకుంటాను అన్నాడు… హంబగ్… అబ్సర్డ్… కన్నడ ఇండస్ట్రీ ఏ సెలబ్రేషన్స్ చేసుకున్నా సరే, నన్ను పిలవాలి, నన్ను వారిలో ఒకరిగా గుర్తించాలని చెప్పాడు… రేప్పొద్దున ఏదైనా మంచి హిందీ సినిమాకు సంబంధించిన ప్రస్తావన వస్తే నేనూ బాలీవుడ్డే అంటాడు… అంతెందుకు దశావతారం సినిమాలో బుష్ పాత్ర, అమెరికన్ పాత్ర పోషించాను కదా, నేను హాలీవుడ్డు అంటాడు… చైనావాడి పాత్ర పోషించాడు కాబట్టి చైనా మూవీ ఇండస్ట్రీ… ఖర్చేముంది… రాయడానికి బొచ్చెడు సైట్లు, చానెల్స్…!
Share this Article