మీడియా అంటే… అచ్చం రాజకీయాల తరహాలోనే..! ఎవరు ఎప్పుడు ఎవరితో అటాచ్ అయిపోతారో, ఎవరు విడిపోతారో ఎవరూ చెప్పలేరు… పక్కా డైనమిక్… ఈరోజు ఉన్న విధేయతలు, ప్రత్యర్థిత్వాలు రేప్పొద్దున ఉండకపోవచ్చు… కేసీయార్ అలా ఎంతమందిని కౌగిలించుకోలేదు..? అలా తాజాగా రవిప్రకాష్‌ను కూడా అలుముకున్నాడనేది తాజా వార్త…
రవిప్రకాష్ అంటే టీవీ9.., టీవీ9 అంటే మైహోం రామేశ్వరరావు… విత్ మేఘా కృష్ణారెడ్డి… కొంతకాలంగా ఇద్దరూ కేసీయార్‌తో కటీఫ్ చెప్పుకుని, బీజేపీ ఫోల్డ్‌లో ఉన్నారని పొలిటికల్ సర్కిళ్లలో ప్రచారం… ఆఫ్టరాల్ వ్యాపారులు… ఎవరి హవా నడిస్తే వాళ్లు… అంతెందుకు..? టీవీ9 నిర్మాత, దాని అనుబంధ పలు చానెళ్ల నిర్మాత రవిప్రకాష్ మైహోంకు ధారాదత్తం చేయాల్సిన దురవస్థ…
అప్పట్లో మైహోంకు కేసీయార్‌కు టరమ్స్ బాగున్నాయి కాబట్టి రవిప్రకాష్ వాళ్లందరికీ పడని వ్యక్తి అయ్యాడు… పట్టుబట్టి, కేసులు పెట్టి, సతాయించి మరీ బయటికి తరిమేశారు… తన మోజో టీవీని మూసేయించారు… అన్నిరకాల వేధింపులూ ఎదుర్కున్నాడు… తరువాత బీజేపీ శిబిరానికి దగ్గరయ్యాడు… సీన్ కట్ చేస్తే…
Ads
ప్రస్తుతం రవిప్రకాష్ కేసీయార్‌కు దగ్గరయ్యాడు… ఎలాగూ బీజేపీ ఫోల్డ్‌లోని మైహోంకు ప్రత్యర్థి… పైగా కేసీయార్‌కు తన జాతీయ రాజకీయాల కోసం కొత్త చానెళ్లు కావాలి… అందుకని కొత్త చానెళ్లను స్టార్ట్ చేయడంలో నైపుణ్యం ఉన్న రవిప్రకాష్ కనిపించాడు… పిలిచారు… అంతే… దోస్తీ కుదిరింది… ఆల్‌రెడీ టీన్యూస్ ఉందిగా అంటారా..? అది జస్ట్ తెలంగాణ కోసమే…
సో, కేసీయార్‌కు హిందీ, ఇంగ్లిష్ చానెళ్లు కావాలి అర్జెంటుగా… రవిప్రకాష్ కూడా సరేనన్నాడు… ఎవరిదైనా రాజకీయమే కదా… అవకాశాన్ని అంది పుచ్చుకోవడమే కదా… ఫలితం ఏమిటంటే..? ఇన్నాళ్లూ కేసీయార్ మీద విషాన్ని కక్కిన తొలివెలుగు చానెల్ పింక్ శిబిరంలోకి చేరిపోయింది… అది రవిప్రకాష్‌దే అనేది బహిరంగ రహస్యం… అంటే… కేసీయార్ కోరిన హిందీ, ఇంగ్లిష్ చానెళ్లను రవిప్రకాష్ తీసుకురాబోతున్నాడన్నమాట…
ఇలాంటివి ఎవరూ బయటికి చెప్పరు… కానీ సర్కిళ్లలో అందరికీ తెలుసు… నిజానికి చాన్నాళ్లుగా ఈ ప్రచారం ఉన్నదే… కేసీయార్ రవిప్రకాష్ సేవల్ని వినియోగించుకుని, జాతీయ స్థాయిలో ప్రచారం కోరుకుంటున్నాడు అని… రవిప్రకాష్ తరహా జర్నలిస్టిక్ ధోరణికీ, కేసీయార్ కోరుకునే భజనకూ పొంతన కుదురుతుందా లేదానేది వేరే విషయం… కానీ తనకూ వేరే దిక్కులేదు…
టీవీ9లో తనకు ఇంకా షేర్లున్నయ్… వాటిపై వివాదాలున్నయ్, కేసులున్నయ్ ట్రిబ్యునల్ వద్ద… తనకు కేసీయార్ సపోర్ట్ దొరికితే అదే పదివేలు… ష్… రవిప్రకాష్ బీజేపీకి కూడా ఇష్టుడే… ఏకంగా మోడీషాలతో కంటాక్టులోకి వెళ్లగలడు… మరి కేసీయారా..? బీజేపీయా..? కేసీయార్ సపోర్ట్ చేస్తే, తనకు ఉపయోగపడే చానెళ్లనే రవిప్రకాష్ రోజుల్లో క్రియేట్ చేసి, ఆపరేట్ చేయగలడు… ముందే చెప్పుకున్నాం కదా… రాజకీయాల్లానే జర్నలిజం కూడా వెరీ డైనమిక్… పొద్దున ఉన్న స్థితి సాయంత్రానికి ఉండదు… రవిప్రకాష్ క్యాంపు మాత్రం సైలెంటుగా ఉంది…
అవును సార్, నమస్తే తెలంగాణ ఈ ఏరియా కోసం… తెలంగాణటుడే ఇంగ్లిష్ పత్రికను జాతీయ స్థాయికి విస్తరించడమా..? హిందీ ఎడిషన్ స్టార్ట్ చేయడమా…? అయితే ఎవరు బాధ్యత తీసుకునేది..? చానెళ్లంటే సమర్థుడు రవిప్రకాష్ దొరికాడు… మరి పత్రికలు..?!
Share this Article