పార్ధసారధి పోట్లూరి ………. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ యూరోపులో అశాంతిని రెచ్చగొడుతున్నాడా ? జర్మనీ లో ప్రభుత్వాన్ని కూలదోయడానికి కుట్ర ? డిసెంబర్ 7, 2022 …. జర్మనీ లోని ప్రభుత్వాన్ని కూలదోసి అధికారం చేజిక్కించుకోవాలి అనే వ్యూహంతో ఉన్న 25 మంది రైట్ వింగ్ యాక్టివిస్ట్ లని అరెస్ట్ చేశారు జర్మనీ పోలీసులు ఈ నెల 7వ తారీఖున! రైట్ వింగ్ యాక్టివిస్ట్ గ్రూపు ని ప్యాట్రియాటిక్ యూనియన్ [Patriotic Union ] [జర్మన్ భాషలో Patriotische Union] గా పిలుస్తారు జర్మనీలో. వీళ్ళ ఆశయం ఏమిటంటే పూర్వపు రాచరిక వ్యవస్థని [1871 to 1918] జర్మనీ లో పునరుద్ధరించడం. Anti Semetic [యూదు వ్యతిరేక భావజాలం ]ని కలిగి ఉండడం మరియు కమ్యూనిస్ట్ లని తీవ్రంగా వ్యతిరేకించడం లాంటి వి ప్రధానంగా వీళ్ళ అజెండా లో ఉంటాయి.
*******************************************
ఎవరు ఈ ప్యాట్రియాటిక్ యూనియన్ కి ప్రాతినిద్యం వహిస్తున్నారు ?
Ads
హిట్లర్ అధికారంలోకి రాకముందు జర్మనీ రాచరిక వ్యవస్థ కి రాజు గా ఉన్న రాచ కుటుంబం వారసుడు మరియు స్వయం ప్రకటిత యువరాజు హెన్రిచ్ రియస్ [Heinrich Reuss]. అయితే ఈ సంస్థని [Reichsbürger movement] మొత్తం 50 మంది వివిధ రంగాలలో ప్రధాన భూమిక నిర్వహిస్తున్న వారు నడుపుతున్నారు.
********************************************
ఇప్పటివరకు 25 మందిని జర్మనీ లోని వివిధ నగరాలలో పట్టుకున్నారు జర్మన్ పోలీసులు. ప్రభుత్వాన్ని కూలదోయడానికి కుట్ర పన్నుతున్నారు అని దేశ ద్రోహం కింద అరెస్టులు జరుగుతున్నాయి. ఈ సంస్థ జర్మనీ మరియు అమెరికా లోని వివిధ సంస్థలతో కలిసి పనిచేస్తున్నట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. వీటిలో QAnn అనే సంస్థ కూడా ఉంది. ఈ QAnn అనే సంస్థకి చెందిన వాళ్ళు 2020 లో జర్మనీ లో విధించిన కోవిడ్ లాక్ డౌన్ ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ కర్ఫ్యూ ని సైతం లెక్క చేయకుండా వీధులలోకి వచ్చి లాక్ డౌన్ ఎత్తివేయాలి అంటూ ప్రదర్శనలు చేశారు. QAnn ప్రధాన ఆరోపణ ఏమిటంటే కోవిడ్ అనేది ప్రజలని భయభ్రాంతులని చేయడానికి ఫార్మా సంస్థలు సృష్టించిన నాటకం అని. జర్మనీ ఫార్మా రంగానికి సంబంధించి అగ్రగామి అన్న సంగతి తెలిసిందే !
*********************************************
ఈ ప్యాట్రియాటిక్ యూనియన్ లో జర్మన్ స్పెషల్ ఫోర్సెస్ కమాండ్ [Special Forces Command (KSK)]కి చెందిన రిటైర్డ్ లెఫ్టినెంట్ కల్నల్ హోదా కలిగిన వాడు ఉన్నాడు. ఇతను జర్మన్ పారాట్రూపర్ బెటాలియన్ లో పనిచేశాడు. పోలీస్, సైన్యం, ఎయిర్ ఫోర్స్ , నావీ , న్యాయశాఖ, పారిశ్రామిక రంగాలకి చెందిన వారు ఈ యూనియన్ లో చురుకుగా పనిచేస్తున్నారు. ఇప్పటికే అధునాతన ఆయుధాలు సమకూర్చుకున్నారు కూడా. జర్మనీ లోని న్యాయస్థానంలో న్యాయమూర్తిగా పనిచేస్తున్న వ్యక్తి ని కూడా అరెస్ట్ చేశారు పోలీసులు.
ఒక వేళ తిరుగుబాటు లేదా కుట్ర విజయవంతమయితే సదరు న్యాయమూర్తిని జర్మనీ న్యాయ శాఖ మంత్రిగా నియమిస్తాము అని హామీ ఇచ్చే డాక్యుమెంట్ ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు దాడులలో. అత్యాధునిక శాటిలైట్ ఫోన్ల ని కూడా స్వాధీనం చేసుకున్నారు. దాడులలో దొరికిన కొన్ని పత్రాల ద్వారా వెల్లడి అయిన విషయం ఏమిటంటే వీళ్ళకి నిధులు బ్రిటన్ నుండి వస్తున్నట్లుగా తెలిసింది. లండన్ నగరంలోని పెద్ద పెద్ద ఫైనాన్షియల్ సంస్థల నుండి నిధులు జర్మనీలోని పలు బినామీ ఖాతాలలోకి జమ అయినట్లు తెలుస్తున్నది.
***********************************************
జర్మన్ పోలీస్ అధికారులు ప్యాట్రియాటిక్ యూనియన్ లోని కీలకమయిన వ్యక్తులలో 25 మందిని ఇప్పటికే అరెస్ట్ చేశామని మరో 27 మంది కోసం తీవ్రంగా గాలిస్తున్నామని తెలిపారు. మరో షాకింగ్ న్యూస్ ఏమిటంటే జర్మనీ లోని పలు ప్రభుత్వ విభాగాలలో పనిచేస్తున్న కీలకమయిన పదవులలో ఉన్న వాళ్ళు కూడా ప్యాట్రియాటిక్ యూనియన్ కి సహకరిస్తున్నట్లుగా తెలుస్తున్నది. కొంత మంది ఉన్నతాధికారులు నేరుగా ప్యాట్రియాటిక్ యూనియన్ తో సన్నిహిత సంబంధాలని కలిగి ఉండి సహకరిస్తున్నారు. కాగా ప్రస్తుతం పదవులలో ఉన్న కీలక ఇంటలిజెన్స్ అధికారులు లోపాయికారిగా సహకరిస్తున్నారు నేరుగా మద్దతు తెలపకుండా.
****************************************************
పోలీసులకి దొరికిన కొన్ని పత్రాల ద్వారా రష్యా, అమెరికాల లోని కొన్ని ప్రభుత్వ సంస్థల నుండి ప్యాట్రియాటిక్ యూనియన్ కి సలహాలు, సూచనలతో పాటు ఆర్ధిక, ఆయుధ సహాయం కూడా అందుతున్నట్లుగా తెలుస్తున్నది.
******************************************************
అయితే ఉక్రెయిన్ మీద దాడి మొదలుపెట్టిన ఫిబ్రవరి 23 తరువాత పుతిన్ తన గూఢచార సంస్థ అయిన FSB ని జర్మనీ లోని కీలక అధికారులతో సంబంధాలని మరింత ధృఢంగా చేసుకోవాలని సూచించాడనే వార్త గత ఏప్రిల్ నెలలో వైరల్ అయినా దానిని కేవలం పుకారుగా కొట్టివేశారు కానీ ఆ వార్త నిజమని ఇప్పుడు జర్మన్ పోలీసులకి దొరికిన పత్రాలతో బయటపడ్డది.
**********************************************
అమెరికన్ సిఐఏ, రష్యన్ FSB లకి ఒక ఆటస్థలంగా మారింది జర్మనీ ! ఎవరి ఆట వాళ్ళు ఆడుతున్నారు కానీ జర్మనీ ప్రభుత్వానికి ఆలస్యంగా విషయం తెలిసినట్లుగా అనుకోవాలి! సిఐఏ కంటే పుతిన్ కే జర్మనీ అవసరం ఎక్కువగా ఉంది ప్రస్తుత పరిస్థితులని చూస్తే… కాబట్టి రష్యా పాత్రని కొట్టిపారవేయలేము. నిజానికి పుతిన్ ఒకప్పటి KGB చీఫ్ అన్న సంగతిని ఇప్పుడు ప్రస్తావించాలి !
రష్యా అధీనంలో ఉన్న ‘కలినిన్ గ్రాడ్ వొబ్లాస్ట్ ‘[Kaliningrad Oblast] అనే ప్రాంతం రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జర్మనీ లో ఒక భాగంగా ఉండేది. కానీ అప్పటి సోవియట్ దానిని తన ఆధీనంలోనే ఉంచుకుంది నాజీ జర్మనీ తో చేసుకున్న ఒప్పందం వలన. కానీ ఈ భూభాగం రష్యాతో నేరుగా సంబంధం కలిగి ఉండదు. రష్యా చుట్టూ ఎన్ని దేశాలు ఉన్నా జర్మనీ మాత్రం ముఖ్యమయినదిగా భావిస్తారు. జర్మనీ ని కనుక రష్యా ప్రభావితం చేయగలిగితే అది యూరోపులో అమెరికా పాత్రని ప్రభావితం చేయగలదు.
కాబట్టి ప్రస్తుత జర్మనీ లోని కుట్ర విషయానికి వస్తే దానిలో రష్యా పాత్ర ప్రముఖంగా ఉంటుంది. పైగా ప్రస్తుత జర్మన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఆ ప్రభుత్వాన్ని కూలదోయడానికి తీవ్రంగా శ్రమిస్తున్న ‘పాట్రియాటిక్ యూనియన్ ‘ కి రష్యాతో మరీ ముఖ్యంగా పుతిన్ తో కలిసి పనిచేయడానికి ఎలాంటి అభ్యంతరాలు ఉండవు కాబట్టే పుతిన్ దీనిని ఒక అవకాశంగా తీసుకొని ఉండవచ్చు. ఇక్కడ పుతిన్ చాణక్యం ఏమిటంటే ఎక్కడా నేరుగా తమ దేశపు ఆధారాలు దొరకకుండా కేవలం బ్రిటన్, అమెరికాల పాత్రని నిరూపించే ప్రయత్నం చేశాడు !
*******************************************************
దేశద్రోహం అనే పదం మానవహక్కులు అంటూ నిత్యం పఠించే యూరోపియన్ దేశాలకి అట్టే రుచించదు. ఇప్పుడు అరెస్ట్ చేసిన మరియు భవిష్యత్ లో అరెస్ట్ చేయబోయే ప్యాట్రియాటిక్ యూనియన్ సభ్యులని స్వేచ్ఛగా వదిలిపెడుతుందా జర్మనీ ? లేక జైళ్ల లో పెట్టి చిత్రహింసలు పెట్టి నిజాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుందా ? ఇదే జరిగితే మాత్రం కాశ్మీర్ విషయంలో టెర్రరిస్టు ల మానవ హక్కుల గురించి పదే పదే మాట్లాడే జర్మనీ ఇప్పుడు తమ దేశ ద్రోహుల విషయంలో ఏదన్నా సడలింపు ఇస్తుందా ? బహుశా మన విదేశాంగ మంత్రి జై శంకర్ ఏదో ఒక రోజున దీనిమీద నేరుగా జర్మనీ ని ప్రశ్నించే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది !
యూరోపియన్ యూనియన్ పార్లమెంట్ [European Parliamen] కి ఉపాధ్యక్షురాలిగా [Vice President] పనిచేస్తున్న ఇవ కైలి [Eva Kaili] ని అవినీతి ఆరోపణల మీద అరెస్ట్ చేశారు మూడు రోజుల క్రితం . Eva Kaili గ్రీకు దేశపు పొలిటీషియన్. యూరోపులో ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతున్నది యూరోపియన్ యూనియన్ పార్లమెంట్ కి వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్న Eva Kaili అవినీతి. యూరోపులో అశాంతి ఖచ్చితంగా ప్రపంచానికి మేలు చేసేది కాదు అని గత రెండు ప్రపంచ యుద్ధాలు సాక్ష్యంగా ఉన్నాయి…
Share this Article