Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

జబర్దస్త్‌ షోలకు రేటింగ్స్ దెబ్బ… జనం వాటిని చూడటమే మానేస్తున్నారు…

December 16, 2022 by M S R

నిజానికి ఈటీవీ రేటింగ్స్‌ను నిలబెడుతున్నవి ఇన్నాళ్లూ జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్ షోలు… బూతుల షోలుగా ఎంత ప్రసిద్ధి పొందినా సరే, జనం చూస్తూనే ఉన్నారు… ఈటీవీ వాటిని అలాగే కొనసాగిస్తూనే ఉంది… ఆ షోలోకి కమెడియన్లు, జడ్జిలు వస్తుంటారు, పోతుంటారు… కానీ బేసిక్‌గా దాని ఫార్మాట్ మారదు… కాకపోతే ఒకప్పుడు స్కిట్‌ను స్కిట్‌గా ప్రదర్శించేవాళ్లు… ఇప్పుడు బాడీ షేమింగులు, ర్యాగింగ్ డైలాగులు ఎట్సెట్రా జోకులుగా చలామణీ అవుతున్నాయి…

ఈ షోలు ఎంత నాసిరకంగా మారిపోతున్నా సరే… వేరే చానెళ్లలో కామెడీ షోలు పెద్దగా క్లిక్ కాకపోవడం, కొత్త ఫార్మాట్లను ఆలోచించకపోవడంతో ఈటీవీ కామెడీ షోలు నడుస్తున్నాయి… కానీ అదంతా గతం… ఇప్పుడు జనం జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్ షోలను కూడా పట్టించుకోవడం మానేస్తున్నారు… నూకరాజు, ఇమాన్యుయెల్ వంటి ఒకరిద్దరు మినహా కొత్త కమెడియన్లు పెద్దగా రాణించడం లేదు… ఫలితంగా ఎపిసోడ్లు పేలవంగా మారిపోయాయి…

గత వారం బార్క్ రేటింగ్స్ చూడండి… జబర్దస్త్ 3.19, ఎక్స్‌ట్రా జబర్దస్త్ 2.86 స్థాయికి పడిపోయాయి… (అక్టోబరు, నవంబరు నుంచే మరీ ఈ డౌన్ ఫాల్ ఎక్కువగా ఉంది…) కాస్తోకూస్తో బెటర్ రేటింగ్స్ ఉండే శ్రీదేవి డ్రామా కంపెనీ 3.82కు పడిపోయింది… గతంలో ఈటీవీ టాప్ 30 లిస్టులో ఖచ్చితంగా జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్ ఉండేవి… ఇప్పుడవి టాప్-30 లో లేకుండా పోయాయి… దాంతో మల్లెమాల కంపెనీకి, ఈటీవికి కాస్త కళ్లు తెరుచుకున్నట్టున్నాయి… మేం వాడిని రానివ్వం, వీడిని రానివ్వం అనే పిచ్చి ఇగోలకు పోకుండా… సీనియర్ కమెడియన్లను పిలుస్తోంది…

Ads

కొత్త టీంలు ఫామ్ చేస్తోంది… తాజాగా జబర్దస్త్‌లోకి సద్దాం, యాదమ్మరాజు, శాంతికుమార్ వచ్చి చేరారు… శాంతికుమార్ చాన్నాళ్లుగా బుల్లితెరపై కనిపించడం లేదు కానీ సద్దాం, యాదమ్మరాజు ఆహా ఓటీటీలో వచ్చే కామెడీ ఎక్స్‌చేంజులో చేస్తున్నారు… మంచి టైమింగు, ఎనర్జీ ఉన్న కమెడియన్లే… పనిలోపనిగా అదే ఆహా షోలో వీళ్లతోపాటు చేస్తున్న హరిని కూడా తీసుకొచ్చేస్తే సరిపోయేది… ఆహా ఓటీటీ షోలో చేస్తున్నా సరే, ఈటీవీ షోలోకి తెచ్చుకోవడం ఈటీవీకి సంబంధించి కొత్త విశేషమే… తప్పడం లేదు మరి…

ఆహా ఓటీటీ షోలో చేస్తున్న వేణు, అవినాష్‌లతో గతంలో కొన్ని గొడవలున్నయ్… అందుకని అలాంటి సీనియర్లను ఈటీవీ పిలవదు కానీ సద్దాం, యాదమ్మరాజు, భాస్కర్, హరి వంటి కమెడియన్లతో దానికి ప్రాబ్లం లేదు… పైగా వాళ్లు ఈటీవీకి పాతకాపులే… ఈటీవీ ప్లస్ పటాస్‌లో కనిపించేవాళ్లు… జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్ షోల రేటింగ్స్ ఢమాల్ అన్నందుకు ఫాఫం కొత్త యాంకరిణి సౌమ్యను తీసేస్తారేమో… సరికాదు, ఆమె ప్లజెంటుగా బాగానే ఉంది… గతంలో జీతెలుగులో అలా ఒకరిద్దరు యాంకర్లను తీసేశారు కూడా… ఐనా చాలా చాలా సీనియర్ రష్మి యాంకరింగ్ చేసే షోకు కూడా రేటింగ్స్ లేవుగా…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఫిక్సింగ్… విజయోత్సవాల్లో ఏదో కుట్రకోణం… 11 మంది ఉసురు తీసిందెవరు..?
  • ఆహా… ఏం తెలివి..? ఆటో-పే సబ్‌స్క్రిప్షన్ తిర‘కాసులు’…!!
  • ఏడీ..? ఏమైపోయాడు నేను ప్రేమించిన ఆ నా మణిరత్నం..?!
  • భారీ డిజాస్టర్ దిశగా థగ్ లైఫ్… హిందీవాడు అడ్డంగా ఛీకొట్టేశాడు…
  • అమెరికా అధ్యక్షుడు… ఆ టేబుల్‌కు ఆ రెండు ఇంపార్టెంట్ బటన్లు…
  • మహేష్ బాబును త్వరగా పంపించేయండి, నిద్రకు ఆగలేడు… కెవ్వు కేక..!!
  • తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరం కాక..! అసలు దోషి ఎవరు..?!
  • మిలమిల మెరిసిన తార… వెన్నెల పైటేసిన కిన్నెరసాని…
  • అల్లరి నవ్వుల అల్లు రామలింగయ్య … మనెవ్వరికీ తెలియని ఓ ఫ్లాష్ బ్యాక్ …
  • సో, ప్లీజ్… దయచేసి ఎవరూ ఆ ఇద్దరికి మాత్రం ఈ స్టోరీ చూపించొద్దు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions